Monday, May 20, 2024
Monday, May 20, 2024

10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్‌ ఖాతా తెరవబోతుందా..?

రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగయ్యింది. 2014 మరియు 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు లో కూడా కాంగ్రెస్ గెలవలేక పోయింది. ఎట్టకేలకు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటూ రాజకీయ విశ్లేషకులు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ఏపీలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన వారిలో ఇద్దరు లేదా ముగ్గురు అసెంబ్లీకి వెళ్లడం ఖాయం గా కనిపిస్తుంది. అందులో ముఖ్యుడు మాజీ మంత్రి శైలజానాథ్‌ ఒకరు.

రాష్ట్ర విభజన సమయంలో సమైక్యవాదం వినిపించడంతో పాటు, రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ మాట్లాడాడు. రాష్ట్ర విభజన తర్వాత పీసీసీ అధ్యక్షుడిగా కూడా చేసిన జగన్‌ సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్ లోనే కొనసాగుతూ వస్తున్నాడు. వైకాపా, బీజేపీ మరియు టీడీపీలతో పాటు జనసేన పార్టీల నుంచి కూడా శైలజానాథ్ కి ఆఫర్‌ వచ్చాయి. వైకాపా ఏకంగా మత్రి పదవిని ఆశ చూపించినా కూడా శైలజానాథ్‌ పార్టీ మారలేదు అనే మంచి పేరు ఉంది.

ఈ మధ్య కాలంలో ఊసరవెల్లి మాదిరిగా పార్టీలు మారుతున్న నాయకులు ఉన్నారు. అలాంటిది పది సంవత్సరాలు పూర్తిగా నిర్జీవంగా ఉన్న పార్టీలో కొనసాగడం అంటే మామూలు విషయం కాదు. ఆయన యొక్క పట్టుదల మరియు ఆయన యొక్క రాజీలేని గుణం ను ప్రజలు అర్థం చేసుకున్నారు. అందుకే ఈసారి శింగనమల అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో శైలజానాథ్ ను భారీ మెజార్టీతో గెలిపించేందుకు సిద్ధం అవుతున్నారు.

గతంతో పోల్చితే కాంగ్రెస్ పార్టీ బలం పెరిగింది. అంతే కాకుండా వైకాపా మరియు కూటమి తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులతో పోల్చితే శైలజానాథ్ కి రాజకీయ బలం ఉంది. అంతే కాకుండా ప్రజల్లో మంచి గుర్తింపు కూడా ఉంది. అందుకే శింగనమలలో ఈసారి కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం. పదేళ్ల తర్వాత ఏపీ అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అడుగు పెట్టడం ఖాయం అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

స్థానికంగా ఉన్న సమస్యలను గురించి ప్రస్థావిస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చేసే పనుల గురించి వివరిస్తూ శైలజానాథ్ ప్రచారం చేస్తున్నారు. కూటమి తో పాటు వైకాపా అభ్యర్థులకు ఓటు వేయడం ద్వారా జరిగే అభివృద్ది శూన్యం. అందుకే శైలజానాథ్ కి ఓటు వేయడం ద్వారా ఆయన అనుభవంతో నియోజకవర్గంను అభివృద్ది చేస్తారు అనే నమ్మకంను స్థానిక ఓటర్లు వ్యక్తం చేస్తున్నార.ట అందుకే ఈసారి శింగనమలలో శైలజానాథ్ గెలుపు ఖాయం. పదేళ్ల తర్వాత ఏపీలో కాంగ్రెస్ కి దక్కబోతున్న మొదటి అసెంబ్లీ సీటు ఇదే అంటూ ప్రతి ఒక్కరు చాలా నమ్మకంగా చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img