Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

ఎన్నికల కోసమేనా…

. ప్రవేశాలకు ఐదు వైద్య కళాశాలలు సిద్ధం
. మౌలిక సదుపాయాలు అరకొరే
. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే చందంగా 12 కళాశాలలు
. నత్తనడకన పాడేరు కళాశాల పనులు

విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: రాష్ట్రంలో వైద్య విప్లవం తీసుకొస్తామని జగన్‌ ప్రభుత్వం గొప్పగా ప్రకటించుకుంది. అయినప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితం సాధించలేకపోయింది. కొత్తగా ఏర్పడిన ప్రతి జిల్లాకూ ఒక వైద్య కళాశాల, దానికి అనుబంధంగా సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ నిర్మించాలని జగన్‌ ప్రభుత్వం నిర్ణయించింది. 17 కొత్త జిల్లాల్లో సీఎం జగన్‌ లాంఛనంగా మెడికల్‌ కళాశాలలకు, సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులకు ఏకకాలంలో శంకుస్థాపనలు చేశారు. అందులో అధికంగా వైద్య కళాశాలలు, సూపర్‌ స్పెషాలిటీ భవనాలు పూర్తి దశకు చేరుకోలేదు. ప్రభుత్వం తలపెట్టిన 17 వైద్య కళాశాలల్లో ఇప్పటివరకూ కేవలం ఐదు వైద్య కళాశాలలే అరకొరగా, హడావుడీగా పూర్తి చేశారు. ఈ విద్యా సంవత్సరం (2023-24) నుంచి మచిలీపట్నం, విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, నంద్యాల కళాశాలల్లో తరగతులు ప్రారంభించనున్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం హడావుడిగా ఈ పనులు వేగవంతంగా చేసిందిగానీ…పూర్తిస్థాయిలో మౌలిక సౌకర్యాలు కల్పించలేకపోయింది. అన్ని కళాశాలలకు అనుబంధంగా ఏర్పాటుచేసిన సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో వైద్య సౌకర్యాలు, ప్రొఫెసర్లు, సిబ్బంది నియామకాలు భర్తీ చేయలేదు. కేంద్రం అనుమతులతో పాటు కొన్ని సాంకేతిక కారణాలతోనే అనుకున్న సమయానికి ‘కొత్త జిల్లాకు ఒక వైద్య కళాశాల’ ఏర్పాటుకు అడ్డంకులు నెలకొన్నాయి. జగన్‌ ప్రభుత్వం కాలపరిమితి ముగిసేలోగా మిగిలిన 12 వైద్య కళాశాలల పనులు పూర్తకావడం అసాధ్యమే.
రూ.7880 కోట్లతో వైద్య కళాశాలలు
17 కొత్త వైద్య కళాశాలల నిర్మాణానికి రూ.7,880 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించనుంది. మచిలీపట్నం వైద్య కళాశాలకు 2021 జులై 7న సీఎం జగన్‌ శంకుస్థాపన చేశారు. 65 ఎకరాల విస్తీర్ణంలో రూ.550 కోట్లతో ఈ కళాశాలను నిర్మిస్తున్నారు. ఈ కళాశాలలో ప్రవేశాల కోసం నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌(ఎన్‌ఎంసీ) అనుమతిచ్చింది. శంకుస్థాపన చేసిన 17 కొత్త వైద్య కళాశాలల్లో కేవలం ఐదు కళాశాలల్లోనే తరగతులు ప్రారంభం కానున్నాయి. ఇంకా 12 కళాశాలలకు అనుమతులతో పాటు భవనాలు పూర్తి చేయాల్సి ఉంది. వైద్య కళాశాలలు, వాటి అనుబంధంగా ఉన్న సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో మౌలిక సౌకర్యాలు, వైద్యుల నియామకం చేపట్టకుండా హడావిడిగా ప్రారంభోత్సవాలకు ప్రభుత్వం సిద్ధమైంది. దీనిపై విపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే మిగిలిన వైద్య కళాశాలలు, సూపర్‌ స్పెషాలీటీ ఆస్పత్రుల నిర్మాణాలు పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న 13 వైద్య కళాశాలల అభివృద్ధికి రూ.4620 కోట్లను ప్రభుత్వం ఇప్పటికే కేటాయించింది.
పాడేరు కాలేజీపై నిర్లక్ష్యం
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరులో ఏర్పాటు చేసిన వైద్య కళాశాల, దానికి అనుబంధ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం పూర్తి కాలేదు. సూపర్‌ స్పెషాలిటీ భవనాల నిర్మాణం మధ్యలోనే ఉన్నది. ఈ పనులకు రూ.500 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. వాటిని వచ్చే విద్యాసంవత్సరానికి(2024-2025) ప్రారంభిస్తామని వైద్యారోగ్యశాఖ మంత్రి విడతల రజని తాజాగా వెల్లడిరచారు. దీంతో పాడేరు ప్రాంత ప్రజలు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. పాడేరుతో పాటు మరో రెండు కళాశాలలు వచ్చే విద్యాసంవత్సరానికి వాయిదా పడ్డాయి. ప్రధానంగా

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img