Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

పోలీసులకు సవాల్‌

. సెల్‌, కారు, గన్‌మెన్‌లను వదలి అజ్ఞాతంలోకి ‘పిన్నెల్లి’
. అరెస్ట్‌ జాప్యంపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్‌
. తెలుగు రాష్ట్రాల్లో 8 బృందాలతో ముమ్మర గాలింపు
. రెండు రోజులుగా అంతుచిక్కని రామకృష్ణారెడ్డి జాడ
. అరెస్ట్‌ చేసి తీరుతామన్న సీఈవో మీనా

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్‌ పోలీసులకు సవాల్‌గా మారింది. పల్నాడు జిల్లా రెంటచింతల మండలం పాల్వాయిగేటు పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం ఘటనలో పిన్నెల్లిపై 10 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం పిన్నెల్లిని తక్షణమే అరెస్ట్‌ చేయాలని రాష్ట్ర పోలీసులను ఆదేశించింది. దాంతో పిన్నెల్లిని అరెస్ట్‌ చేసేందుకు పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. పిన్నెల్లి మాత్రం సినీఫక్కీలో తప్పించుకు తిరుగుతున్నారు. ఆయన ఫోన్‌, కారు, గన్‌మెన్‌లను సైతం వదిలేసి అజ్ఞాతంలోకి వెళ్లడంతో పోలీసులకు ఆయన జాడ అంతుచిక్కడం లేదు. ప్రస్తుతం ఆయన ఆచూకీ కోసం 8 ప్రత్యేక పోలీస్‌ బృందాలు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో జల్లెడ పడుతున్నాయి. చెన్నై, బెంగళూరుల్లో ఉన్న ఆయన సన్నిహితులనూ వాకబు చేస్తున్నారు. అయితే పిన్నెల్లి తప్పించుకోవడానికి పోలీస్‌ అధికారులే కొందరు సహకరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈనెల 13వ తేదీన పోలింగ్‌ సందర్భంగా ఈవీఎం మిషన్‌ను పిన్నెల్లి ధ్వంసం చేయడంతోపాటు… ఆ తర్వాత రోజు కూడా మాచర్ల నియోజకవర్గంలో జరిగిన హింసాత్మక ఘటనల్లో ఆయన ప్రత్యక్షంగా పాల్గొన్నారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించిన తర్వాతే స్థానిక పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈసీ ఆదేశంతో ఈనెల 15వ తేదీన పిన్నెల్లి సోదరులిద్దరినీ గృహనిర్బంధం చేశారు. అయినా వారిద్దరూ పోలీసుల కళ్లుగప్పి ఇంట్లోంచి పరారయ్యారు. ఇందుకు కొందరు పోలీసులు సహకరించారని ప్రత్యర్థులు ఆరోపించారు. అలాగే హైదరాబాద్‌ ఇస్నాపూర్‌లోని ఒక గెస్ట్‌ హౌస్‌లో ఆయన ఉన్నట్లు గుర్తించి అరెస్ట్‌ చేసేందుకు వెళ్లిన పోలీసులను పిన్నెల్లి మరోసారి బురిడీ కొట్టించారు. ఆయన కారును పోలీసులు వెంబడిరచగా, కొద్దిదూరం తర్వాత ఆయన తన సెల్‌, గన్‌మెన్‌లు, కారును వదిలేసి అదృశ్యమయ్యారు. దీనికి కూడా పోలీసుల సహకారమే కారణంగా పేర్కొంటున్నారు. గన్‌మెన్‌లకు వాస్తవం తెలిసే అవకాశం ఉన్నప్పటికీ వారు తమకేం తెలియదని బుకాయిస్తున్నారు. మరోవైపు పిన్నెల్లి అరెస్ట్‌ జాప్యంపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేస్తుండడంతో రాష్ట్ర డీజీపీ. సీఈఓ ద్వారా కేంద్ర ఎన్నికల కమిషన్‌కు నివేదిక పంపారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేసేందుకు 8 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు నివేదికలో పేర్కొన్నారు. పిన్నెల్లిపై మొత్తం 10 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసేందుకు పాలనా విభాగం అదనపు ఎస్పీ అధ్వర్యంలో ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు ముమ్మరంగా చేపడుతున్నాయని తెలిపారు. లుకౌట్‌ నోటీసులు జారీ చేసి విదేశాలకు పారిపోకుండా ఎయిర్‌పోర్టులను అప్రమత్తం చేశామని నివేదికలో పేర్కొన్నారు. పిన్నెల్లిని త్వరలోనే అరెస్టు చేస్తామని డీజీిపీ తెలిపారు.
ఇంకోవైపు నర్సరావుపేట కోర్టులో పిన్నెల్లి గురువారం లొంగిపోతున్నారన్న పుకార్లు వ్యాపించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. నరసరావుపేట కోర్టు ఆవరణలో భారీ సంఖ్యలో పోలీసులు పహారా కాశారు. కోర్టు ముగిసే సమయం వరకు వేచి చూసినప్పటికీ పిన్నెల్లి రాకపోవడంతో నిరాశతో వెనుతిరిగారు.
అరెస్ట్‌ చేసి తీరుతాం: సీఈవో మీనా
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు విషయంలో ఈసీ సీరియస్‌గా ఉందని, త్వరలోనే అరెస్టు చేసి తీరుతామని సీఈవో ముకేశ్‌ కుమార్‌ మీనా స్పష్టం చేశారు. మాచర్ల నియోజకవర్గం పరిధిలోని పాల్వాయిగేటు పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం ఘటనలో సరైన సమాచారం ఇవ్వనందుకు విధుల్లో ఉన్న పీవో, ఏపీవోలను సస్పెండ్‌ చేయాలని ఆదేశాలిచ్చినట్టు తెలిపారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేసేందుకు ఎస్పీ, డీఎస్పీలతో 8 పోలీసు బృందాలు పనిచేస్తున్నాయన్నారు. మాచర్ల నియోజకవర్గంలో గాయపడిన కార్యకర్తల్ని పరామర్శించేందుకు టీడీపీ నేతలు వెళ్లటం ఇప్పుడు మంచిది కాదని, ఇప్పుడిప్పుడే పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయన్నారు. పరామర్శకు ఈ సమయంలో వెళ్లొద్దని రాజకీయ నేతలకు విజ్ఞప్తి చేశారు. బయటి నుంచి నేతలెవరూ పరామర్శకు వెళ్లకూడదని, ఎవరినీ ఆ గ్రామాలకు వెళ్లనీయొద్దని పోలీసులకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. పాల్వాయిగేట్‌ పోలింగ్‌ కేంద్రంలో పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేసిన దృశ్యాలు ఈసీ నుంచి బయటకు వెళ్లలేదని, దర్యాప్తు సమయంలో ఎక్కడో, ఎవరి చేతి నుంచో అవి బయటకు వెళ్లాయని, దానిపైనా విచారిస్తున్నామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈనెల 25 నుంచి స్ట్రాంగ్‌ రూమ్‌లను పరిశీలించేందుకు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్నట్లు మీనా వెల్లడిరచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img