Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

మోదీ పాలన అస్తవ్యస్తం

. పేట్రేగిన కుల`మత హింస
. ఉమ్మడి పౌరస్మృతితో సామాజిక విభజనే కేంద్రం లక్ష్యం
. బీజేపీ ఓటమే లక్ష్యంగా ఎన్నికలకు సిద్ధం కావాలి
. 25న మణిపూర్‌ సంఫీుభావం దినం
. సీపీఐ జాతీయ సమితి నిర్ణయాలు వివరిస్తూ ప్రధాన కార్యదర్శి రాజా

న్యూదిల్లీ : కేంద్రంలోని మోదీ ప్రభుత్వ తొమ్మిదేళ్ల పాలనలో దేశ లౌకిక, ప్రజాస్వామిక వ్యవస్థకు తీవ్ర నష్టం జరిగిందని, కులమత హింస పేట్రేగిందని, మైనారిటీలపై వివక్ష పెరిగిందని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా అన్నారు. ఫెడరల్‌ వ్యవస్థకు ప్రభుత్వం వ్యతిరేకమని బహిర్గతమైందన్నారు. బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక ఆర్థిక విధానాలను దుయ్యబట్టారు. కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన ఈ నెల 14,15, 16 తేదీల్లో ఇక్కడి అజయ్‌భవన్‌లో జరిగిన సీపీఐ జాతీయ సమితి సమావేశాలు ఆదివారం ముగిశాయి. అనంతరం సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యులు వినయ్‌ విశ్వం, అతుల్‌ కుమార్‌ అంజాన్‌, కె.నారాయణ, కాంగోతో కలిసి రాజా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జాతీయ సమితి నిర్ణయాలు, ఆమోదించిన తీర్మానాలను వివరించారు. ఉమ్మడి పౌరస్మృతి ద్వారా సామాజిక మతపరమైన విభజనను మోదీ ప్రభుత్వం ఆకాంక్షిస్తోందని రాజా అన్నారు. దిగిరాని ద్రవ్యోల్బణం, పెరిగిన నిరుద్యోగం, నీరుగారిన రైతుల ఆదాయం రెట్టింపు హామీ, బ్యాంకు రుణఎగవేతదారులపై చర్యలు తదితర అనేక అంశాలపై సమావేశం తీర్మానించినట్లు తెలిపారు. జులై 25న దేశవ్యాప్తంగా మణిపూర్‌ సంఫీుభావ దినంగా జరుపుకోవాలని జాతీయ సమితి పిలుపునిచ్చిందన్నారు. రాష్ట్ర పరిస్థితిపై ప్రధాని మౌనాన్ని దుయ్యబట్టింది. ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ ప్రధాన కార్యదర్శి అనీరాజా, నాయకులు నిషా సిద్ధూ, దీక్షా ద్వివేదిపై ఎఫ్‌ఐఆర్‌ను ఖండిస్తూ దానిని తక్షణమే ఉపసంహరించుకోవాలని పార్టీ డిమాండ్‌ చేసినట్లు వెల్లడిరచారు. విభజించి పాలించు సిద్ధాంతానికి కట్టుబడి ప్రజలను విభజించి రాజకీయంగా లబ్ధి పొందాలని ప్రధానమంత్రి, ఆయన పార్టీ భావిస్తోందని వ్యాఖ్యానించారు. సామాజిక వైవిధ్యతకు విఘాతం కలిగించవద్దని, భాగస్వాములందరితో సంప్రదింపులు జరిపి ఉమ్మడి పౌరస్మృతిపై నిర్ణయానికి రావాలని బీజేపీ ప్రభుత్వాన్ని సీపీఐ కోరుతోందని రాజా చెప్పారు. ఉమ్మడి పౌరస్మృతి అనవసరమని 21వ లా కమిషన్‌ స్పష్టం చేసిందని గుర్తుచేశారు. సరైన ముసాయిదా లేకపోవడం, చర్చలు జరపకపోవడం, ప్రజల అభిప్రాయాన్ని సేకరించకపోవడం సబబు కాదన్నారు. ఏకరూపత సమానత్వం కాబోదని, లింగ సమానత్వానికి తమ పార్టీ కట్టుబడి ఉందని రాజా స్పష్టంచేశారు. బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక కార్యకలాపాలను దుయ్యబట్టారు. లౌకిక, ప్రజాస్వామ్య, ఫెడరల్‌ వ్యవస్థకు మోదీ ప్రభుత్వం తూట్లు పొడిచిందని పేర్కొన్నారు. ఈ ఏడాది తెలంగాణ, రాజస్తాన్‌, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌, మిజోరం