Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

వేడెక్కిన బెజవాడ రాజకీయం

. టీడీపీలో భగ్గుమన్న విభేదాలు
. విజయవాడ ఎంపీ టికెట్టు రగడ
. ఎంపీ కేశినేని నాని అసంతృప్తి
. మల్లాది విష్ణు, వెలంపల్లి అలక

విశాలాంధ్ర బ్యూరో-అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ వాణిజ్య, రాజకీయ కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా నిలిచిన బెజవాడ రాజకీయం రసవత్తరంగా మారింది. రాబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచకుని రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల జాబితా ప్రకటనకు కసరత్తు చేస్తున్నాయి. అధికార వైసీపీ ఇప్పటికే రెండు జాబితాలు విడుదల చేసి, మూడో జాబితాపై కసరత్తు చేస్తోంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను మారుస్తూ, కొందరికి టికెట్లు నిరాకరిస్తూ వైసీపీ జాబితాలు విడుదల చేయడం కలకలం రేపుతోంది. దీంతో వైసీపీలో ఇన్‌చార్జిలు దక్కని వారు, తమ స్థానాల్లో ఇతరులకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించిన ఎమ్మెల్యేలంతా అసంతృప్తి రాగం అందుకున్నారు. పార్టీ వీడనంటూనే అనుచరులతో సమాలోచనలు చేస్తున్నారు. కొత్తగా వచ్చిన ఇన్‌చార్జిలను కలుపుకుని ముందుకెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. వైసీపీకి పోటీగా టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలకు అభ్యర్థులను నిలిపేందుకు కసరత్తు ప్రారంభించింది. తాజాగా విజయవాడ సిటింగ్‌ ఎంపీ కేశినేని శ్రీనివాస్‌(నాని)కి టికెట్‌ లేదని అధిష్ఠానం తేల్చిచెప్పింది. ఈ విషయాన్ని స్వయంగా ఎంపీ కేశినేని నాని ట్విట్టర్‌ వేదికగా వెల్లడిరచారు. కొంతకాలంగా విజయవాడ ఎంపీ కేశినేని నానికి, ఆయన సోదరుడు కేశినేని చిన్నికి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. విజయవాడ ఎంపీ టికెట్‌ తనదేనంటూ కేశినేని చిన్ని కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. విజయవాడ పార్లమెంట్‌ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లోనూ తనకంటూ ఒక అనుచరవర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇటీవల తిరువూరు టీడీపీ కార్యాలయం దగ్గర ఎంపీ కేశినేని నాని, కేశినేని చిన్ని అనుచరుల మధ్య విభేదాలు తీవ్రస్థాయికు చేరాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు తిరువూరులో బహిరంగ సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ సభను విజయవంతం చేయడంలో భాగంగా ఎంపీ కేశినేని, కేశినేని చిన్ని అనుచరులు పోటీ పడ్డారు. రెండు వర్గాలు బలప్రదర్శనకు దిగాయి. తుదకు వాగ్వివాదం, పరస్పర దాడులు చేసుకున్నారు. గాల్లోకి కుర్చీలు లేచాయి. అదుపుచేసేందుకు వచ్చిన పోలీసులు సైతం గాయపడ్డారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఎంపీ కేశినేని నానిని రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనవద్దని అధిష్ఠానం సూచించినట్లుగా ఆయనే స్వయంగా ప్రకటించుకున్నారు. ఇక కేశినేనికి టికెట్టు రాబోదని ఆయన అనుచరులు భావిస్తున్నారు. కేశినేని స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేసి, అన్ని నియోజకవర్గాల్లో ఆయన అనుచరులను స్వతంత్య్రంగా బరిలో దించే ఆలోచనలో ఉన్నారు. లేకుంటే వైసీపీలోకి పెద్దఎత్తున అనుచరులతో చేరేందుకు సమాలోచనలు చేస్తున్నట్లు తెలిసింది.
