Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

విద్యలో అంతర్జాతీయ ప్రమాణాల కోసమే ఎడెక్స్‌తో ఒప్పందం : సిఎం జగన్‌

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రముఖ విద్యా పోర్టల్‌ ఎడ్‌క్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.. సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సమక్షంలో.. ఏపీ ప్రభుత్వ అధికారులు, ఎడ్‌క్స్‌ ప్రతినిధులు ఎంవోయూపై సంతకాలు చేశారు.. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ చదువుల చరిత్రలో ఇదొక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతుంది అన్నారు. రైట్‌ టు ఎడ్యుకేషన్‌ అన్నది పాత నినాదం.. నాణ్యమైన విద్య అన్నది హక్కు.. ఇది కొత్త నినాదం అన్నారు. నాణ్యమైన విద్యను అదించడంలో మనం వెనకబడితే.. మిగతా వాళ్లు మనల్నిదాటి ముందుకు వెళ్లిపోతారు.. ఈ దేశంలో ఉన్నవారితోకాదు మన పోటీ.. ప్రపంచంతో మనం పోటీపడుతున్నాం.. మన పిల్లలు మెరుగైన ఉద్యోగాలు సాధించాలి.. మంచి మంచి జీతాలు సంపాదించాలి.. నాణ్యమైన విద్యద్వారానే ఇది సాధ్యం అన్నారు. విద్యలో అంతర్జాతీయ ప్రమాణాలు ఉండాలి.అప్పుడు మన పిల్లలకు మెరుగైన అవకాశాలు వస్తాయి అన్నారు. ఇప్పుడు మనం చేస్తున్నది ఒక ప్రారంభం మాత్రమే.. ఫలాలు అందడానికి కొంత సమయం పట్టచ్చు అన్నారు. కాగా, ఉన్నత విద్యారంగంలో మరో విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టారు.. నేడు సీఎం వైఎస్‌ జగన్‌ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం , ప్రపంచ స్థాయి వర్సిటీ కోర్సులను ఆన్‌లైన్‌ ద్వారా అందించే ప్రముఖ ఈ-లెర్నింగ్‌ ప్లాట్ఫామ్‌ ఎడెక్స్‌ల మధ్య ఒప్పందం కుదిరింది. టీచింగ్‌, లెర్నింగ్‌ కోసం కొత్త టెక్నాలజీ, బోధనా విధానాలను సంయుక్తంగా ఎడెక్స్‌ , రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ రూపొందించాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img