Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

రూ.2.86 లక్షల కోట్లు

ఐదోసారి వరుసగా బడ్జెట్‌ ప్రవేశపెట్టిన బుగ్గన

. రెవెన్యూ వ్యయం రూ.2,30,110.41 కోట్లు
. మూలధన వ్యయం రూ.30,530.18 కోట్లు
. రెవెన్యూలోటు రూ.24,758.22 కోట్లు
. ద్రవ్యలోటు రూ.55,817.50 కోట్లు
. జీఎస్డీపీలో ద్రవ్యలోటు 3.51 శాతం
. రెవెన్యూలోటు 1.56 శాతం
. వ్యవసాయరంగానికి అధిక ప్రాధాన్యం
. ఐదేళ్లలో అద్భుత విజయాలు సాధించామని వెల్లడి

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి :రాష్ట్రంలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.2,86,389 కోట్ల అంచనాలతో ఓటాన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి శాసనసభలో ప్రవేశపెట్టారు. ఆయన బడ్జెట్‌ ప్రవేశపెట్టడం వరుసగా ఇది ఐదో సంవత్సరం. ముందుగా నిర్ణయించిన ముహూర్తం మేరకు అసెంబ్లీలో హాలులో బుధవారం ఉదయం 11.04 నిమిషాలకు ఆయన సభలో బడ్జెట్‌ పాఠం చదవడం ప్రారంభించారు. రూ.2,30,110 కోట్ల రెవెన్యూ వ్యయం, రూ.30,530 కోట్ల మూలధన వ్యయంతో పద్దును ప్రతిపాదించారు. రూ.24,758 కోట్ల రెవెన్యూ లోటు, రూ.55,817 కోట్ల ద్రవ్యలోటును అంచనా వేశారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ)లో 3.51 శాతం మేర ద్రవ్యలోటు, 1.56 శాతం రెవెన్యూ లోటు ఉంటుందని పేర్కొన్నారు. ‘మిమ్మల్ని మీరు తెల్సుకోవడానికి గల ఉత్తమ మార్గం ఇతరుల సేవలో మిమ్మల్ని మీరు కోల్పోవడమే’ అంటూ మహత్మాగాంధీ సందేశంతో బడ్జెట్‌ ప్రసంగాన్ని మంత్రి ప్రారంభించారు. మేనిఫెస్టోను సీఎం జగన్‌ పవిత్ర గ్రంథంగా భావించి, అన్ని హామీలను అమలు చేశారని, ఇప్పటివరకు ఎవరూ చేయని పనులను మా ప్రభుత్వం చేసిందని బుగ్గన వివరించారు. సుపరిపాలన, సామర్థ్య ఆంధ్ర, మన మహిళా మహారాణుల ఆంధ్ర, సంపన్నుల ఆంధ్ర, సంక్షేమ ఆంధ్ర, భూభద్ర ఆంధ్ర, అన్నపూర్ణ ఆంధ్ర…అనే ఏడు అంశాల ఆధారంగా బడ్జెట్‌ రూపకల్పన చేసినట్లు వెల్లడిరచారు. రాష్ట్ర సమస్యల పరిష్కారానికి పాత, మూస పద్ధతులతో కాకుండా సరికొత్త విధానాల్ని అవలంబించామని, పాలనా వికేంద్రీకరణ ద్వారా పౌరసేవలను ప్రజల వద్దకు తీసుకెళ్లేలా చర్యలు చేపట్టామని బుగ్గన వివరించారు. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్‌ చాణక్యుడి తరహాలో పాలన అందిస్తున్నారని కొనియాడారు. అంబేద్కర్‌ ఆశయాలే తమ ప్రభుత్వానికి ఆదర్శమని, రాష్ట్రంలోని ఏ బలహీన వర్గాన్నీ విస్మరించకూడదన్న వైఎస్‌ రాజశేఖరరెడ్డి స్ఫూర్తితో ఈ బడ్జెట్‌ కు రూపకల్పన చేసినట్లు తెలిపారు. బడ్జెట్‌ లో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యమిచ్చినట్లు చెప్పారు. గత 5 ఏళ్లలో తమ ప్రభుత్వం అనేక అద్భుత విజయాలు సాధించిందన్నారు. 2018-19లో 11% స్థూల ఉత్పత్తి రేటుతో రాష్ట్రం 14వ స్థానంలో ఉండగా, 2023లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి రేటు 16.2శాతానికి పెరగటం వలన 4వ స్థానానికి పురోగమించామన్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో జరిపిన వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక ప్రకారం, సులభతర వాణిజ్యంలో మన రాష్ట్రం ‘అగ్రస్థానం’ కైవసం చేసుకున్నది. 2018-19లో మన రాష్ట్ర వ్యవసాయ రంగ సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు 8.3 శాతంతో 12వ స్థానంలో ఉండగా, ఈ రోజు 13శాతం వ్యవసాయ రంగ సమ్మిళిత వార్షిక వృద్ధి రేటుతో 6వ స్థానంలో ఉందని, ఇదంతా తమ ప్రభుత్వ సమర్థ పాలనకు నిదర్శనమన్నారు. డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఉచిత పంటల బీమా పథకాన్ని రైతులందరికీ వర్తింపచేసిన మొదటి, ఏకైక రాష్ట్రం ఏపీ ఒక్కటేనని స్పష్టం చేశారు. 