Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

మూడు ముగిసినట్టే

. వైసీపీ నినాదానికే మూడు రాజధానులు పరిమితం
. విశాఖ వెళ్లేందుకు మూడేళ్లుగా విశ్వయత్నం
. సుప్రీంలో విచారణ ఏప్రిల్‌కి వాయిదా
. ఊపిరిపీల్చుకున్న అమరావతి రైతులు

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : అమరావతి రాజధాని కేసు విచారణను సుప్రీంకోర్టు ఏప్రిల్‌కు వాయిదా వేయడంతో రైతులు ఊపిరిపీల్చుకున్నారు. ప్రస్తుతానికి వైసీపీ ప్రభుత్వంలో మూడు రాజధానుల బెడద, విశాఖకు సీఎం క్యాంపు కార్యాలయం తరలింపు ప్రక్రియ ఆగినట్లేనని అధికార పార్టీ నేతలు, అధికారులు పేర్కొంటున్నారు. త్వరలో సాధారణ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి కూడా విశాఖకు తరలివెళ్లే సాహసం చేసే అవకాశం లేదు. మొత్తానికి వైసీపీ ప్రభుత్వానికి మూడు రాజధానుల నిర్ణయం నినాదానికే పరిమితమయ్యే పరిస్థితి ఏర్పడిరది. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు కాగానే అమరావతి రాజధాని పనులు అర్ధాంతరంగా నిలిపివేసిన సీఎం జగన్‌… 2019 డిసెంబర్‌లో రాష్ట్ర సమగ్రాభివృద్ధి పేరుతో మూడు రాజధానుల వివాదాన్ని తెరపైకి తెచ్చారు.
అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదించారు. ఆ రోజు నుంచి రాజధాని నిర్మాణానికి ఉచితంగా భూములిచ్చిన రైతులు రోడ్డెక్కారు. మరోపక్క కోర్టులను ఆశ్రయించారు. ఇప్పటికీ వారి భౌతిక, న్యాయ పోరాటాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇక సీఎం జగన్‌ పరిపాలనా రాజధానిగా ప్రకటించిన విశాఖపట్నానికి తరలివెళ్లేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. మూడు రాజధానుల నిర్ణయం చెల్లదని, రైతులతో గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ప్రకారం అమరావతి రాజధానిని అభివృద్ధి చేయాలని హైకోర్టు 2022 మార్చి 3వ తేదీన స్పష్టమైన తీర్పు ఇచ్చింది. దీనిపై వెనకడుగు వేసిన రాష్ట్ర ప్రభుత్వం… అప్పీలుకు గడువు ముగిసే సమయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
కేంద్ర ప్రభుత్వంతో తొలినుంచి సత్సంబంధాలు కొనసాగిస్తున్న సీఎం జగన్‌…విశాఖ తరలివెళ్లేందుకు ప్రధాని మోదీ సహకరిస్తారని భావించారు. కానీ చట్టపరంగా అవకాశం లేకపోవడంతో కేంద్రం చేతులెత్తేసింది. దీంతో వచ్చే సాధారణ ఎన్నికల్లోపు ఎలాగైనా విశాఖకు తరలివెళ్లి…తమ పంతం నెగ్గించుకోవాలని వైసీపీ ప్రభుత్వం మరో ప్రయత్నం చేసింది. ఉత్తరాంధ్ర అభివృద్ధి పేరుతో తరచూ సమీక్షలు నిర్వహించాల్సి ఉంటుందనే నెపంతో, సీఎం క్యాంపు కార్యాలయం, మరికొన్ని ముఖ్యమైన ప్రభుత్వ శాఖల కార్యాలయాలు తరలించేందుకు ప్రణాళిక రచించారు. ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఎక్కడ నుంచైనా సమీక్షలు నిర్వహించే వెసులుబాటు ఉన్నందున, ఆ కారణంతో విశాఖకు వెళ్లాలని ప్లాన్‌ చేశారు. ఇందుకోసం విశాఖలో కార్యాలయాల ఏర్పాటుకు భవనాలను కూడా గుర్తించారు. ఈ ఏడాది దసరా నుంచి విశాఖకు తరలివెళ్లేందుకు గట్టి ప్రయత్నమే చేశారు.
కానీ రైతులు మళ్లీ కోర్టును ఆశ్రయించడంతో తరలింపు ప్రక్రియ వాయిదా పడుతూ వచ్చింది. ఈలోగా హైకోర్టు సింగిల్‌ జడ్జి కార్యాలయాల తరలింపు ప్రక్రియను ఆపాలని ఆదేశించడంతో వైసీపీ సర్కార్‌కు మరలా ఎదురుదెబ్బ తగిలింది. ఇక సుప్రీంపై చివరి ఆశలు పెట్టుకోగా, అక్కడ కూడా కేసు విచారణ ఏకంగా ఏప్రిల్‌ నెలకు వాయిదా పడిరది. దీంతో వైసీపీ ప్రభుత్వ మూడు రాజధానుల కల కలగానే మిగిలిపోయే పరిస్థితి ఏర్పడిరది. ఈలోగా సాధారణ ఎన్నికలు ముగియనున్నాయి. ఈసారి మూడు రాజధానుల పేరుతో వైసీపీ…అమరావతి రాజధాని పేరుతో టీడీపీ, మిగిలిన రాజకీయపక్షాలు ప్రజల తీర్పు కోరనున్నాయి. వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు చరమగీతం పాడితే ఇక మూడు రాజధానులు శాశ్వతంగా అటకెక్కినట్టే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img