Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

రైతులు, కౌలు రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ చేయాలి

. పాలకుల నిర్లక్ష్యం వల్లే సాగు సంక్షోభం: గుజ్జుల ఈశ్వరయ్య, రైతు నేతలు
. రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : వ్యవసాయ రంగంలో గతంలో ఎన్నడూలేని విధంగా నెలకొన్న సంక్షోభాన్ని నివారించేందుకు తక్షణమే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ అమలు చేయాలని, వలసల నివారణకు, ఇతర రైతాంగ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని రైతు నేతలు డిమాండ్‌ చేశారు. రైతుల సమస్యల పరిష్కారం కోరుతూ గురువారం ఆంధ్రప్రదేశ్‌ రైతుసంఘం, కౌలు రైతుసంఘాల అధ్వర్యాన రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్‌ల ఎదుట ధర్నాలు నిర్వహించారు. దీనిలో భాగంగా అనంతపురం జిల్లా కలెక్టరేట్‌ ఎదుట ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లికార్జున అధ్యక్షతన వినూత్న రీతిలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ముందుగా సంగమేశ్వర సర్కిల్‌ నుండి ఎద్దుల బండ్లపై రైతులు ఉరితాళ్లకు వ్రేలాడి ఆత్మహత్యలు చేసుకున్నట్లు, మరికొందరు రైతులు తమ కుటుంబాలతో సహా ఇతర ప్రాంతాలకు వలస వెళుతున్న వేషధారణలతో ప్రదర్శన నిర్వహించారు. రైతులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుజ్జల ఈశ్వరయ్య మాట్లాడుతూ కరవు, తుపాను బారినపడిన రైతులను ఆదుకోవాలని, పంట రుణమాఫీ రెండు లక్షల పైగా ఉన్న వారికి రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. రైతులను ఆదుకోవడంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్లో రైతు సమస్యల పరిష్కారానికి ఎటువంటి కేటాయింపులు లేకపోవడం శోచనీయమన్నారు. రాయలసీమలో ఎక్కడ పడితే అక్కడ బుగ్గపడి నీరు అందుబాటులోకి వస్తోందని, అసెంబ్లీలో సాక్షాత్తు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అబద్ధాలు చెప్పడం సిగ్గుచేటన్నారు. ఆయన ఇంటి పేరు సార్థకత చేసుకున్నారని విమర్శించారు. దాదాపు 11 లక్షల కోట్ల రూపాయల రుణభారాన్ని రాష్ట్ర ప్రజలపై మోపుతూ…ఎండనక వాననక రైతులు కష్టపడి పంటలు పండిస్తుంటే వారిని ఆదుకోకపోవడం సిగ్గుచేటన్నారు. రైతు సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు చెన్నప్ప, ఆర్గనైజింగ్‌ కార్యదర్శి వన్నారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు రామకృష్ణ, కోశాధికారి బండి రామకృష్ణ, సహాయ కార్యదర్శి నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు.
రైతులకు వైసీపీ ప్రభుత్వం తీరని అన్యాయం: రామచంద్రయ్య
రైతు లందరికీ తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం రూ.2 లక్షల వరకు రుణాలు మాఫీ చేయాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు పి.రామచంద్రయ్య డిమాండ్‌ చేశారు. కర్నూలు కలెక్టరేట్‌ ముందు రైతులు ధర్నా చేశారు. రైతుసంఘం నాయకులు శ్రీనివాసరావు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో రామచంద్రయ్య, ఆంధ్రప్రదేశ్‌ రైతుసంఘం రాష్ట్ర కార్యదర్శి కె.జగన్నాథం, జిల్లా కార్యదర్శి పంపన్న గౌడ్‌ ప్రసంగించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా వైసీపీ ప్రభుత్వం రైతులకు తీరని అన్యాయం చేసిందని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో వ్యవసాయానికి నిధుల కేటాయింపు లేకపోవడం బాధాకరమన్నారు. అధికారంలోకి వస్తే రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పి, రైతుల ఆత్మహత్యలు రెట్టింపు అయ్యేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాలన సాగించాయని ధ్వజమెత్తారు. ఏఐటీయూసీి జిల్లా కార్యదర్శి మునెప్ప, సీపీఐ నగర కార్యదర్శి పి.రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పంట నష్టపరిహారమేది: జంగాల