13 లక్షల 6 వేల మంది రైతులకు సేవలను అందిస్తూ, మన రైతు భరోసా కేంద్రాలు ప్రపంచ బ్యాంకు నుంచి ప్రశంసలు అందుకున్నాయి. ఇథియోపియా, బంగ్లాదేశ్‌ మరియు వియత్నాం దేశాల నుండి వచ్చిన ప్రతినిధులు మన రాష్ట్రంలో రైతులకు ‘విత్తనం నుండి అమ్మకం వరకు’ అందిస్తున్న భరోసాను చూసి తమ దేశాలలో అనుకరించాలనుకుం టున్నారు. సూక్ష్మ నీటిపారుదల పధ్ధతి అమలులో మన రాష్ట్రం రెండవ స్థానంలో ఉండగా, దేశంలోని మొదటి 15 జిల్లాలలో, 6 జిల్లాలు మన రాష్ట్రం నుంచే ఉన్నాయన్నారు. భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ(ఐ.సి.ఏ.ఆర్‌.) జాతీయ అరటి పరిశోధన సంస్థల నుండి ఎగుమతి కార్యకలాపాలకు గాను ఉత్తమ రాష్ట్ర అవార్డును మన రాష్ట్రము గెలుచుకుంది. 2019 సంవత్సరానికి ముందు 387 మెట్రిక్‌ టన్నుల అరటిని మాత్రమే ఎగుమతి చేయగా, నేడు ఒక లక్ష 67 వేల మెట్రిక్‌ టన్నుల అరటిని ఎగుమతిని చేస్తున్నాం. చేపల ఉత్పత్తిలో 30శాతం వాటాతో, మొత్తం సముద్ర ఆహార ఎగుమతులలో 31శాతం తో దేశంలోనే ముందంజలో ఉంది. అందుకు ఫలితంగా 2023 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వంచే ఉత్తమ సముద్ర తీర రాష్ట్రంగా అవార్డు అందుకున్నాం. పుంగనూరు పశువులను సంరక్షిస్తున్నందుకుగాను, శ్రీ వెంకటేశ్వర పశు విశ్వవిద్యాలయం, తిరుపతి భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐసీఏఆర్‌) నుండి ‘బ్రీడ్‌ కన్జర్వేషన్‌ అవార్డు’ను అందుకుంది.జాతీయ ఆహార భద్రతా చట్టం అమలులో మన రాష్ట్రం 3వ స్థానంలో ఉంది.ప్రధాన మంత్రి పట్టణ ఆవాస యోజన క్రింద ఉత్తమ పనితీరు అవార్డును అందుకున్నామని మంత్రి వివరించారు. అలాగే 2014-15 రెవిన్యూ లోటు గ్రాంటు క్రింద రూ.10,460 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం నుండి విడుదల చేయించడంలో విజయం సాధించాం. కేంద్ర ప్రభుత్వం ద్వారా తెలంగాణ రాష్ట్రము నుండి మన రాష్ట్రానికి రూ.6,756 కోట్ల రూపాయల విద్యుత్‌ బకాయిలు చెల్లించాలని ఆదేశాలు జారీ అయ్యేలా కృషి చేసాము. రాష్ట్ర పౌరసరఫరాల సంస్థకు సంబంధించి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాం. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుండి రావలసిన రూ.1050 కోట్ల గ్రాంటును రాబట్టగలిగాము. 15వ ఆర్థిక సంఘంను ఒప్పించడం ద్వారా, రూ.30,497 కోట్ల రూపాయల గరిష్ట రెవెన్యూ లోటు గ్రాంటును సాధించుకోగలిగామని మంత్రి వివరించారు. ఇక గడప గడపకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందించాం. 1.35లక్షల సచివాలయ ఉద్యోగాలు, 2.6లక్షల మంది వలంటీర్ల నియామకం చేపట్టి లబ్దిదారులకు నేరుగా సంక్షేమ పథకాలను చేరువ చేయగలిగాం. రెవెన్యూ డివిజన్లను 55 నుంచి 78కి పెంపు, 13 నుంచి 26 జిల్లాలుగా విభజన, అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం, 1000 పాఠశాలల్లో సీబీఎస్‌ఈ సిలబస్‌, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఐబీ విధానం వంటి విప్లవాత్మక సంస్కరణలను విద్యారంగంలో అమలు చేశామన్నారు.రూ.3367కోట్లతో జగనన్న విద్యాకానుక, జగన్నన గోరుముద్ద కోసం రూ.1910కోట్లు, రూ.11901 కోట్లతో జగనన్న విద్యాదీవెన, బోధనా ఆసుపత్రులకు 16,852 కోట్లు ఖర్చు, వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పరిమితి రూ.25లక్షలకు పెంపు వంటి కార్యక్రమాలు స్ఫూర్తిదాయకంగా నిలిచాయన్నారు. ఐదేళ్లలో నాలుగు లక్షల 93వేల ఉద్యోగాలు కల్పించాం. ఏపీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశాం. డీఎస్సీ ద్వారా 6100 ఉపాధ్యాయ ఖాళీల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేశాం. ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62కు పెంచాం. గత ఐదేళ్లలో రూ.4.23లక్షల కోట్లు ప్రజలకు బదిలీ చేయగా, వీటిలో డీబీటీ ద్వారా రూ.2.53లక్షల కోట్లు, నాన్‌ డీబీటీ ద్వారా రూ.1.68 కోట్లు అందించాం. విభిన్న కార్యక్రమాలు, స్ఫూర్తిదాయక పథకాలు, విస్తృత విధి విధానాలు సమ్మిళతమై మన రాష్ట్ర ప్రజల ఉజ్వల భవిష్యత్తును స్వయంగా ఎవరికి వారే లిఖించుకునే విధంగా స్వయం సాధికారత పొందే దిశలో వారిని నడిపిస్తున్నాయంటూ స్వామి వివేకానంద మాటలను బుగ్గన గుర్తుచేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img