Friday, June 14, 2024
Friday, June 14, 2024

బెయిల్‌పై సుదీర్ఘకాలంగా బయట ఉన్న వ్యక్తి జగన్: నారాయణ

ఏపీ ముఖ్యమంత్రి జగన్, మాజీ సీఎం కేసీఆర్‌పై సీపీఐ నేత నారాయణ విమర్శలు చేశారు. నరేంద్రమోదీ ప్రభుత్వం పార్లమెంట్ పునాదులను తవ్వే ప్రమాదముందని ఒకవైపు దేవుళ్ళను పూజిస్తూ.. మరోవైపు రైతులను హింసిస్తోందని ఆరోపించారు. ఈ సందర్బంగా గురువారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రానికి జగన్ బానిస కాబట్టి.‌. అతని జోలికి ప్రధాని పోలేదన్నారు. కోడికత్తి పేరుతో జగన్ నాటకాలు అడారని, భారత దేశ చరిత్రలో బెయిల్‌పై సుధీర్ఘకాలంగా బయట ఉన్న వ్యక్తి జగన్ అని అన్నారు.17ఏ కేసు పెండింగ్‌లో ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు కేంద్రానికి దాసోహం అంటున్నారని. జగన్, చంద్రబాబు తమ తప్పులను కప్పిపుచ్చుకొనేందుకు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని బీజేపీకి తాకట్టు పెట్టారని నారాయణ విమర్శించారు.

మేడిగడ్డ బ్యారేజీలో ఏడు పిల్లర్లే కుంగిపోయాయి.. అయితే ఏమవుతుందని మాజీ సీఎం కేసీఆర్ అంటున్నారని నారాయణ అన్నారు. చదువుకున్న వాళ్లు ఎవరైనా సరే ఇలా అనలేరని, చదువుకున్న మూర్ఖులు మాత్రమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని చెప్పారు. గతంలో పదేళ్ల పాటు కేసీఆర్ ముఖ్యమంత్రిగా పనిచేశాడా? లేక చప్రాసీగానా? అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇంటిని నిర్మించినపుడు ఒక్క పిల్లర్ కుంగిపోయిందని పట్టించుకోకుండా గృహ ప్రవేశం చేస్తామా.. భయపడతామా? అని ప్రశ్నించారు. ఈమేరకు గురువారం పార్టీ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నారాయణ మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్ నల్గొండ సభలో చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. ప్రాజెక్టులో నీళ్లు నిండాక ఒక్క పిల్లర్ కుంగినా ప్రమాదమే కదా అని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మేడిగడ్డ సందర్శన యాత్రకు పిలిచినపుడు కేసీఆర్ ఎందుకు వెళ్లలేదని నారాయణ ప్రశ్నించారు. మీ ప్రభుత్వంలో నిర్మించిన ప్రాజెక్టుకు పగుళ్లు వస్తే వెళ్లి చూడాల్సిన బాధ్యత లేదా? అని నిలదీశారు. ప్రస్తుత ప్రభుత్వం పిలిచినపుడైనా వెళ్లి అక్కడే కౌంటర్ ఇవ్వాల్సింది.. లేదా తప్పు జరిగితే ఒప్పుకోవాల్సిందని కేసీఆర్ కు హితవు చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img