Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఏపీలో మరో నాలుగు రోజులు వానలు.. ఈ నెల 29న అల్పపీడనం

వాయవ్య బంగాళాఖాతంలో ఒడిశా తీరానికి ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రభావంతో గురువారం అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడనుందని అంచనా వేస్తున్నారు. ఇది మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇది 24 లోపు ఒడిశాలో తీరం దాటే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇటు రుతుపవన ద్రోణి కూడా బంగాళాఖాతం వరకు పయనిస్తోంది. ఈ ప్రభావంతో రానున్న 4 రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది అంటున్నారు. ఈ నెల 29న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.. శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, తూర్పుగోదావరి,కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయంటున్నారు. శనివారం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం,అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కడప, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అన్నారు. మొత్తం మీద రాష్ట్రవ్యాప్తంగా వానలు మరింత ఊపందుకున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img