తారస్థాయికి వర్గ విభేదాలు
విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల నుంచి టీడీపీలో వర్గ విభేదాలున్నాయి. విజయవాడ మేయర్‌ అభ్యర్థిగా కేశినేని కుమార్తె శ్వేతను రంగంలోకి దించి, ఆమెను కార్పొరేటర్‌గా ఎంపీ నాని గెలిపించారు. అదే సమయంలో టీడీపీలో పశ్చిమ, సెంట్రల్‌ నియోజకవర్గానికి చెందిన నేతలు బుద్దా వెంకన్న, నాగుల్‌ మీరా, బోండా ఉమామహేశ్వరరావు టీడీపీకి వ్యతిరేకంగా పనిచేశారని కేశినేని వర్గీయులు ఆరోపిస్తున్నారు. పరోక్షంగా వైసీపీకి వారు సహకరించినట్లు అనుమానిస్తున్నారు. దీంతోనే టీడీపీ ఎక్కువ కార్పొరేట్‌ సీట్లు సాధించలేకపోయిందని, కేశినేని నానికి చెక్‌ పెట్టేందుకు సొంత టీడీపీ నేతలు ప్రవర్తించినట్లు ప్రచారముంది. అప్పటి నుంచి టీడీపీలో వర్గ విభేదాలు తారస్థాయికి చేరాయి. దీనిని ఆసరాగా తీసుకుని కేశినేని చిన్ని తన కార్యకలాపాలను వేగవంతం చేశారు. వ్యతిరేక వర్గాలను ఆయన కూడగట్టి ఎంపీ టికెట్‌ ఆశిస్తున్నారు. ఈ వర్గ విభేదాలు టీడీపీకి పెద్ద తలనొప్పిగా మారాయి. కేశినేని నాని సైతం పార్టీ అధిష్ఠానం వైఖరిపై అనేకసార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. తిరువూరు సభకు రావద్దని టీడీపీ అధిష్ఠానం ఆదేశించడంతో కేశినేని తన అనుచరులు, కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఇప్పటివరకు తన బాస్‌ చంద్రబాబేనని, ఫిబ్రవరిలో తన నిర్ణయం ప్రకటిస్తానని స్పష్టం చేశారు. భవిష్యత్‌లో ఆయన ఎలాంటి రాజకీయ నిర్ణయం ప్రకటిస్తారనే దానిపై టీడీపీలో ఉత్కంఠ నెలకొంది. టీడీపీతో బీజేపీ పొత్తు కుదిరితే ఈ సీటు బీజేపీకి ఇవ్వాలన్న ఆలోచనతో ఉన్నట్లు తెలిసింది. బీజేపీ తరపున మాజీ ఎంపీ సుజనా చౌదరి రంగంలో దిగుతారని సమాచారం.
మల్లాది విష్ణు పక్క చూపులు
ఇక వైసీపీ విషయానికి వస్తే విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సీటు గల్లంతవ్వడంతో ఆయన పక్కచూపులు చూస్తున్నట్లు తెలిసింది. విజయవాడ సెంట్రల్‌ బాధ్యతలు పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్‌ అధిష్ఠానం అప్పగించింది. దీంతో వెలంపల్లికి సహకరించేది లేదంటూ మల్లాది విష్ణు అనుచరులు తెగేసి చెబుతున్నారు. ఇప్పటికే విజయవాడ సింగ్‌నగర్‌లోని మల్లాది విష్ణు కార్యాలయానికి వెలంపల్లి వెళ్లి మంతనాలు జరిపినప్పటికీ వారు వెనక్కితగ్గడం లేదు. అటు విష్ణు కూడా మౌనంగా ఉండిపోయారు. తాను అధిష్ఠానం నిర్ణయాన్ని గౌరవిస్తానని, ఎంతోకాలం నుంచి పశ్చిమ నుంచి పోటీ చేసినందున సీటు మార్చడంతో కొంత బాధ ఉందని వెలంపల్లి వాపోయారు. విజయవాడ సెంట్రల్‌ నుంచి తన కార్యకలాపాలు ప్రారంభించారు. ఇది గమనించిన మల్లాది విష్ణు వర్గం మరింత అసంతృప్తి చెందుతోంది. వెలంపల్లికి సహకరించడం లేదు. ఇటీవల విజయవాడ వచ్చిన షర్మిలను మల్లాది విష్ణు కలిసినట్లు ప్రచారముంది. దీంతో ఆయన కాంగ్రెస్‌లోకి వెళ్తారని తెలిసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img