Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

రైతులపై ఉక్కుపాదం

పార్లమెంటు ముట్టడిని అడ్డుకున్న పోలీసులు

. దిల్లీ శివారులో ఉద్రిక్తత
. నిలిచిన వేలాది వాహనాలు
. స్తంభించిన రవాణా

న్యూదిల్లీ: దేశ రాజధాని దిల్లీ శివార్లలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ నోయిడా, గ్రేటర్‌ నోయిడా పరిధిలోని రైతులు పార్లమెంట్‌ ముట్టడికి బయల్దేరడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. భారీ సంఖ్యలో బలగాలను మోహరించారు. ర్యాపిడ్‌ యాక్షన్‌ బృందాలు రంగంలోకి దిగాయి. ప్రతిఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేసి నగరంలోకి అనుమతించారు. దీంతో రహదారులపై భారీగా రవాణా స్తంభించింది. వేలాది వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఊహించని పరిణామాలు ఎదురైతే ఎదుర్కొనేందుకు వీలుగా అల్లర్ల నియంత్రణ వాహనాలను, జల ఫిరంగులను పోలీసులు సిద్ధం చేసుకున్నారు. డ్రోన్‌ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. రైతులు గుమిగూడకుండా అడ్డుకుంటున్నారు. దిల్లీలో ఇంత భారీస్థాయిలో ఆందోళన చేపట్టేందుకు రైతులు సిద్ధమవడం గత మూడేళ్లలో ఇదే తొలిసారి. ఇంతకుముందు హరియాణా, ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌ రాష్ట్రాలకు చెందిన రైతులు దిల్లీ శివార్లలో రోడ్లను దిగ్బంధించి నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. ప్లాట్లుగా అభివృద్ధి చేస్తామని నమ్మించి తమ భూమిని స్థానిక ప్రభుత్వాలు దోచుకున్నాయని, తగినంత పరిహారం చెల్లించలేదని నోయిడా, గ్రేటర్‌ నోయిడా ప్రాంత రైతులు కొంతకాలంగా ఆందోళనలు చేస్తున్నారు. తాజాగా రైతులంతా పార్లమెంట్‌ ముట్టడికి బయల్దేరారు. సమాచారం అందుకున్న నోయిడా పోలీసులు… దిల్లీలోకి ప్రవేశించకముందే రైతులను అడ్డుకున్నారు. ఈ ఆందోళనల ముసుగులో కొన్ని సంఘ విద్రోహశక్తులు హింసకు పాల్పడే అవకాశం ఉందని, రైతులు అప్రమత్తంగా వ్యవహరించాలని, వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు మంగళవారం హరియాణా, పంజాబ్‌ రాష్ట్రాలకు చెందిన రైతులు దిల్లీకి ట్రాక్టర్‌ మార్చ్‌ నిర్వహించాలని నిర్ణయించారు. కనీస మద్దతు ధరపై చట్టం తీసుకురావాలని, రైతులకు పింఛను, పంటబీమా, 2020 ఆందోళనల్లో రైతులపై పెట్టిన కేసులు కొట్టివేయాలని డిమాండ్‌ చేస్తూ పార్లమెంట్‌ వరకు ర్యాలీ చేపట్టాలని తలచారు. దీంతో మునుపటి పరిస్థితులు పునరావృతం కాకుండా హరియాణా, పంజాబ్‌ పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. గత ఆందోళనల్లో క్రియాశీలంగా పని చేసినవారిని ముందుగానే అదుపులోకి తీసుకున్నారు. ఆయా రాష్ట్రాల సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటుచేసి రాజధానిలోకి రైతులు ప్రవేశించకుండా అడ్డుకున్నారు. అంతర్‌ రాష్ట్ర సరిహద్దుల్లో ఇసుకబస్తాలతో గోడలు, సిమెంట్‌ బారికేడ్లు ఏర్పాటుచేశారు. ఆందోళనలో పాల్గొనేందుకు దిల్లీ వెళ్లాలని ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img