Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

నువ్వా? నేనా?

వైసీపీలో ఆధిపత్య పోరు

. ‘ఇన్‌చార్జి’ మార్పులతో కలవరం
. నియోజకవర్గాల్లో కొత్త ముఖాలు
. ఎంపీ, ఎమ్మెల్యేలు అలంకార ప్రాయం
. దిక్కుతోచని స్థితిలో ద్వితీయ శ్రేణి నాయకత్వం

విశాలాంధ్ర బ్యూరో-అమరావతి : రానున్న ఎన్నికల్లో ఎలాగైనా మరోసారి గెలిచి తీరాలని భావిస్తున్న అధికార వైసీపీకి… నియోజకవర్గ ఇన్‌చార్జి మార్పుల వ్యవహారం కలవరం కలిగిస్తోంది. ఇన్‌చార్జిలను మార్చిన నియోజక వర్గాల్లో కొత్త, పాత నేతల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. నువ్వా ? నేనా ? అనే రీతిలో వారు బలాబలాలను ప్రదర్శిస్తున్నారు అధికార పార్టీ చేపట్టిన మార్పులను రాజకీయ బదిలీలని విపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. ఇంకా ఎన్నికలకు మూడు నెలల గడువుంది. అప్పటివరకు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఎంపీ, ఎమ్మెల్యేలే ఆ నియోజకవర్గాలకు ప్రజాప్రతినిధులుగా ఉంటారు. వైసీపీ అధినేత, సీఎం వైఎస్‌ జగన్‌ ముందస్తుగా నియోజకవర్గ ఇన్‌చార్జిలను నియమిస్తుండటంతో ఆయా స్థానాల్లో కొందరు సిట్టింగ్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలకు స్థానచలనం కలుగుతోంది. మంత్రులను సైతం ఖాతరు చేయకుండా టికెట్లను నిరాకరించి… వారి స్థానంలోకి మరో కొత్త నేత ఇన్‌చార్జిగా రావడంతో వారికి ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. ప్రతి నియోజకవర్గంలో ఎన్నికైన ప్రజాప్రతినిధులకు మద్దతుగా వారి అనుచరులు, ద్వితీయ శ్రేణి నాయకులు ఉంటారు. ఇప్పుడు ఇన్‌చార్జిల మార్పుతో ఆయా ఎంపీ, ఎమ్మెల్యేలతోపాటు వారి అనుచరుల్లో అభద్రతా భావం మొదలైంది. ఇంకా మూడు నెలలపాటు పదవీ కాలం ఉన్నప్పటికీ… తదుపరి ఎన్నికల్లో పోటీకి కొత్త వారికి పార్టీ అధిష్ఠానం అవకాశం ఇవ్వడం మింగుడు పడటం లేదు. ఉత్తరాంధ్రకు చెందిన ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ప్రస్తుతం మంత్రిగా ఉన్నప్పటికీ, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లికి మరో కొత్త నాయకుడిని సమన్వయకర్తగా నియమించారు. ఆధిష్ఠానం ఆదేశాలకు తలొగ్గి తన నియోజకవర్గాన్ని వదిలేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంతవరకు ఆయనకు ఎక్కడ టికెట్‌ ఇస్తారనేదీ చెప్పలేదు. ఇదే దిశగా గుమ్మడి జయరామ్‌ పరిస్థితి ఉంది. మరికొందరు మంత్రులకూ స్థానచలనం తప్పలేదు. హిందూపురం సిట్టింగ్‌ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను కాదని, ఆయన స్థానంలో కర్నాటక రాష్ట్రం హిందూపురానికి చెందిన శాంత అనే అమెకు పార్టీలో చేరిన రోజే ఎంపీ టికెట్‌ను ఖరారు చేశారు. దీంతో సిట్టింగ్‌ ఎంపీ మాధవ్‌ సీటు గల్లంతైంది. ఆయన మూడుసార్లు తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చినా ఫలితం లేదు. ఇక ఆయన తన సీటు వ్యవహారాన్ని ఆధిష్ఠానానికే వదిలేసి… ప్రభుత్వ, పార్టీ కార్యకలాపాల్లో అసంతృప్తిగానే పాల్గొంటున్నారు. మంత్రులు ఉషశ్రీ చరణ్‌, మేరుగు నాగార్జున తదితరులను ఇతర నియోజకవర్గాలకు బదిలీలు చేశారు. దీంతో వారి సొంత నియోజకవర్గాల్లో ఉన్న అనుచరులు అయోమయంలో ఉన్నారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేల స్థానంలోకి కొత్త ఇన్‌చార్జి వచ్చి… వారే ప్రభుత్వ, పార్టీ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. తమ నేతలు ఇతర ప్రాంతాలకు వెళ్తే… తమ రాజకీయ భవిష్యత్‌ ఏమిటని అనుచరులు ప్రశ్నిస్తున్నారు.
కొత్త ఇన్‌చార్జిలతోనే వైఎస్‌ఆర్‌ పెన్షన్ల పంపిణీ
