Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఎలక్టోరల్ బాండ్లు రాజ్యాంగ విరుద్ధం..

ఇదో క్విడ్ ప్రోకో: సుప్రీంకోర్టు సంచలన తీర్పు
రాజకీయ పార్టీలకు విరాళాలుగా అందే ఎలక్టోరల్ బాండ్ల చెల్లుబాటుపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది. ఈ బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని ఐదుగురు న్యాయమూర్తుల విస్తృత ధర్మాసనం తేల్చి చెప్పింది. ఆర్టికల్ 19 (1)(ఏ)తో పాటు సమాచార హక్కు చట్టానికి ఇవి విఘాతం కల్గిస్తున్నాయని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కేసులో గతేడాది నవంబరులోనే విచారణ పూర్తిచేసిన న్యాయస్థానం.. తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా, గురువారం నాడు తీర్పు వెలువరించింది. 2019 నుంచి ఎలక్టోరల్ బాండ్ల వివరాలను బహిర్గతం చేయాలని కోరింది. ఇది ఓ విధంగా ప్రాథమిక హక్కులకు ఉల్లంఘనేనని ధర్మాసనం పేర్కొంది. నలధనం నిర్మూలనకు ఎలక్టోరల్ బాండ్లు ఒక్కటే మార్గం కాదని వ్యాఖ్యానించింది. రాజకీయ పార్టీలకు విరాళాలు క్విడో ప్రోకోకు దారితీస్తుందని న్యాయస్థానం అభిప్రాయపడింది. విరాళాలు అందజేసిన వారి వివరాలను రహస్యంగా ఉంచడం సమంజసం కాదని తెలిపింది. రాజకీయ పార్టీలకు ఎవరు విరాళం ఇచ్చారో తెలియాల్సిన ఆవశ్యకత ఉందని ధర్మాసనం పేర్కొంది. ఈ పథకాన్ని నిలిపివేసిన సుప్రీంకోర్టు.. ఆ మొత్తాన్ని తిరిగి ఇచ్చేయాలని సూచించింది. ఎన్నికల కమిషన్‌లు, సెబీలు ఎలక్టోరల్ బాండ్ల వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచాలని ఆదేశించింది. మార్చి 31 నాటికి ఈ వివరాలను పెట్టాలని స్పష్టం చేసింది.సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఏకగ్రీవ నిర్ణయాన్ని వెలువరించింది. ామేము ఏకగ్రీవ నిర్ణయానికి వచ్చాం… నేను, జస్టిస్ సంజీవ్ ఖన్నా వేర్వేరు అభిప్రాయం తెలిపినా.. చివరికి ఇద్దరం ఒకే నిర్ణయానికి వచ్చాయి. తార్కికంలో స్వల్ప వ్యత్యాసం ఉంది్ణ అని భారత ప్రధాన న్యాయమూర్తి చెప్పారు.వ్యాపార ప్రయోజనాల కోసం దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని, పాలక పార్టీలకు అనుకూలంగా లేదా క్విడో ప్రోకోకు దారితీసే ముప్పందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అంశంపై విచారణ సందర్భంగానే కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఉదాహరణకు ఏ అనే కేవైసీ కలిగిన వ్యక్తి పేరుతో బీ అనే వ్యక్తి ఓ పార్టీకి రూ.100 కోట్ల విరాళం ఇస్తే, అతడు దాని కోసం సదరు వంద కోట్లను ఒక్కొక్కరి నుంచి కోటి చొప్పున సేకరిస్తే ఇది అక్రమం అవుతుంది కదా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అంతేకాదు, కేవైసీ కలిగిన ఖాతాదారుల ద్వారా ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేయించడం, అసలు దాతలు అజ్ఞాతంలో ఉండటం వల్ల రాజకీయ పార్టీలతో వారి క్విడ్ ప్రోకోకు సంబంధించి ఎలాంటి ప్రశ్నలు తలెత్తవని ధర్మాసనంలో న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా అన్నారు. అలాగే ఈ విరాళం ఎక్కడి నుంచి వచ్చిందనేది రాజకీయ పార్టీకి తెలుస్తుందని, ప్రజలకు మాత్రమే తెలియదని సీజే చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img