Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

రాజకీయ వేడి

వైసీపీ, టీడీపీ పోటాపోటీ సభలు
ఆశావహులతో కార్యాలయాలు కిటకిట

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: ఎన్నికల షెడ్యూలు విడుదల కాకముందే రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఇప్పటికే అధికార, ప్రతిపక్ష పార్టీలు సగంపైగా నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసి జాబితాలను విడుదల చేశాయి. మిగిలిన నియోజకవర్గాలకు కూడా మరో వారం రోజుల్లో ఎంపిక ప్రక్రియ పూర్తి చేసేందుకు ఆయా పార్టీల అధినేతలు రేయంబవళ్లూ కసరత్తు చేస్తున్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌ఛార్జిల పేరుతో ఇప్పటివరకు ఏడు జాబితాలు విడుదల చేసి, సగంపైగా నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేయగా, టీడీపీ, జనసేన కూటమి నేరుగా ఎన్నికల్లో పోటీచేసే 99 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసింది. ఎన్నికల పొత్తులో భాగంగా జనసేనకు 24 ఎమ్మెల్యే స్థానాలు కేటాయించగా, వాటిలో 5 నియోజకవర్గాలకు మాత్రమే జనసేన అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన నియోజకవర్గాలకు త్వరలో అభ్యర్థులను ప్రకటించేందుకు విస్తృత కసరత్తు చేపడుతోంది. టీడీపీ 94 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. బీజేపీతో పొత్తు కోసం ఈ రెండు పార్టీలు ప్రస్తుతం అర్రులు చాస్తున్నాయి. కమలంతో పొత్తు తేలిన తర్వాత మిగిలిన స్థానాలకు అభ్యర్థులను పూర్తిస్థాయిలో ప్రకటించేందుకు టీడీపీ మలి జాబితాను సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో ఇప్పటివరకు ఆయా నియోజకవర్గాల్లో సీట్లు రాని నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ… ఇతర పార్టీల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తుండగా, ఇంకా అభ్యర్థిత్వాలు ఖరారు కాని నేతలు అధినేతల ఆశీస్సుల కోసం పార్టీ కార్యాలయాలు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. దీంతో టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీ కార్యాలయాలు నాయకులు, వారి అనుచరగణంతో కోలాహలంగా మారాయి. మరోపక్క ‘సిద్ధం’ పేరుతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా భారీస్థాయిలో బహిరంగసభలు నిర్వహిస్తూ తమకున్న ప్రజాబలాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈసందర్భంగా వైసీపీ ప్రభుత్వం నవరత్నాల పేరుతో ప్రజలకు చేస్తున్న సంక్షేమాన్ని, వివిధ పథకాల పేరుతో ఒక్కొక్క కుటుంబానికి అందించిన ఆర్థిక ప్రయోజనాలను వివరిస్తూ…మంచి జరిగిందని భావిస్తే తనను మరోసారి ఆశీర్వదించాలని ప్రజలను కోరుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ‘రా కదలి రా’ పేరుతో సభలు నిర్వహిస్తూ భారీ జనసమీకరణ చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో అరాచకాలు జరిగాయని, సంక్షేమం ముసుగులో దోపిడీ జరుగుతోందని వివరిస్తూ… అభివృద్ధిలో వెనుకబడ్డ ఏపీ భవిష్యత్తు కోసం టీడీపీ, జనసేన కూటమిని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ క్రమంలో తాడేపల్లిగూడెంలో 28వ తేదీ టీడీపీ`జనసేన కూటమి తరపున ఉమ్మడి బహిరంగసభను పెద్దఎత్తున నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసభలో చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లు ఎన్నికల సమరశంఖం పూరించనున్నారు. మరోవైపు చంద్రబాబు అరెస్ట్‌ సందర్భంగా మృతి చెందిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలను ఓదార్చేందుకు ‘నిజం గెలవాలి’ పేరుతో నారా భువనేశ్వరి పర్యటిస్తూ ఓటర్లను చైతన్యపరుస్తున్నారు. టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్‌… పార్టీ కేంద్ర కార్యాలయం, లేదా నివాసగృహంలో ఉంటూ పార్టీలో చేరికలు, సీట్ల సర్దుబాట్లు, నేతల అలకలపై దృష్టి పెడుతున్నారు. ఇక పీసీసీ అధ్యక్షురాలు షర్మిల, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తూ వైసీపీ ప్రభుత్వ విధానాలను ఎండగడుతున్నారు. సీపీఐ, సీపీఎం పార్టీలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రత్యక్ష పోరాటాల ద్వారా ప్రజలను చైతన్య పరుస్తున్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వాన్ని, రాష్ట్రంలో బీజేపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్న వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలను ఓడిరచాలని పిలుపునిస్తున్నారు. ఇలా మొత్తానికి అన్ని రాజకీయపార్టీలు ఎన్నికల ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేయడంతో రాజకీయ వాతావరణం రోజురోజుకూ వేడెక్కుతోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img