నియోజకవర్గాల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు ఉండగానే, అక్కడ పార్టీ కొత్త ఇన్‌చార్జిగా నియుక్తులైన వారితోనే పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. ఇంకా మూడు నెలలపాటు పదవీ కాలం ఉన్నప్పటికీ తమ స్థానంలో కొత్త వారితో పెన్షన్లు పంపిణీ చేయడంపై ఎమ్మెల్యేల నుంచి నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఇన్‌చార్జిల మార్పు జరిగిన నియోజకవర్గాల ఎమ్మెల్యేలు లేదా ఎక్కడా టికెట్లు రావని తెలిసిన సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు అసంతృప్తికి గురవుతున్నారు. ప్రజల్లోకి వెళ్లేందుకు ముఖం చాటేస్తున్నారు. వైసీపీ ఆధిష్ఠానం ఇప్పటివరకు రెండు విడతలుగా ఇన్‌చార్జిల జాబితాను విడుదల చేసింది. ఇందులో 38 మార్పులు చేసింది. వారిలో ముగ్గురు ఎంపీ అభ్యర్థులున్నారు. ఇక ఈ ఇన్‌చార్జిలే రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులుగా దాదాపు బరిలో ఉంటారని అధిష్ఠానం వెల్లడిరచింది. మూడో విడత జాబితాలో 15 ఎమ్మెల్యే, ఎంపీ నియోజకవర్గాలపై స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. ఈ ప్రభావం వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక పథకంపై పడుతోంది. అనేక జిల్లాల్లో ఇన్‌చార్జిలు ఎవరనేదీ తెలియక పెన్షన్ల పంపిణీ చేపట్టడం లేదు. వాస్తవంగా ప్రతినెలా ఒకటో తేదీ నుంచి మూడో తేదీలోగానే పెన్షన్ల పంపిణీ చేపట్టాల్సి ఉంది. ఇన్‌చార్జిల మార్పు కారణంగా పెన్షన్ల పంపిణీకి ఆటంకం ఏర్పడుతోంది. ఏడో తేదీ వచ్చినప్పటికీ, చాలా నియోజకవర్గాల్లో పంపిణీ చేయలేదని తెలిసింది. దాదాపు 50 నుంచి 70 శాతం మాత్రమే పెన్షన్ల పంపిణీ పూర్తయినట్లు సమాచారం. దీనిని గుర్తించిన ప్రభుత్వం పెన్షన్‌ పెంపు ఉత్సవాల పేరుతో ఎనిమిదో తేదీ వరకు గడువు పొడిగించింది.
సామాజిక సాధికార యాత్రల్లో గందరగోళం
వైసీపీ ఆర్భాటంగా నిర్వహిస్తూన్న సామాజిక సాధికార బస్సు యాత్రలలోనూ ఇన్‌ చార్జిల గందరగోళం నెలకొంది. ఇప్పటివరకు ఆ నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉన్న ఎమ్మెల్యే, ఎంపీలను మార్చడంతో నిర్వహణపై వైసీపీ నేతలు అయిష్టత చూపుతున్నారు. అనేక నియోజవర్గాల్లో ఈ యాత్రలను సిట్టింగ్‌ ఎమ్మెల్యేల అధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు. దాదాపు 100 నియోజకవర్గాలకుపైగా సభలు పూర్తయ్యాయి. ఆ సభలు ముగిశాక సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు ఇతర ప్రాంతాల్లో ఇన్‌చార్జి బాధ్యతల్ని అప్పగించడం, మరికొందరికి అసలు ఇన్‌చార్జి బాధ్యతలు లేకపోవడంతో వారంతా అసంతృప్తిగా ఉన్నారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) తన పదవికి, పార్టీకి రాజీనామా చేసి వెళ్లిన విషయం విదితమే. దీంతో అక్కడ ఇన్‌ చార్జి అధ్వర్యంలో సామాజిక యాత్రను నిర్వహించాల్సిన అవసరముంది. విజయవాడ సెంట్రల్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు వచ్చే ఎన్నికల్లో టికెట్‌ లేదు.ఆయన స్థానంలో పక్కనే ఉన్న పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్‌ను బదిలీ చేశారు. ఈ రెండు నియోజకవర్గాల్లోనూ సామాజిక సాధికార యాత్రలను ఇంతవరకు నిర్వహించలేదు. సీఎం జగన్‌ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ఈ బస్సు యాత్రలపైనా ఇన్‌చార్జిల మార్పు ప్రభావం ఉంది. తమ నేతకు టికెట్‌ ఇవ్వకుంటే, తామెందుకు సభలు, యాత్రలు నిర్వహించాలంటూ ద్వితీయ శ్రేణి నాయకత్వం ప్రశ్నిస్తున్నారు. ఈ దిశగా ప్రభుత్వ, పార్టీ కార్యకలాపాలపైన ఇన్‌చార్జిల మార్పు ప్రభావం నెలకొంది. వాటిపై ఎప్పటికప్పుడు ఆధిష్ఠానం దృష్టికి నేతలు తీసుకెళ్తున్నప్పటికీ, ఇన్‌చార్జిల మార్పుపై సీఎం జగన్‌ వెనక్కితగ్గడం లేదు. ఇక మూడో విడత జాబితా విషయమై సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆందోళన చెందుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img