Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

బీసీలకు పెద్దపీట

. 8 మందికి కేబినెట్‌లో చోటు
. కాపు4, కమ్మ4, రెడ్డి3, వైశ్య ఒకరు
. ఎస్సీ2, ఎస్టీ1, మైనార్టీ1
. 17 మంది కొత్త వారికి అవకాశం
. కేబినెట్‌లో ముగ్గురు మహిళలు
. జనసేన3, బీజేపీఒకటి

విశాలాంధ్ర బ్యూరో - అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ నూతన మంత్రివర్గం కొలువు తీరింది. సీఎం చంద్రబాబుతో పాటు మరో 24 మందితో గవర్నరు జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ మంత్రివర్గంలో ఎన్డీఏ కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) సభ్యులకు చోటు దక్కింది. టీడీపీ 20, జనసేన 3, బీజేపీ ఒకటి చొప్పున మంత్రులను కేటాయించారు. ఇందులో కులాల వారీగా చూస్తే 12 మంది ఓసీలకు, బీసీలు8, ఎస్సీ2, ఎస్టీ1, ముస్లిం మైనార్టీ`1 చొప్పున బెర్తులు లభించాయి. వారిలో ముగ్గురు మహిళలకు మంత్రి పదవులు వరించాయి. 12 మంది ఓసీలలో నలుగురు కమ్మ, నలుగురు కాపు, ముగ్గురు రెడ్డి, వైశ్య ఒకరికి అవకాశం లభించింది. జనసేన నుంచి మూడు మంత్రి పదవుల్లో పవన్‌ కల్యాణ్‌, నాదెండ్ల మనోహర్‌, కందుల దుర్గేశ్‌కు దక్కాయి. బీజేపీ నుంచి సత్యకుమార్‌ యాదవ్‌కు కేటాయించారు. మిగిలిన అన్ని మంత్రి పదవులు టీడీపీ సభ్యులకు అవకాశం లభించింది. కొత్తగా 17 మందికి మంత్రి పదవులు లభించాయి. ఓసీ కమ్మ సామాజిక వర్గం నుంచి నారా లోకేశ్‌, నాదెండ్ల మనోహర్‌ (జనసేన), పయ్యావుల కేశవ్‌, గొట్టిపాటి రవికి మంత్రి పదవులు కేటాయించారు. కాపు సామాజికవర్గం నుంచి నిమ్మల రామానాయుడు, పవన్‌ కల్యాణ్‌, కందుల దుర్గేశ్‌, నారాయణ విద్యా సంస్థల అధినేత పి.నారాయణ బెర్త్‌ దక్కించుకున్నారు. రెడ్డి సామాజిక వర్గం నుంచి ఆనం రామనారాయణ రెడ్డి, బీసీ జనార్థన్‌ రెడ్డి, మండిపల్లి రామప్రసాద్‌ రెడ్డికి చోటు లభించింది. ఆర్యవైశ్య నుంచి టీజీ భరత్‌కు కేటాయించారు. బీసీలకు కేటాయించిన ఎనిమిది మంత్రుల్లో బీసీ యాదవ సామాజిక వర్గానికి రెండు మంత్రి పదవులు దక్కాయి. వారిలో కొలుసు పార్థసారథి (టీడీపీ), సత్యకుమార్‌ (బీజేపీ) ఉన్నారు. కొల్లు రవీంద్ర (బీసీ మత్స్యకార), కె.శ్రీనివాస్‌ (బీసీ తూర్పు కాపు), కె.అచ్చెన్నాయుడు (కొప్పుల వెలమ), అనగాని సత్యప్రసాద్‌ (బీసీ గౌడ), వాసంశెట్టి సుభాష్‌ (శెట్టి బలిజ), సవిత (కురబ) కు మంత్రి పదవులు లభించాయి. కొండెపి ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామి (ఎస్సీ మాల), పాయకారావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత (ఎస్సీ మాదిగ), గుమ్మడి సంధ్యారాణి (ఎస్‌టి), ఎన్‌ఎండీ ఫరూక్‌ (ముస్లిం మైనార్టీ) కు చోటు లభించింది. ఈ మంత్రివర్గంలో తొలిసారిగా 17 మందికి చోటు లభించింది. వారిలో నారా లోకేశ్‌, కె.పవన్‌ కల్యాణ్‌, మండపల్లి రామ్‌ ప్రసాద్‌రెడ్డి, వాసంశెట్టి సుభాష్‌, టీజీ భరత్‌, ఎస్‌.సవిత, కందుల దుర్గేశ్‌, సత్యకుమార్‌ యాదవ్‌, కొండపల్లి శ్రీనివాస్‌, గుమ్మడి సంధ్యారాణి తదితరులున్నారు. గతంలో మంత్రులుగా పనిచేసి, మళ్లీ ఈసారి అవకాశం దక్కించుకున్న వారిలో కింజరాపు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, పి.నారాయణ, ఎన్‌ఎండీ ఫరూక్‌, ఆనం రామనారాయణరెడ్డి, కొలుసు పార్థసారథి ఉన్నారు. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వారిలో ఆనం రామనారాయణ రెడ్డి, కొలుసు పార్థసారథికి మంత్రి పదవులు దక్కాయి.

చంద్రబాబు మంత్రివర్గం

1.కె.పవన్‌ కల్యాణ్‌
2.నారా లోకేశ్‌
3.కింజారపు అచ్చెన్నాయుడు
4.కొల్లు రవీంద్ర
5.నాదెండ్ల మనోహర్‌
6.పొంగూరు నారాయణ
7.వంగలపూడి అనిత
8.సత్యకుమార్‌ యాదవ్‌
9.నిమ్మల రామానాయుడు
10.ఎన్‌ఎండి ఫరూక్‌
11.ఆనం రామనారాయణ రెడ్డి
12.పయ్యావుల కేశవ్‌
13.అనగాని సత్యప్రసాద్‌
14.కొలుసు పార్థసారథి
15.డోలా బాల వీరాంజనేయస్వామి
16.గొట్టిపాటి రవి
17.కందుల దుర్గేశ్‌
18.గుమ్మడి సంధ్యారాణి
19.బీసీ జనార్థన్‌ రెడ్డి
20.టీజీ భరత్‌ 21.ఎస్‌.సవిత
22.వాసంశెట్టి సుభాష్‌
23.కొండపల్లి శ్రీనివాస్‌
24.మండపల్లి రామ్‌ ప్రసాద్‌ రెడ్డి

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img