Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

వైసీపీకి బిగ్‌ షాక్‌

. నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి రాజీనామా
. టీడీపీలో చేరికకు రంగం సిద్ధం
. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేల దూరం
. ఎంపీ అభ్యర్థి కోసం వెదుకులాట
. టీడీపీలోకి మంత్రి గుమ్మనూరు జయరామ్‌?

విశాలాంధ్ర బ్యూరో-అమరావతి : వైసీపీకి మరో బిగ్‌ షాక్‌ తగిలింది. నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా ఉన్న రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, జిల్లా అధ్యక్ష పదవికి బుధవారం రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి పంపారు. రాజ్యసభ సభ్యత్వానికీ రాజీనామా చేస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. తన రాజీనామా ఆమోదించాలని కోరారు. రాజ్యసభ సభ్యుడుగా ఉన్న వేమిరెడ్డిని రాబోయే ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా వైసీపీ ఆధిష్ఠానం ఖరారు చేసిన విషయం విదితమే. ఇదే సమయంలో నెల్లూరు పార్లమెంట్‌ పరిధిలో వైసీపీ ఇన్‌చార్జిల మార్పులు, చేర్పులు చేసింది. ఇన్‌చార్జిల నియామకంపై ఆయన మూడు స్థానాల్లో అభ్యర్థులను మార్చాలంటూ ఆయన ఆధిష్ఠానానికి సూచించారు. అందులో నెల్లూరు టౌన్‌ ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్‌ యాదవ్‌ పేరూ ఉంది. కొంతకాలంగా అనిల్‌కుమార్‌కు, వేమిరెడ్డి మధ్య విభేదాలు నడుస్తున్నాయి. తనను అనిల్‌కుమార్‌ అవమానించేలా వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ, ఆ విషయాల్ని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినా కట్టడి చేయలేకపోయారని కలత చెందుతున్నారు. ఎట్టకేలకు అనిల్‌కుమార్‌ను నెల్లూరు టౌన్‌ నుంచి తప్పించి నరసారావుపేట ఎంపీ అభ్యర్థిగా ఆధిష్ఠానం పంపింది. అనిల్‌కుమార్‌ స్థానంలో ఆయన అనుచరుడైన నెల్లూరు టౌన్‌ ఇన్‌చార్జిగా ముస్లిం సామాజిక వర్గానికి చెందిన ఎండీ ఖలీల్‌ను నియమించింది. దీంతో తనకు తెలియకుండా నెల్లూరు టౌన్‌ అభ్యర్థి పేరును ప్రకటించడంపైనా మనస్థాపం చెందారు. నెల్లూరు టౌన్‌ నుంచి వేమిరెడ్డి భార్యను ఎమ్మెల్యేగా నిలపాలని ఆయన ఆలోచిస్తున్నారు. ఇదే విషయాన్ని వైసీపీ ఆధిష్ఠానం దృష్టికి వేమిరెడ్డి తీసుకెళ్లగా అందుకు నిరాకరించినట్లు సమాచారం. నెల్లూరు టౌన్‌ నియామకం అనంతరం ఆయన పూర్తిగా కలతచెంది కొంతకాలంపాటు జిల్లా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇటీవల దిల్లీకి సీఎం జగన్‌ వెళ్లిన సమయంలోనూ వేమిరెడ్డి కలవలేదు.
కొంతకాలంగా టీడీపీ నేతలతో సంప్రదింపులు
అనేక దఫాలుగా చంద్రబాబుతోపాటు టీడీపీ నేత నారాయణతో వేమిరెడ్డి చర్చలు నిర్వహించి, దాదాపు టీడీపీలో చేరికకు సిద్ధమైనట్లు తెలిసింది. ఆయనతోపాటు నెల్లూరు పార్లమెంట్‌ పరిధిలోని ప్రధాన అనుచరులను, కార్పొరేటర్లను భారీగా రాజీనామాలు చేయించేందుకు వేమిరెడ్డి సిద్ధమయ్యారు. త్వరలో నెల్లూరు కేంద్రంగా ఒక బహిరంగ సభను నిర్వహించి, తన ప్రజాబలాన్ని నిరూపించేందుకు నిమగ్నమైనట్లు తెలిసింది. అత్యధిక ధనవంతుల జాబితాలో ఉన్న వేమిరెడ్డి వైసీపీకి దూరమవ్వడం ఆ పార్టీకి తీరని నష్టం వాటిల్లనుంది. ఇప్పటికే నెల్లూరుకు చెందిన వైసీపీ రెబల్‌ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డిని ఆ పార్టీ సస్పెండ్‌ చేయడంతో టీడీపీలో చేరారు. తాజాగా నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ఆ పార్టీలోకి వెళ్లడంతో వైసీపీకి భారీ నష్టం కలుగుతుందని టీడీపీ భావిస్తోంది.
2019 ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో మొత్తం అసెంబ్లీ స్థానాలను వైసీపీ క్లీన్‌స్వీప్‌ చేయగా, రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీకి గడ్డు పరిస్థితులు ఎదురుకానున్నాయి. వేమిరెడ్డి పార్టీకి దూరమవ్వడంతో,ఎంపీ అభ్యర్థి కోసం వైసీపీ వెతుకులాట ప్రారంభించింది. ముగ్గురు పారిశ్రామిక వేత్తలతో సంప్రదింపులు చేపట్టింది. ఏ క్షణంలోనైనా నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గానికి ఇన్‌చార్జిని ప్రకటించే అవకాశముంది. కర్నూలు జిల్లాకు చెందిన మంత్రి గుమ్మనూరు జయరామ్‌ టీడీపీలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఆయన టీడీపీ ముఖ్యనేతలతో సంప్రదింపులు చేపట్టినట్లు ప్రచారముంది. ఆయనను సొంత ఎమ్మెల్యే నియోజకవర్గం నుంచి కర్నూలు ఎంపీగా నియమించడంపై తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు ఇచ్చేందుకు ఆధిష్ఠానం నిరాకరించడంతో, ఇక చేసేది లేక టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇటీవల అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన సిద్ధం సభకూ మంత్రి జయరామ్‌ హాజరు కాలేదు. దీంతో ఆయన పార్టీని వీడటం దాదాపు ఖరారైనట్లు తెలిసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img