Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

14న చంద్రయాన్‌-3 ప్రయోగం

ముందు అనుకున్నదాని కన్నా ఒకరోజు ఆలస్యం : ఇస్రో వెల్లడి

విశాలాంధ్ర - సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న చంద్రయాన్‌-3 ప్రయోగం కాస్త ఆలస్యం కానుంది. తొలుత జులై 13న చంద్రయాన్‌-3 ప్రయోగం చేపట్టనున్నట్లు ఇస్రో ప్రకటించింది. అయితే జులై 13వ తేదీకి బదులు జులై 14వ తేదీన రాకెట్‌ను నింగిలోకి పంపనున్నట్లు ఇస్రో గురువారం ట్విట్టర్‌ ద్వారా వెల్లడిరచింది. అయితే ఆలస్యానికి కారణాలను వెల్లడిరచలేదు. అన్ని పనులు అనుకున్న సమయానికి పూర్తయితే చంద్రయాన్‌3 మిషన్‌ను తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లోని రెండవ ప్రయోగ వేదిక నుంచి జులై14న తేదీ మధ్యాహ్నం 2.35 గంటలకు చంద్రుడిపైకి పంపేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మిషన్‌ చంద్రుడిపై రోవర్‌ను దించేందుకు భారత్‌ చేస్తున్న మూడో ప్రయత్నం. ఇందులో భాగంగా ఎల్‌వీఎం-3పీ4 రాకెట్‌తో చంద్రయాన్‌-3 అంతరిక్ష నౌకను అనుసంధానించే ప్రక్రియను ఇస్రో శాస్త్రవేత్తలు ఇప్పటికే పూర్తిచేశారు. షార్‌ రెండో వాహన అనుసంధాన భవనంలో (ఎస్‌వీఏబీ) 3,900 కిలోల పేలోడ్‌ను రాకెట్‌ శిఖర భాగాన అమర్చారు. ఉపగ్రహాన్ని బెంగళూరులోని యూఆర్‌ శాటిలైట్‌ సెంటర్‌లో తయారు చేయగా షార్‌కు తీసుకొచ్చాక శాటిలైట్‌ ప్రిపరేషన్‌ బిల్డింగ్‌ (ఎస్‌పీబీ)లో ల్యాండర్‌, రోవర్‌ ప్రొపల్షన్‌ మాడ్యూల్‌తో అనుసంధానించారు. ఉపగ్రహం సుమారు 3,84,000 కి.మీ. ప్రయాణించి చంద్రుని నుంచి వంద కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలోకి చేరుకుంటుంది. తర్వాత చందమామ దక్షిణ ధ్రువంలోని నిర్దేశిత ప్రదేశంలో దిగుతుందని ఇస్రో తెలిపింది. ఇప్పటి వరకు ఎవరూ చేరుకోని చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని ఆవిష్కరించడమే లక్ష్యంగా ఇస్రో 2019లో చంద్రయాన్‌-2 మిషన్‌ను చేపట్టింది. అయితే, చంద్రుడి ఉపరితలంపై విక్రమ్‌ ఆర్బిటర్‌ సాఫ్ట్‌ ల్యాండిరగ్‌ విఫలమైనప్పటికీ చంద్రుని చుట్టూ ప్రస్తుతం విజయవంతంగా పరిభ్రమిస్తోంది. మిషన్‌లో భాగంగా ఆర్బిటర్‌, ల్యాండర్‌, రోవర్‌ని మోసుకెళుతూ జీఎస్‌ఎల్వీ మార్క్‌-111 ఎం1 రాకెట్‌ 2019, జులై 22న నింగిలోకి దూసుకెళ్లింది. 45 రోజుల ప్రయాణం తర్వాత సెప్టెంబరు 6-7 మధ్య రాత్రి ల్యాండిరగ్‌కు సిద్ధమైంది. కానీ, సాంకేతిక కారణాలతో ల్యాండర్‌ వేగాన్ని నియంత్రించలేకపోవడంతో అది లూనార్‌ ఉపరితలాన్ని గట్టిగా ఢీకొట్టింది. దీంతో ల్యాండర్‌లోని భాగాలు దెబ్బతిని భూకేంద్రంతో సంబంధాలు తెగిపోయాయి. ఈ మిషన్‌లో లోపాలను సవరిస్తూ.. ఇస్రో తాజా మిషన్‌ చేపట్టింది. ఇస్రో 2008లో చంద్రయాన్‌-1ను చేపట్టింది. అది విజయవతంగా చంద్రుడి ఉపరితలంపై నీటి జాడలను గుర్తించింది.
ఇప్పటివరకు అమెరికా, రష్యా, చైనా దేశాలు మాత్రమే చంద్రుడి ఉపరితలంపై విజయవంతంగా తమ వాహకనౌకలను ల్యాండ్‌ చేయగలిగాయి. ఈ మైలురాయిని సాధించిన నాలుగో దేశంగా అవతరించాలని భారత్‌ ప్రయత్నిస్తోంది. చంద్రయాన్‌`3 ప్రయోగ నేపథ్యంలో ప్రపంచ దేశాల దృష్టి మరోసారి భారత్‌పై… ప్రత్యేకించి శ్రీహరికోటలోని షార్‌ కేంద్రంపై పడిరది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img