Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

శాంతించిన మునేరు

. విజయవాడ – హైదరాబాద్‌ హైవే క్లియర్‌
. రాకపోకల పునరుద్ధరణ
. కృష్ణాకు భారీగా వరద

విశాలాంధ్ర బ్యూరో - అమరావతి: మునేరు వాగు శాంతించడంతో వరద నీరు తగ్గుముఖం పట్టింది. దీంతో విజయవాడహైదరాబాద్‌ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు పోలీసులు అనుమతించారు. వాహనాలు నిలిచిపోయిన సమయంలో రెవెన్యూ అధికారులు, పోలీసులు సహాయక చర్యలో పాల్గొన్నారు. వరదల్లో చిక్కుకున్న అనేకమందిని రక్షించారు. తెలుగు రాష్ట్రాల్లో గత కొద్దిరోజులుగా భారీ వర్షాలు దంచి కొట్టడంతో వివిధ ప్రాంతాలు వరద ముంపుకు గురయ్యాయి. ఈ వరదల కారణంగా ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ మండలం ఐతవరం వద్ద జాతీయ రహదారిపై మునేరు వరద భారీగా చేరి ..రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడిరది. దీంతో విజయవాడ-హైదరాబాద్‌ జాతీయ రహదారి మీద దాదాపు 24 గంటలకు పైగా రాకపోకలు నిలిచిపోయాయి. వేలాది వాహనాలు రోడ్డుకిరువైపులా బారులు తీరాయి. టీఎస్‌ఆర్టీసీ కూడా ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్‌-విజయవాడల మధ్య రెగ్యులర్‌ గా నడుపుతున్న సర్వీసులను రద్దు చేసింది. 24 గంటల తర్వాత ఈ దారిని పునరుద్ధరించారు. తిరిగి వాహనాల రాకపోకలు ప్రారంభమయ్యాయి.
దవళేశ్వరం వద్ద గోదావరి ఉధృతి
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని ధవళేశ్వరం వద్ద గోదావరి వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రాజెక్ట్‌ వద్ద గోదావరి ప్రస్తుత నీటిమట్టం 14.70 అడుగులకు చేరుకుంది. ధవళేశ్వరం బ్యారేజి వద్ద ఇన్‌ ఫ్లో 14 లక్షల 42 వేల క్యూసెక్కులు ఉండగా రెండవ ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటి ప్రవాహం కొనసాగుతోంది. ఇప్పటికే చింతూరు సహా విలీన మండలాల్లో 120 గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. బాహ్య ప్రపంచంతో పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి. లాంచీల సహాయంతో అధికారులు ముంపు గ్రామాల ప్రజలకు నిత్యావసర సరుకులను అందజేస్తున్నారు. వరద ముప్పు ఎక్కువగా ఉన్న కూనవరం, వరరామచంద్రపురం మండలాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇక భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. శనివారం ఉదయం 8 గంటలకు గోదావరి నీటి మట్టం 54.30 అడుగులుగా ఉంది. 14,92,679 క్యూసెకుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మూడో ప్రమాద హెచ్చరిక ప్రస్తుతం అమలులో ఉంది.
నిండుతున్న ప్రాజెక్టులు
కొద్దిరోజులుగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. దీనికితోడు మహారాష్ట్ర, కర్నాటకలోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. కృష్ణ, గోదావరి నదులు పొంగిపోర్లుతున్నాయి. ఆయా ఉప నదులు కూడా జోరుగా ప్రవహిస్తున్నాయి. ఫలితంగా ఎగువ నుంచి వస్తున్న వరదలతో తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాజెక్టులు నిండుకుండల్లా మారుతున్నాయి.. గోదావరి బేసిన్‌తో పోలీస్తే మాత్రం.. కృష్ణా బేసిన్‌లో వరద ప్రవాహం కాస్త ఆలస్యంగానే ప్రారంభం అయ్యింది. ఇప్పుడిప్పుడే కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టుల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో జూరాల, శ్రీశైలం ప్రాజెక్ట్‌ లకు వరద ప్రవాహం కొనసాగుతోంది.
శ్రీశైలం జలాశయానికి…
కృష్ణా బేసిన్‌లోని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతోంది. ఎగువ నుంచి 1.22 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. అంతే స్థాయిలో స్పిల్‌ వే గేట్లు, విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ కిందికి నీటిని వదిలేస్తున్నారు. దాదాపు లక్ష క్యూసెక్కుల ప్రవాహం శ్రీశైలం జలశాయానికి కొనసాగుతోంది. శనివారం ఉదయం 6 గంటలకు జలాశయ నీటిమట్టం 829.92 అడుగులు, నీటినిల్వ 48 టీఎంసీలుగా నమోదైంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు. ఫలితంగా శ్రీశైలం డ్యామ్‌ నిండడానికి మరింత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. పూర్తిస్థాయిలో డ్యామ్‌ నిండాలంటే 885 అడుగులకు నీరు చేరాలి. ఫలితంగా ఇప్పట్లో గేట్లు ఎత్తే పరిస్థితి మాత్రం లేదు. కృష్ణమ్మ మరింతగా పరవళ్లు తొక్కితేగాని శ్రీశైలం నిండే అవకాశం ఉంటుంది. అప్పుడు మాత్రమే గేట్లు ఎత్తనున్నారు. ఇక కర్నాటకలోని నారాయణపుర ఆనకట్టలోకి ఇన్‌ఫ్లో పెరగడంతో శుక్రవారం 20 గేట్లను ఎత్తివేసి 1,14,200 క్యూసెక్కులను జూరాలకు విడుదల చేశారు. ఫలితంగా శ్రీశైలానికి మరింత వరద చేరే అవకాశం ఉంది. మరోవైపు ప్రకాశం బ్యారేజీలోకి వరద కొనసాగుతోంది.
55 గేట్లను 6 అడుగులు, 15 గేట్లను ఏడు అడుగుల మేర ఎత్తి సముద్రంలోకి నీటిని వదిలేస్తున్నారు. జులై చివరి వారంలో ప్రకాశం బ్యారేజీకి ఈ స్థాయిలో వరద రావడం ఇదే తొలిసారి. శుక్రవారం నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టడంతో వరద ప్రవాహం తగ్గే పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ధవళేశ్వరం బ్యారేజ్‌ వద్ద రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. బ్యారేజీకి ఎగువ భాగాన నుంచి పెద్ద ఎత్తున వరద నీరు వస్తుండడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img