Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

సాయిబాబా విడుదలపై‘స్టే’ కుదరదు

మహారాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని తిరస్కరించిన సుప్రీంకోర్టు
బాంబే హైకోర్టు తీర్పు హేతుబద్ధమైనదేనని వ్యాఖ్య
అత్యవసర విచారణకు సైతం వీలుకాదని స్పష్టీకరణ

న్యూదిల్లీ : మావోయిస్టు సంబంధాల కేసులో దిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్‌ జీఎన్‌ సాయిబాబాకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో సాయిబాబాతోపాటు సహ నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను నిలుపుదల చేస్తూ ‘స్టే’ విధించాలని మహారాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీలు పిటిషన్‌ను పరిశీలించిన జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ సందీప్‌ మెహతాలతో కూడిన ధర్మాసనం… హైకోర్టు ఉత్తర్వులు హేతుబద్ధంగా ఉన్నట్లు ప్రాథమికంగా కనిపిస్తున్నాయని తెలిపింది. అయినప్పటికీ ప్రభుత్వ అప్పీలును విచారణకు స్వీకరిస్తున్నట్లు పేర్కొంది. కాగా వీలైనంత తొందరగా ఈ పిటిషన్‌పై విచారణకు తేదీని ఖరారు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం తరపున హాజరైన అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌వీ రాజు చేసిన మౌఖిక విజ్ఞప్తిని సుప్రీం ధర్మాసనం తోసిపుచ్చింది. తీర్పును వెనక్కి తీసుకో వడంలో ఎటువంటి తొందరపాటు ఉండకూడదని, అది వేరేలా ఉంటే పరిగణనలోకి తీసుకునేవ ాళ్లమని చెబుతూ… నిర్ణీత సమయంలోనే ఈ పిటిషన్‌ విచారణకు వస్తుందని స్పష్టం చేసింది. నిర్దోషిత్వం రుజువు చేసుకోవడానికి ఎంతో కష్టపడిన కేసు అని… సాధారణంగా ఇటువంటి అప్పీల్‌ను ఈ న్యాయస్థానం కొట్టివేసి ఉండాల్సిందని అభిప్రాయపడిరది. ‘సాధారణంగా, మేము ఈ అప్పీల్‌ను కొట్టివేస్తాము. అయితే ఈ కోర్టు నిర్దోషిగా విడుదల చేసే ఉత్తర్వుతో ఇంతకు ముందు జోక్యం చేసుకున్నందున, మేము దానిని గౌరవించవలసి ఉంటుంది. అందువల్ల మేము విచారణకు అప్పీల్‌ను స్వీకరిస్తున్నాము. లేకుంటే, ఇది చాలా సహేతుకమైన తీర్పు. హైకోర్టు సాధారణ కోర్సులో జోక్యం చేసుకుని మేము ఈ అప్పీల్‌ను స్వీకరించలేము. నిర్దోషిగా విడుదల చేసే ఆదేశాలతో జోక్యం చేసుకునే పరామితులు చాలా పరిమితంగా ఉంటాయి’ అని ధర్మాసనం పేర్కొంది. ఈ విషయంలో కొన్ని పత్రాలను దాఖలు చేయాల్సి ఉందని, ముఖ్యంగా ఉగ్రవాద నిరోధక చట్టం ‘ఉపా’కింద సాయిబాబాను ప్రాసిక్యూట్‌ చేయడానికి పొందిన అనుమతికి సంబంధించిన పత్రాలను దాఖలు చేయాల్సి ఉందని అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌వీ రాజు అన్నారు. హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని రాజు ఒత్తిడి చేయనప్పటికీ… భవిష్యత్తులో ఎలాంటి గందరగోళం తలెత్తకుండా ఉండేందుకు, అభ్యర్థనను తిరస్కరించినట్లు కోర్టు పేర్కొంది. నిషేధిత మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని 90 శాతం వైకల్యంతో వీల్‌ఛైర్‌కు పరిమితమైన సాయిబాబాను, మరో అయిదుగురిని మహారాష్ట్ర పోలీసులు 2014లోనే అరెస్టు చేశారు. ఈ కేసు విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) చేపట్టగా.. 2017లో గడ్చిరోలి సెషన్స్‌ కోర్టు నిందితులందరికీ జీవితఖైదు విధించింది. సెషన్స్‌ కోర్టు తీర్పును సవాలు చేస్తూ నిందితులు హైకోర్టును ఆశ్రయించగా… 2022 అక్టోబరులోనే వారిని నిర్దోషులుగా ప్రకటిస్తూ… వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని ఆదేశించింది. ఈ తీర్పు వెలువడిన రోజే మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో నిందితుల విడుదలపె స్టే విధించింది. హైకోర్టు తీర్పును 2023 ఏప్రిల్‌లో పక్కనపెట్టింది. నిందితుల అప్పీళ్లపై మళ్లీ మొదట్నుంచీ విచారణ జరపాలని ఆదేశించడంతో మళ్లీ విచారణ చేపట్టిన బాంబే హైకోర్టు… సాయిబాబా సహా మిగతా నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ మార్చి 5న తీర్పు వెలువరించింది. దీంతో ప్రొఫెసర్‌ సాయిబాబా విడుదలైన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img