Monday, April 22, 2024
Monday, April 22, 2024

విద్యార్థుల చదువులకు అత్యంత ప్రాధాన్యత : ముఖ్యమంత్రి జగన్‌

పార్వతీపురం మన్యం జిల్లాలో అమ్మ ఒడి అమలు కార్యక్రమానికి ముఖ్యమంత్రి శ్రీకారం

జగనన్న అమ్మఒడి కార్యక్రమం ద్వారా తల్లుల ఖాతాల్లో రూ.6,392.94 కోట్లు జమ

రాష్ట్రవ్యాప్తంగా జగనన్న అమ్మఒడి కార్యక్రమం ద్వారా 42,61,965 మంది తల్లుల ఖాతాల్లో రూ.6,392.94 కోట్లు జమ కానున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. వరుసగా నాలుగో ఏడాదీ 2022ఉ23 విద్యా సంవత్సరానికి సంబంధించి జగనన్న అమ్మ ఒడి అమలు కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. పార్వతీపురం మన్యం జిల్లాలో బ‌హిరంగ స‌భ వేదిక‌గా పిల్ల‌ల‌ను బ‌డికి పంపించే త‌ల్లుల ఖాతాల్లో న‌గ‌దు జ‌మ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూౌ 1వ తరగతి నుంచి ఇంటర్‌ చదివే 83,15,341 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుందన్నారు. తాజాగా అందచేసే డబ్బులతో కలిపితే ఇప్పటివరకు ఒక్క జగనన్న అమ్మఒడి ద్వారానే రూ. 26,067.28 కోట్ల మేర ప్రయోజనాన్ని చేకూరుస్తున్నామన్నారు. విద్యార్థుల చదువులకు అత్యంత ప్రాధాన్యమిస్తూ కీలక సంస్కరణలు చేపట్టి నాలుగేళ్లలో విద్యా రంగంపై రూ.66,722.36 కోట్లను వెచ్చించామన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img