Thursday, October 31, 2024
Thursday, October 31, 2024

అసెంబ్లీ స‌మావేశాల‌కు జ‌గ‌న్..

ఏపీలో నూతన ప్రభుత్వం కొలువుదీరింది. ఈ క్రమంలో ఈనెల 22నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయనే విషయం తెలిసిందే. అయితే జరగబోయే అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ హాజరవుతారా ? లేదా ? అనే ప్రశ్నలు ఇటీవల తలెత్తాయి. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడంపై వైసీపీ అధినేత జగన్ క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో తాజాగా మాజీ సీఎం జగన్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశాలకు ఆయన హాజరుకానున్నట్లు ఆ పార్టీ నేతలు వెల్లడించారు. అయితే ఈ సమావేశంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఘటనలను లేవనెత్తాలని జగన్ భావిస్తున్నారని సమాచారం. ఈ ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసిన వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితం కావడంతో ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. అయితే ప్రతిపక్ష హోదా లేకపోవడంతో సాధారణ ఎమ్మెల్యేగా జగన్ చర్చల్లో పాల్గొంటారు. ఈక్రమంలో మాజీ సీఎం జగన్‌కు అధికార పార్టీ తగిన సమయం ఇస్తుందా ? లేదా ? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img