Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

ప్రజలే నా సైన్యం

. సంక్షేమమే నా అస్త్రం
. మరో విజయానికి సిద్ధం
. దెందులూరు సభలో సీఎం జగన్‌

విశాలాంధ్ర బ్యూరో – ఏలూరు : ప్రజలే నా సైన్యమని, సంక్షేమమే నా అస్త్రమని ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు. పేదింటి భవిష్యత్తును మార్చే పరిపాలన అందించేందుకు నేను సిద్ధం… మరోసారి గెలిపించేందుకు మీరందరూ సిద్ధమా అంటూ పార్టీ శ్రేణులను ప్రశ్నించారు.
ఏలూరు జిల్లా దెందులూరులో శనివారం వైసీపీ ఎన్నికల శంఖారావం ‘సిద్ధం’ సభలో ఉభయ గోదావరి జిల్లాలు, ఉమ్మడి కృష్ణా జిల్లాలోని 50 నియోజకవర్గాల నుంచి తరలివచ్చిన పార్టీ శ్రేణులను ఉద్దేశించి సీఎం జగన్‌ ప్రసంగిస్తూ, దుష్ట చతుష్టయం మీద యుద్ధానికి సిద్ధమా… అని వైసీపీ శ్రేణులను ప్రశ్నించారు. ఎల్లో మీడియా విపక్షాల రూపంలో ఇక్కడే ఉన్నారంటూ జగన్‌ గుర్తుచేశారు. ఇంతమంది తోడేళ్ల మధ్య జగన్‌ ఒంటరిగానే కనిపిస్తాడని, విపక్షాలకు ఉన్న సైన్యం వారి పొత్తులు, ఎల్లో మీడియా అయితే కోట్లాది మంది ప్రజల హృదయాలలో మీ జగన్‌ ఉన్నాడని, ప్రజలే తన సైన్యమని తెలిపారు. ఇక్కడ కనిపిస్తున్న జనమే తన నమ్మకం, బలం అన్నారు. వైసీపీ ప్రభుత్వ చేస్తున్న సంక్షేమం, మంచిపై, పేదవాడి సంక్షేమం మీద, రాబోయే తరం విద్యావిధానాలపై విపక్షాలు దాడి చేస్తున్నాయని విమర్శించారు. గ్రామాల్లో మార్పు కనిపిస్తోందని, తమ సంక్షేమ పాలనకు ప్రతి పేద కుటుంబమే సాక్ష్యమన్నారు. రాబోయే ఎన్నికలలో మరోసారి విజయం సాధించడమే తమ లక్ష్యమన్నారు. ప్రభుత్వం నూరు శాతం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఏం చేశారో ప్రశ్నించాలని జగన్‌ సూచించారు. చంద్రబాబు, జగన్‌ పాలనకు మధ్య తేడాను గమనించాలన్నారు. 57 నెలల్లో 124 సార్లు బటన్‌ నొక్కానని, తన కోసం రాబోయే ఎన్నికలలో రెండు బటన్లు నొక్కాలని కోరారు. సచివాలయ వ్యవస్థ ద్వారా లంచాలకు తావు లేకుండా పారదర్శకంగా సేవలు అందిస్తున్నామన్నారు. నాడు`నేడుతో పాఠశాలలు, ఆస్పత్రుల రూపురేఖలలో మార్పులు తీసుకువచ్చామన్నారు. తమ పాలనలో వెనుకబడిన వర్గాలకు 68 శాతం పదవులు కేటాయించామన్నారు. ప్రతి గ్రామంలో విలేజ్‌ క్లినిక్‌, రాష్ట్రంలో 15 వైద్య కళాశాలలు, నాలుగు పోర్టులు,10 షిప్పింగ్‌ హార్బర్లు నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోకు విశ్వసనీయత తెచ్చామని, ప్రతి హామీని నెరవేర్చామన్నారు. రాబోయే ఎన్నికలు పేదల భవిష్యత్తును నిర్ణయించేవన్నారు. ప్రజలే తన స్టార్‌ క్యాంపెయినర్లని అన్నారు. జరుగుతున్న మంచి కొనసాగాలంటే జగన్‌ పాలన ఉండాలన్నారు.
2024 ఎన్నికల్లో జగన్‌కు ఓటు వేస్తే చంద్రగ్రహణాలు ఉండవన్నారు. 14 ఏళ్లు సీఎంగా చేసినా కూడా చెప్పుకునేందుకు ఏమీ లేనందునే చంద్రబాబు రాజకీయ మంతా పొత్తులు, జిత్తులు, నక్కజిత్తులుగా సాగుతోందన్నారు. ఈ మధ్య చంద్రబాబుకు ఎన్టీరామారావు గుర్తుకొస్తున్నారని, వెన్నుపోటు పొడిచేదీ ఆయనే, మళ్లీ ఎన్నికలప్పుడు ఎన్టీఆర్‌ను గుర్తు తెచ్చుకునేదీ ఆయనేనని తెలిపారు. ఈ మధ్య కాలంలో తెలుగుదేశం పిలుస్తోంది రా కదలిరా అంటున్నారని, ప్రజలను కాదని, పార్టీలను, దత్తపుత్రుడిని పిలుస్తున్నాడని అన్నారు. కమలం పార్టీలో చేరి అక్కడ నా మనిషిగా రా కదలిరా అని వాళ్ల వదినమ్మను పిలుస్తున్నాడని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని అన్యాయంగా, అడ్డగోలుగా విడగొట్టిన రాష్ట్ర ద్రోహుల పార్టీని, వైఎస్సార్‌ మరణం తర్వాత ఆయన పేరును అన్యాయంగా ఛార్జ్‌షీట్‌లో పెట్టిన నమ్మకద్రోహుల పార్టీని రా కదలిరా అని చంద్రబాబు పిలుస్తున్నాడని తెలిపారు. చంద్రబాబుకు పొత్తే లేకపోతే కనీసం 175 చోట్ల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా లేరన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ తమ కార్యకర్తలతో లంచాలు, పక్షపాతంతో కొద్ది మందికి మాత్రమే అన్న వివక్షతో జన్మభూమి కమిటీల ద్వారా సంక్షేమ పథకాల లబ్ధిదారులను ఎంపిక చేసిందన్నారు. అయితే మన ప్రభుత్వం వలంటీర వ్యవస్థ ద్వారా ఎక్కడా వివక్ష, లంచాలు లేకుండా ప్రతి ఇంటికీ మంచి చేయగలిగామన్నారు. వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్‌ 175కు 175 ఎమ్మెల్యేలని, 25 ఎంపీలకు 25 ఎంపీలని అన్నారు. మరో మూడు నెలల్లో మనందరి ప్రభుత్వం ఇంతకుమించిన ఉత్సాహంతో కొలువుదీరుతుందంటూ జగన్‌ ప్రసంగం ముగించారు.
ఈ బహిరంగ సభలో ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్‌, ఎంపీ మిథున్‌ రెడ్డి, మంత్రులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు, తానేటి వనిత, ఇన్‌ఛార్జ్‌ మంత్రి పినిపే విశ్వరూప్‌, కొట్టు సత్యనారాయణ, శాసన సభ్యులు ఆళ్ల నాని, కొఠారు అబ్బయ్య చౌదరి, తెల్లం బాలరాజు, పుప్పాల వాసు బాబు, గ్రంధి శ్రీనివాస్‌, పేర్ని నాని తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img