Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 24, 2024
Tuesday, September 24, 2024

వరాలు ఫలించేనా?

. 12వ పీఆర్సీకి ఉద్యోగుల ఎదురుచూపు
. మధ్యంతర భృతి, కరువుభత్యం చెల్లింపుపై ఆశ
. కాలపరిమితితో కమిషన్‌ అమలుకు డిమాండ్‌
. ఆర్థిక అంశాలపై ‘కూటమి’ హామీ ప్రశ్నార్థకం

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టో పెద్దఎత్తున సంక్షేమ పథకాలు, అభివృద్ధితోపాటు ఉద్యోగులకు అనేక వరాలు కురిపించింది. దీనిలో భాగంగా 12వ వేతన సవరణ సంఘం (పీఆర్సీ) ఏర్పాటుపై ఉద్యోగులు ఎదురు చూస్తు న్నారు. మధ్యంతర భృతి (ఐఆర్‌), పెండిరగ్‌లో ఉన్న రెండు కరవు భత్యాలు (డీఏల) కూటమి ప్రభుత్వం చెల్లిస్తుందన్న ఆశతో ఉన్నారు. రాబోయే కేబినెట్‌ సమావేశంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు ఇచ్చిన హామీలపై కదలిక వస్తుందా లేదా అనేదీ స్పష్టం కానుంది. 11వ పీఆర్సీ బకాయిలనూ చెల్లిస్తుందన్న నమ్మంతో ఉద్యోగస్తులున్నారు. గత ప్రభుత్వ హయాంలో 12 జులై, 2023లో 12వ పీఆర్సీ కమిషన్‌ చైర్మన్‌గా డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌ను నియమించింది. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి ఏడాదిలోగా నివేదిక పంపాలని ఆదేశించినా, సరైన సదుపాయాల కల్పన, కార్యాచరణ లేకపోవడంతో కమిషన్‌ నివేదిక ముందుకెళ్లలేదు. ఈ లోగా సార్వత్రిక ఎన్నికలు రావడం, అనంతరం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టడంతో కమిషన్‌ చైర్మన్‌ రాజీనామా చేశారు. ఇది జరిగి దాదాపు మూడు నెలలవుతున్నా ఇంతవరకు పీఆర్సీ కమిషన్‌ నియమించకపోవడంపై ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. కేంద్రం పదేళ్ల కోసారి, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఐదేళ్లకోసారి పీఆర్సీలను ప్రకటిస్తాయి. దీని ప్రకారం రాష్ట్రంలో 12వ పీఆర్సీ అమలు గడువు 2023 జులైతోనే ముగిసిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు, అవుట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగులు కలిపి మొత్తంగా 14లక్షల మంది ఉన్నారు. వారిలో పూర్తి స్థాయి ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు పీఆర్సీ అమలు చేయాల్సి ఉంది. గత ప్రభుత్వ హయాంలో 11వ పీఆర్సీపై అశుతోశ్‌ కమిటీ ఇచ్చిన నివేదిక, దాని విధి విధానాలతో ఉద్యోగులు తీవ్రంగా నష్టపో యారు. అనేక దఫాలుగా ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు చర్చిం చినప్పటికీ వాటి అమలుకు నోచుకోలేదు.
11వ పీఆర్సీతో ఉద్యోగుల ప్రయోజనాలకు భారీగా నష్టం వాటిల్లింది. కరోనాతో ఆర్థిక పరిస్థితులు బాగాలేదన్న సాకుతో వారి ఆర్థిక పరమైన ప్రయోజనాలపై గత ప్రభుత్వం నిర్లక్ష్యం చూపింది. హెచ్‌ఓడీ, జిల్లా, మున్సిపల్‌, మండల, పంచాయతీల పరిధిలో వివిధ కేటగిరీల ఉద్యోగుల హెచ్‌ఆర్‌కు కోత విధించారు. పీఆర్సీ అడిగితే హెచ్‌ఆర్‌లో కోత విధించడాన్ని ఉద్యోగులు తప్పుపడుతున్నారు. ఐదేళ్ల కాలంలో ప్రతి ఉద్యోగి ఆయా కేటగిరీల వేతనాలకు అనుగుణంగా లక్ష నుంచి ఐదు లక్షల వరకు నష్టపోయారు. పీఆర్సీతోపాటు అన్ని ప్రయోజనాలు కలిసి దాదాపు రూ.30వేల కోట్లు ఉద్యోగులకు రావాల్సిఉంది. 