Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

సజ్జల రామకృష్ణారెడ్డిపై కేసు నమోదు.. ఆ వ్యాఖ్యలతో చిక్కులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిపై కేసు నమోదైంది. ఆయనపై గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసులు కేసు ఫైల్ చేశారు. సజ్జలపై ఐపీసీలోని బ/ం 153,505 (2) Iూజ, 125 RూA 1951 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి న్యాయవాది లక్ష్మీనారాయణకు పోలీసులు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏపీ ఎన్నికల కౌంటింగ్‌ ఏజెంట్లకు సంబంధించి సజ్జల చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకున్నారు. ఆయన వ్యాఖ్యలపై తెలుగు దేశం పార్టీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు, న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. శుక్రవారం పోలీసులు కేసు నమోదు చేశారు. నిబంధనలు పాటించేవాళ్లు కౌంటింగ్‌ ఏజెంట్లుగా అవసరం లేదని ఇటీవల సజ్జల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి.
వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆ పార్టీ చీఫ్‌ కౌంటింగ్‌ ఏజెంట్ల అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో ఏజెంట్లకు అవగాహన కల్పించారు.. ామన టార్గెట్‌ ఇదీ అని దృష్టిలో పెట్టుకుని.. దానికి అవసరమైనవి తెలుసుకోవాలి. అవతలివారు అడ్డం పడకుండా వారిని ఆపేందుకు ఏవేం నిబంధనలు ఉన్నాయో చూసుకోవాలి. మనవి ఒక్క ఓటు కూడా చెల్లనివిగా చేసే పరిస్థితి రాకుండా అడ్డుకునేందుకు ఏం చేయాలో చూసుకోవాలి. అంతే తప్ప రూల్‌ అలా ఉంది కాబట్టి దాని ప్రకారం పోదాం అని మనం కూర్చోకూడదు్ణ అన్నారు. మనకు అనుకూలంగా, అవతలివాళ్ల ఆటలు సాగకుండా రూల్‌ని ఎలా చూసుకోవాలి? అవసరమైతే దానికోసం ఎంతవరకు ఫైట్‌ చేయాలనేది నేర్చుకుందాం. ఇందులో కౌంటింగ్‌ ఏజెంట్‌ తనవంతు పాత్ర పోషించేలా వారి మెదడులోకి మీరు బాగా ఎక్కించాలి. పొరపాటున ఒకటి మనం వాదించినా పర్లేదు. కానీ, రూల్‌ కాదేమో అని వెనక్కి తగ్గేవాడైతే ఏజెంట్‌గా వద్దు్ణ అన్నారు. సజ్జల వ్యాఖ్యలపై టీటీడీ సీరియస్‌గా స్పందించింది.. తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img