రాష్ట్రాల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలతో పాటు వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎన్నికలకు సంబంధించి సంబంధిత రాష్ట్ర శాఖలు తగు నిర్ణయాలు తీసుకోవాలని, ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని, ఎన్నికల కోసం నిధుల సేకరణకూ పూనుకోవాలని రాజా సూచించారు. బీజేపీని ఓడిరచడంతో పాటు అసెంబ్లీలతో పాటు పార్లమెంటులో పార్టీ బలాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగాలని స్పష్టంచేశారు. చంద్రయాన్‌3 ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రోకు శుభాకాంక్షలను తెలిపారు. అసోం పార్లమెంటు నియోజకవర్గాల డిలిమిటేషన్‌ ప్రతిపాదనను వ్యతిరేకించడం, వరద బాధితులకు ఆహారం, తాగునీరు, పాలు, మందులు తదితరాలు అందజేయాలని కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్‌ చేయడం, బీజేపీయేతర రాష్ట్రాల్లో గవర్నర్‌ వ్యవస్థ ద్వారా పరిపాలన వ్యవహారాల్లో కేంద్ర జోక్యాన్ని వ్యతిరేకించడం వంటి అంశాలు తీర్మానాల్లో ఉన్నాయి. తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవిని తొలగించాలని, అటవీ, పర్యావరణం వ్యతిరేక బిల్లు ఉపసంహరించాలని కూడా సీపీఐ జాతీయ సమితి డిమాండ్‌ చేసింది. అసోంలో కూరగాయల ధరల అమాంతం పెరిగిపోవడానికి ముస్లిం వర్తకులను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంతా బిశ్వశర్మ నిందించడాన్ని తీవ్రంగా ఖండిరచింది. ఈ ప్రకటనను రాష్ట్రంలో విద్వేషాన్ని`మతఘర్షణలను రెచ్చగొట్టే ప్రయత్నంగా వర్ణించింది. ధరలను నియంత్రించడంలో అసమర్థతను, వైఫల్యాలను కప్పించుకునేందుకు ఇతరులపై నిందలు వేస్తున్నారని సీఎంను దుయ్యబట్టింది. బ్యాంకు రుణాలను ఎగవేసే వారిపై ఆర్బీఐ పట్టిష్ఠ చర్యలు తీసుకోకపోతే ప్రజాధనాన్ని దోచుకోవడానికి చట్టబద్ధత కల్పించినట్లు అవుతుందని వ్యాఖ్యానించింది. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న హామీ అమలు కాకపోగా రైతుల సాగు వ్యయం మరింత పెరిగిందని పేర్కొంది. మోదీ విధానాలతో ఆర్థిక మందగమనం సాగుతోందని, ఇటీవల సంపన్నులతో పాటు పేదల సంఖ్య కూడా పెరిగిందని తెలిపింది. ప్రైవేటీకరణ విషయంలో కేంద్రప్రభుత్వం దూకుడు ప్రదర్శిస్తోందని, మోదీ ఓ సందర్భంలో ‘మన దేశంలో ప్రభుత్వ రంగం అంతమయ్యేందుకే ఆవిర్భవిస్తుంది’ అని అనడాన్ని గుర్తుచేసింది. ఇటువంటి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా యూనియన్ల పోరాటాలు సాగుతున్నాయని పేర్కొంది. కార్పొరేట్లకు బ్యాంకులు రుణమాఫీలు, రైటాఫ్‌లు కల్పిస్తున్నాయని తెలిపింది. గత నెలలో కావాలనే బ్యాంకులను మోసం చేసే రుణ ఎగవేతదారుల రుణాలను రద్దు చేస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించిందని, వారిపై కఠిన చర్యలు తీసుకోకపోగా రాయితీలు ఇస్తూ కార్పొరేట్లపై ప్రేమను మోదీ ప్రబుత్వం ఒలకపోస్తోందని విమర్శించింది. ఈనెల 19వ తేదీకి బ్యాంకుల జాతీయీకరణకు 55 ఏళ్లు అవుతాయని, ఇందులో సీపీఐది ప్రధాన పాత్రని, బ్యాంకుల జాతీయీకరణ కోసం నాటి పార్టీ ఎంపీ, ఏఐబీఈఏ ప్రధాన కార్యదర్శిగా ప్రభాత్‌ ఖేర్‌ పోరాడారని సీపీఐ వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img