Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

మీడియాపై దాడులుఅమానుషం

సీపీఐ రాష్ట్ర సమితి ఖండన

విశాలాంధ్ర – విజయవాడ : రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో పత్రిక, ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రతినిధులపై వైసీపీ శ్రేణుల అమానుష దాడులను ఖండిస్తూ సీపీఐ రాష్ట్ర సమితి సమావేశం ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. సీపీఐ రాష్ట్ర సమతి సమావేశాలు ఈ నెల 20, 21 తేదీలలో విజయవాడ దాసరి భవన్‌లో జి.కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగాయి. సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ పాల్గొని అంతర్జాతీయ పరిస్థితులను, జాతీయ రాజకీయ పరిణామాలను వివరించారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులను, భవిష్యత్‌ కర్తవ్యాలపై రామకృష్ణ మాట్లాడారు. అనంతరం సమావేశం మీడియాపై దాడులను ఖండిస్తూ సమావేశం తీర్మానం చేసింది. ౖరాష్ట్రంలో నాలుగు రోజులుగా వివిధ పత్రికలు, మీడియా సంస్థలకు చెందిన ఫొటోగ్రాఫర్‌లు, జర్నలిస్టులపై వైసీపీ మూకలు భౌతికదాడులు చేయడాన్ని సీపీఐ రాష్ట్ర సమితి తీవ్రంగా ఖండిరచింది. అనంతపురం జిల్లా రాప్తాడులో ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్‌ శ్రీకృష్ణను దారుణంగా చావబాదారు. హైదరాబాద్‌ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నాడు. కర్నూలు జిల్లా మద్దికెర ఆంధ్రజ్యోతి విలేకరి వీరశేఖర్‌పై పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి సాక్షిగా వైసీపీ కార్యకర్తలు కొట్టడం, మంగళవారం కర్నూలులోని ఈనాడు ప్రాంతీయ కార్యాలయంపై పెద్దసంఖ్యలో వైసీపీ కార్యకర్తలు దాడిచేసి అద్దాలు, ఫర్నీచర్‌, కంప్యూటర్‌లు పగులగొట్టి బీభత్సం సృష్టించటంపై సమాశంలో చర్చ జరిగింది. గతంలో నంద్యాల జిల్లా మహానందికి చెందిన వార్త పత్రిక విలేకరి మధు(ఎస్సీ)పై స్థానిక ఎమ్మెల్యే మద్దతుదారులు దాడిచేసి కొట్టడం, పోలీస్‌ కేసు పెడితే సాక్షిగా ఉన్న రాజ్‌న్యూస్‌ జిల్లా స్టాఫ్‌ రిపోర్టర్‌ భాష్యం మధుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్‌ కింద కేసు బనాయించడం, కర్నూలు జిల్లా కోడుమూరులో స్థానిక ఎమ్మెల్యే అనుచరులు తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లను ఫొటోలు తీసినందుకు విశాలాంధ్ర విలేకరి సతీశ్‌కుమార్‌ను చావబాదడం తదితర అంశాలను విశ్లేషించింది. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో మద్యం, ఇసుక, మైనింగ్‌, జగనన్న భూముల కొనుగోలులో జరిగిన ఆర్థిక కుంభకోణాలను వెలుగులోకి తీసుకొచ్చిన అనేకమంది విలేకరులపైనా, ఆయా సంస్థల మీద దాడులు చేయించడం వైసీపీ ప్రజాప్రతినిధులకు, వారి అనుచరులకు పరిపాటిగా మారిందని సీపీఐ రాష్ట్ర సమితి విమర్శించింది.
ఇలాంటి దాడులను ఖండిస్తూ ఏపీయూడబ్ల్యూజే, ఇతర జర్నలిస్టు సంఘాలు చేస్తున్న ఆందోళనలకు సీపీఐ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ దాడులను సత్వరమే అరికట్టి…నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రికి సీపీఐ విజ్ఞప్తి చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img