Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

చంద్రయాన్‌ – 3 రెడీ

జులై 13న నింగిలోకి

న్యూదిల్లీ: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా చేపడుతోన్న చంద్రయాన్‌-3 ఉపగ్రహ ప్రయోగానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. జులై 13 మధ్యాహ్నం 2.30 గంటలకు చంద్రయాన్‌`3 నింగిలో చంద్రుడి వైపు దూసుకెళ్లనుంది. ఈ విషయాన్ని ఇస్రో అధికారికంగా ప్రకటించింది. ఈ మిషన్‌కు సంబంధించిన పనులు ఇప్పటికే దాదాపు పూర్తయినట్లు సమాచారం. యువ శాస్త్రవేత్త వీరముత్తుయేల్‌ సారథ్యంలో రూపుదిద్దుకున్న ఈ ఉపగ్రహం అనుసంధాన పనులతోపాటు రోవర్‌, ల్యాండర్‌ బిగింపు పనులు ఏకకాలంలో చేస్తున్నారు. శ్రీహరికోటలోని షార్‌ నుంచి జీఎస్‌ఎల్‌వీ ఎం-3 భారీ వాహకనౌక ద్వారా ఈ ప్రయోగం చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం రూ.615 కోట్లు కేటాయించింది. ఇస్రో చంద్రయాన్‌-1ను 2008లో చేపట్టగా.. అది విజయవంతంగా చంద్రుడి ఉపరితలంపై నీటి జాడలను గుర్తించిన విషయం విదితమే. అయితే, అది రెండేళ్ల పాటు పనిచేసే విధంగా రూపొందించినప్పటికీ… దాదాపు ఏడాదిలోనే దాంతో సంబంధాలు తెగిపోయాయి. చంద్రుడి చుట్టూ తిరుగుతూ మొత్తం 312 రోజులు సేవలు అందించిన తర్వాత ఆ మిషన్‌ ముగిసినట్లు 2009 ఆగస్టులో ఇస్రో ప్రకటించింది. అనంతరం చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని ఆవిష్కరించడమే లక్ష్యంగా ఇస్రో చేపట్టిన చంద్రయాన్‌-2… చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్‌ ల్యాండిరగ్‌ సమయంలో విఫలమైంది. అయినప్పటికీ ఎనిమిది సాంకేతిక పరికరాలతో కూడిన ఆర్బిటర్‌ మాత్రం ఇప్పటికీ చంద్రుడి కక్ష్యలో విజయవంతంగా తిరుగుతోంది. ఇక చంద్రయాన్‌-3 అనేది చంద్రుని ఉపరితలంపై సురక్షితమైన ల్యాండిరగ్‌, రోవింగ్‌లో ఎండ్‌-టు-ఎండ్‌ సామర్థ్యాన్ని ప్రదర్శించడానికి చంద్రయాన్‌-2కి ఫాలో-ఆన్‌ మిషన్‌… ఇది ల్యాండర్‌, రోవర్‌ కాన్ఫిగరేషన్‌ను కలిగి ఉంటుంది. దీనిని శ్రీహరికోటలోని ఎస్‌డిఎస్‌సి షార్‌ నుంచి ప్రయోగిస్తారు. చంద్రయాన్‌ 2 ల్యాం డిరగ్‌ విఫలమైన నేపథ్యంలో ఈసారి చంద్రుని ఉపరితలంపై దిగేటప్పుడు ప్రత్యేక రక్షణను అందించేలా ప్రత్యేక సాంకేతికతలతో చంద్రయాన్‌3ని ప్రయోగించబోతున్నారు. చంద్రయాన్‌ 3 ప్రయోగ తేదీ జులై 13, 2023 కాగా చంద్రునిపై దిగే తేదీ 23 ఆగస్టు 2023 గా ఇస్రో పేర్కొంది. తాజాగా చేపడుతోన్న చంద్రయాన్‌3 ప్రయోగం విజయవంతమైతే భారత అంతరిక్ష పరిశోధనలో కీలక అడుగుపడినట్లే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img