అకాల వర్షాల వలన దెబ్బతిన్న పంటకు నష్టపరిహారంతో పాటు ప్రతి రైతు కుటుంబానికి రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జంగాల అజయ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రైతుసంఘం, కౌలు రైతు సంఘం గుంటూరు జిల్లా సమితుల అధ్వర్యంలో కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. జంగాల అజయ్‌కుమార్‌ మాట్లాడుతూ సాగుచేస్తున్న ప్రతి రైతు, కౌలు రైతు కుటుంబానికి ఎకరాకు రూ.15 వేల పెట్టుబడి సాయం అందించాలని, కరువు, తుపును, చీడపీడల వలన నష్టపోయిన రైతు, కౌలు రైతుకు తక్షణం ఇన్‌పుట్‌ సబ్సిడీ, బీమా పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఆయా సమస్యలను పరిష్కరించి తక్షణమే రైతు/కౌలు రైతు కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కొల్లి రంగారెడ్డి, పచ్చల శివాజీ, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కంజుల విఠల్‌రెడ్డి, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు యార్లగడ్డ వెంకటేశ్వరరావు, నాయకులు మేడా హనుమంతరావు, పుప్పాల సత్యనారాయణ, పి.జగన్నాథం, మరియదాసు, శంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రైతాంగాన్ని ఆదుకోండి: డేగా ప్రభాకర్‌
అనావృష్టి, అతివృష్టితో నష్టాల ఊబిలో కూరుకుపోయిన రైతాంగాన్ని తక్షణం ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు డేగా ప్రభాకర్‌ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్‌ చేశారు. జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజన్‌ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో డేగా ప్రభాకర్‌ మాట్లాడుతూ ఎన్నికల ముందు రాజకీయ పార్టీలన్నీ రైతే రాజని, దేశానికి రైతే వెన్నెముక అని ఊక దంపుడు ప్రసంగాలు చేయడం తప్ప… అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు చేసిందేమీ లేదని విమర్శించారు.
రైతు, కౌలు రైతు అనే తేడా లేకుండా పంట రుణాలు రూ.2 లక్షల వరకు రద్దు చేయాలని, కరువు వల్ల, మిచౌంగ్‌ తుపాన్‌ వల్ల నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రైతు సంఘ జిల్లా నాయకులు చిలపరెడ్డి వెంకట రెడ్డి, జమ్మి శ్రీనివాసరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు గోలిమే బాలయేసు, ఎస్‌కే బాజీ, చల్లారావు తదితరులు పాల్గొన్నారు.
సమగ్ర పంటల బీమా అమలు చేయాలి: జమలయ్య
కౌలు రైతులకు పంట రుణాలు ఇవ్వాలని, రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ ప్రకటించాలని, తక్షణమే ఇన్‌పుట్‌ సబ్సిడీ అందజేయాలని, సమగ్ర పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ కౌలురైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య డిమాండ్‌ చేశారు. రైతులు, కౌలు రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించి జిల్లా రెవెన్యూ అధికారి బి.శ్రీమన్నారాయణ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. అనంతరం జమలయ్య మాట్లాడుతూ మంత్రి బుగ్గన ప్రవేశపెట్టన రూ.2,86,389 కోట్ల రాష్ట్ర బడ్జెట్‌లో కేవలం వ్యవసాయ రంగానికి రూ.11 వేల కోట్లు మాత్రమే కేటాయించి రైతు సంక్షేమాన్ని విస్మరించడం సిగ్గుచేటన్నారు. ఇప్పటి వరకు వ్యవసాయానికి సంబంధించి రూ.25 వేల కోట్లు మురగపెట్టిన ఘనత వైసీపీ సర్కారుకే దక్కుతుందని అన్నారు. రైతు సంక్షేమానికి ఎంతో చేస్తున్నామని చెపుతున్న పాలకులు…ఐదేళ్లుగా 4,300 మంది రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఏపీ రైతుసంఘం జిల్లా కార్యదర్శి వైవీ ఆనంద్‌, నామన వెంకటేశ్వరరావు, ఎం.లక్ష్మిపతి, చెల్లబోయిన రంగారావు తదితరులు పాల్గొన్నారు.
ఒంగోలులో
ఒంగోలు కలెక్టరేట్‌ వద్ద రైతులు నిరసనకు దిగారు. ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె.వీరారెడ్డి, జిల్లా అధ్యక్షుడు వడ్డే హనుమారెడ్డి, రైతు నేతలు నాగండ్ల వెంకటేశ్వర్లు, పురిని గోపి, వడ్డే రవణమ్మ, ఎస్‌.శ్రీనివాసరావు, జి.ప్రసాదు, జి.బాలకోటయ్య, ఎం.శ్రీనివాసరావు, వెంకట్రావు, జి.గోవిందమ్మ, పి.రవి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img