Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

మైనారిటీలపై వివక్ష, బలవంతపు వలసలు

. హింసను రెచ్చగొడుతున్నది బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌
. కలచివేసిన క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులు
. గురుగ్రామ్‌, నూప్‌ాలో సీపీఐ నాయకుల పర్యటన

నూప్‌ా : మతసామరస్యం అనేది విద్వేషవిభజన రాజకీయాలకు బలిపశువుగా మారిందని హింస బాధిత హరియాణాలోని నూప్‌ా, గురుగ్రామ్‌ ప్రాంతాల్లో పర్యటించిన సీపీఐ నాయకులు అన్నారు. స్థానికంగా సంస్థాగతంగా విద్వేషాన్ని, విభజనలను వృద్ధి చేస్తున్న తీరు తమను షాక్‌కు గురిచేసిందని చెప్పారు. హింసాకాండ ఘటనలపై సమగ్ర విచారణ, బాధితులకు సముచిత నష్ట పరిహారం, నూప్‌ా, గురుగ్రామ్‌లో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు హామీనివ్వాలని కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలను సీపీఐ ఎంపీలు వినయ్‌ విశ్వం, సంతోశ్‌ కుమార్‌, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి అమర్జిత్‌ కౌర్‌, సీపీఐ హరియాణా కార్యదర్శి దరియావో సింగ్‌ కశ్యప్‌ డిమాండ్‌ చేశారు. ముస్లింలు కనిపిస్తేనే హింస జరుగుతుందని, వారికి ఆ ప్రాంతంలో వ్యాపారాల చేయనివ్వద్దు అని పోలీసు అధికారులకు స్థానిక సర్పంచ్‌ సూచనలు చేయడం దారుణమని నాయకులు అన్నారు. మైనారిటీలను బలవంతంగా అక్కడ నుంచి వెళ్లిపోయేలా చేస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. విస్తుపోయే వాస్తవాలను తెలుసుకున్నామని తమ పర్యటనపై విడుదల చేసిన ప్రకటనలో నాయకులు తెలిపారు. హింస బాధిత గురుగ్రామ్‌, నూప్‌ా జిల్లాలో కావాలనే హింసను రెచ్చగొడుతున్నారని, క్షేత్రస్థాయి పరిస్థితులు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయని నాయకులు తెలిపారు. రెవారీ జిల్లా, జైనాబాద్‌ పంచాయతీ సర్పంచ్‌ స్థానిక పోలీసు అధికారులకు రాసిన అధికారిక లేఖ తమ చేతికి అందిందని, అందులోని విషయాలను బట్ట బీజేపీ పాలనలో మైనారిటీలపై సంస్థాగత వివక్ష ఏ స్థాయిలో జరుగుతోందో అర్థం చేసుకోవచ్చన్నారు. పంచాయతీ పరిధిలో ముస్లింలను వ్యాపారాలు చేయనివ్వొద్దు, విక్రేతలుగా వారు ఉండరాదని పోలీసు అధికారులకు రాసిన లేఖలో సర్పంచ్‌ పేర్కొన్నట్లు సీపీఐ నాయకులు తెలిపారు. ముస్లింలను దొంగలుగా, దోపిడీదారులుగా, పశుదొంగలుగా చిత్రీకరించిన తీరు ఆశ్చర్యపరిచిందని, గ్రామంలో శాంతికి విఘాతం కలగకూడదనే ఈ చర్యలని చెబుతూ లేఖలో ఉందన్నారు. ముస్లింలు కనిపిస్తే ఘర్షణలు జరుగుతాయంటూ వారిని ఆ ప్రాంతం నుంచి బలవంతంగా తరిమేస్తున్నారని తెలిపారు.
మతసామరస్యం అనేది విద్వేష`విభజన రాజకీయాలకు బలిపశువుగా మారిందని, రెండు వర్గాల మధ్య కృత్రిమ విద్వేష బీజాన్ని నాటుతున్న పద్ధతి ప్రమాదకరమని సీపీఐ నాయకులు పేర్కొన్నారు. నూప్‌ా సరిహద్దు వద్ద పోలీసులు తమను అడ్డగించారని తెలిపారు. తాము కలిసిన ప్రతి ఒక్కరికి శాంతి, సామరస్యాన్ని ఉద్బోధించినట్లు చెప్పారు. హింసాత్మక ఘటనలపై సమగ్ర విచారణ, బాధితులకు తగిన పరిహారం, నూప్‌ా, గురుగ్రామ్‌లో సాధారణ పరిస్థితులు నెలకొల్పేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని సీపీఐ నాయకులు డిమాండ్‌ చేశారు. నూప్‌ాలోకి ప్రవేశించకుండా పోలీసులు తమను అడ్డుకున్నట్లు వినయ్‌ విశ్వం తెలిపారు.
ప్రజలు స్వేచ్ఛగా తిరుగుతున్నా బీజేపీ డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం భయపడుతోందని, ఎన్నికలే లక్ష్యంగా ప్రజలను విభజించాలని చూస్తోందని విశ్వం విమర్శించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img