2024 జనవరి, జులై డీఏలు చెల్లించాలి. కంటితుడుపు చర్యలతో ఎన్నికల్లో గత ప్రభుత్వానికి ఉద్యోగులు తగిన గుణపాఠం చెప్పారు. ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగులకు ఇచ్చిన హామీలను ఒక్కొక్క టిగా గుర్తుచేస్తున్నారు. కూటమి అధికారం లోకి వచ్చేందుకు ఉద్యోగస్తులు ఏకపక్షంగా మద్దతిచ్చారు. ఆర్థిక పరమైన అంశాలపై దృష్టిపెట్టడం లేదు. కేవలం బదిలీలపై నిషేధం తొలగింపు, రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పని దినాల కొనసాగింపునే ప్రభుత్వం అమలు చేస్తోంది. ఒకటో తేదీన వేతనాలు మంజూరు చేస్తున్నప్పటికీ, పెన్షనర్లకు వారం రోజుల తర్వాత పడుతున్నాయి. కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు ఒకటో తేదీన వేతనాలు పడటం లేదు. ముందు పూర్తిస్థాయి ఉద్యోగులకు వేతనాలు వేసి, ఆ తర్వాత కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ వారికి వేయడంపై వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఉద్యోగస్తుల ఆర్థికపరమైన అంశాల అమలుకు చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీల అంశం ప్రశ్నార్థకంగా మారింది. ప్రధానంగా మేనిఫెస్టోలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగులకు ఐఆర్‌ ప్రకటిస్తామని, 12వ పీఆర్సీ అమలు చేస్తామని వెల్లడిరచింది. పదవీ విరమణ ఉద్యోగులకు పాత స్లాబ్‌ల ప్రకారం పెన్షన్‌ చెల్లిస్తామని, ఒప్పంద ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామని కూటమి మేనిఫెస్టోలో పొందుపరిచారు. కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగస్తులకు ప్రభుత్వ పథకాలను వర్తింపజేస్తామని, సీపీఎస్‌/జీపీఎస్‌ విధానాన్ని పున:సమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారానికి కృషి చేస్తామని హామీలు ఇచ్చారు. వీటన్నిటిని కూటమి ప్రభుత్వం పక్కనపెట్టి…కేవలం ఒకటి, రెండు అంశాలపైనే ప్రధాన దృష్టి పెట్టడంపై ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికే ఆలస్యమైన 12వ పీఆర్సీ కమిషన్‌నే ప్రకటించకపోతే, ఇంకెప్పుడు పీఆర్సీని అమలు చేస్తారంటూ ఇటీవల ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. కేబినెట్‌ సమావేశంలో సీఎం చంద్రబాబు స్పందించి 12వ పీఆర్సీ కమిషన్‌కు ఒక కాల పరిమితి విధించి నియమించాలని డిమాండ్‌ చేస్తున్నారు. రెండేళ్లుగా 20వేల మంది పదవీ విరమణ చేశారు. వచ్చే మార్చిలో 15వేల మంది పదవీ విరమణ చేయనున్నారు. ఈ ఖాళీల భర్తీపైనా ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ప్రభుత్వం మాత్రం ఆర్థిక పరిస్థితులను సాకు చూపకుండా, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలుకు కృషి చేయాలని, తక్షణమే పీఆర్సీ కమిషన్‌ వేయాలని, మధ్యంతర భృతి ప్రకటించాలని, పెండిరగ్‌ బకాయిలు విడుదల చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయులు డిమాండ్‌ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img