Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 24, 2024
Tuesday, September 24, 2024

జెత్వానీ కేసులోఏడుగురు నిందితులు

. ఎ2గా పీఎస్సార్‌, ఏ3 కాంతిరాణా, ఏ`6 విశాల్‌గున్నీ
. విద్యాసాగర్‌ రిమాండ్‌ రిపోర్టులో పోలీసుల వెల్లడి

విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో ముగ్గురు ఐఏఎస్‌లు నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో ఏ1 గా ఉన్న కుక్కల విద్యాసాగర్‌ రిమాండ్‌ రిపోర్టును పోలీసులు సోమవారం కోర్టుకు సమర్పించారు. దీనిలో 2 నుంచి 6 వరకు పోలీస్‌ అధికారుల పేర్లను నిందితులుగా చేర్చారు. ఏ2గా పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, ఏ3గా కాంతిరాణా, ఏ4గా వెస్ట్‌జోన్‌ మాజీ ఏసీపీ హనుమంతరావు, ఏ5గా ఇబ్రహీంపట్నం మాజీ సీఐ సత్యనారాయణ, ఏ6గా విశాల్‌గున్నీ పేర్లు ఉన్నాయి. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఐదుగురు పోలీస్‌ అధికారులను సస్పెండ్‌ చేసింది. కాదంబరి జెత్వానీని అక్రమంగా అరెస్టు చేయడంలో ప్రధాన నిందితుడు విద్యాసాగర్‌తో ఈ పోలీస్‌ అధికారులంతా కుమ్మక్కైనట్లు రిమాండ్‌ రిపోర్టులో పోలీసులు వెల్లడిరచారు. జెత్వానీని అరెస్ట్‌ చేయాలని ఈ ఏడాది జనవరి 30న కాంతిరాణా టాటా, విశాల్‌ గున్నీలను పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు ఆదేశించారు. ఫిబ్రవరి 1న ముంబై వెళ్లే పోలీసు బృందానికి అప్పటి సీపీ కాంతి రాణా విమాన టికెట్లు బుక్‌ చేశారు. అయితే హీరోయిన్‌పై ఫిబ్రవరి 2న కేసు నమోదు చేశారు. కేసు నమోదు కంటే ముందే టికెట్లు కొనుగోలు చేసిన తీరును పరిశీలిస్తే ముందస్తు ప్రణాళిక ప్రకారమే నటిపై కేసు నమోదు చేసినట్లు స్పష్టమవుతుందని రిమాండ్‌ నివేదికలో తేల్చారు. అనంతరం ముంబై వెళ్లి ఫిబ్రవరి 3న నటితో పాటు ఆమె తల్లిదండ్రులను అరెస్ట్‌ చేసి విజయవాడ తరలించారని, వైసీపీకి చెందిన విద్యాసాగర్‌ పలుకుబడికి ఐపీఎస్‌ అధికారులు ప్రభావితమైనట్లు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. నిందితుడు విద్యాసాగర్‌ నకిలీ భూ పత్రాలు తయారు చేశారని తెలిపారు. ఆ డాక్యుమెంట్లపై జెత్వానీ సంతకం లేదని, ఆమెకు తెలియకుండానే ఆమె బ్యాగులో డాక్యుమెంట్లు ఉంచి, నటిపై అక్రమంగా కేసు బనాయించినట్లు స్పష్టమవుతోందని తెలిపారు. విద్యాసాగర్‌ను డెహ్రాడూన్‌ నుంచి రైలులో అర్ధరాత్రి తీసుకొచ్చిన పోలీసులు… ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌కు, తదుపరి విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేసి… విజయవాడ కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. న్యాయమూర్తి వచ్చే నెల 4 వరకు విద్యాసాగర్‌కు రిమాండ్‌ విధించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img