ఏపీ ఉద్యోగులకు చంద్రబాబు గుడ్ న్యూస్ వినిపించారు.. ఆంధ్రప్రదేశ్ సచివాలయ, హెచ్ఓడి ఉద్యోగస్తులకు హెచ్ఆర్ఏ అంటే ఇంటి అద్దె భత్యం 24% కొనసాగింపుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీని పై సచివాలయ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. అంతేకాదు నూతన ప్రభుత్వంలో 12వ పిఆర్సి కమిషనర్ ని నియమించాలని కోరారు. త్వరగా ఉద్యోగులకు పిఆర్సి అమలు చేయాలని ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వాన్ని కోరారు.