Wednesday, October 30, 2024
Wednesday, October 30, 2024

ఏపీలో మరో ఘోరం..8వ తరగతి విద్యార్థిని హత్య

ఏపీలో వరుస అత్యాచారాలు , హత్యలు ఎక్కువైపోతున్నాయి. ప్రతి రోజు ఎక్కడో చోట అత్యాచారం లేదా హత్య అనేది వార్తల్లో నిలుస్తూనే ఉంది. నంద్యాల , తిరుపతి ఇలా పలు చోట్లా అభం శుభం తెలియని చిన్నారులపై అఘాయిత్యాలు చేసి చంపిన దారుణాలు వెలుగులోకి వచ్చాయి. ఈ అఘాయిత్యాలు మరవకముందే గుంటూరు జిల్లాలో మరో దారుణం జరిగింది. కొత్తరెడ్డిపాలేనికి చెందిన 8వ తరగతి విద్యార్థిని(13) అదే గ్రామానికి చెందిన గ్యాస్ డెలివరీ బాయ్ నాగరాజు ఇంట్లోని మంచంపై శవమై కనిపించడం సంచలనం రేపుతోంది. బాలిక ఒంటిపై గాయాలు ఉండటంతో నాగరాజే అత్యాచారం, హత్య చేసి పరారయ్యాడా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో హత్యాచారానికి గురైన 8ఏళ్ల బాలిక కుటుంబానికి రూ.10లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు హోంమంత్రి అనిత తెలిపారు. నిందితులు రోజుకో మాట మార్చడంతో బాలిక మృతదేహం ఆచూకీ లభించడం లేదని, గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. విజయనగరం (ణ) జీలుగువలసలో అత్యాచారానికి గురైన 5నెలల చిన్నారి పేరిట రూ.5లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img