Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

సీపీఐ ప్రవేశపెట్టిన ప్రైవేట్‌ బిల్లులు చర్చకు సిద్ధం

జాబితాలో చేర్చినట్టు వినయ్‌ విశ్వం వెల్లడి

న్యూదిల్లీ: సీపీఐ ప్రవేశపెట్టిన మూడు కీలక ప్రైవేట్‌ బిల్లులు పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో చర్చకు రానున్నాయి. ఈ చర్చ కోసం బిల్లులను రాజ్యసభ జాబితాలో చేర్చినట్లు రాజ్యసభలో సీపీఐ పక్ష నేత వినయ్‌ విశ్వం వెల్లడిరచారు. గవర్నర్ల వ్యవస్థ రద్దు, మహిళా సమానత్వం కోరుతూ ఐపీసీ చట్టానికి ప్రతిపాదించిన సవరణలు, నరబలి, ఇతర మూఢనమ్మకాల నియంత్రణపై ప్రతిపాదించిన మూడు వ్రైవేటు బిల్లులు పార్లమెంటులో చర్చకు రానున్నట్లు ఆయన చెప్పారు. గవర్నర్ల వ్యవస్థ రద్దును కోరుతూ వినయ్‌ విశ్వం ఈ ఏడాది ఏప్రిల్లోనే బిల్లును రాజ్యసభకు సమర్పించారు. ఈ మూడు కీలక బిల్లులు జాబితాలో చేరి చర్చకు ఎదురు చూస్తున్నాయి. వినయ్‌ విశ్వం ఈ మేరకు ఒక ప్రకటనలో తెలిపారు. ‘గవర్నర్ల వ్యవస్థను రద్దు చేయవలసిన సమయం ఆసన్నమైంది. ఇదే సరైన తరుణం. భారత రాజకీయ వ్యవస్థకు గవర్నర్ల వ్యవస్థ పెద్దభారంగా మారింది. వివిధ రాష్ట్రాలలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను గవర్నర్ల వ్యవస్థ ఆక్రమించుకుంటున్నది. ప్రధాని మోదీ హయాంలో ప్రజాప్రభుత్వాల పాలనలో గవర్నర్ల జోక్యం మరింత ఎక్కువైంది. తరుచుగా ఇలాంటి ఘటనలు చూస్తున్నాం. ప్రజాప్రభుత్వాలను అస్థిరపరచేందుకు చేస్తున్న ప్రయత్నాలు, ఇందుకోసం రాజ్‌భవన్‌లను దుర్వినియోగం చేస్తున్న ఘటనలు చాలా ఎక్కువ సంఖ్యలో వెలుగులోకి వస్తున్నాయి. కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌, మహారాష్ట్ర, తెలంగాణ వంటి బీజేపీయేతర రాష్ట్రాలలోనే ఈ ఘటనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎన్నికైన ప్రభుత్వాల విషయంలో గవర్నర్ల జోక్యం వల్ల నిరంతరం ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. భవిష్యత్‌లో ఇలాంటి పరిస్థితులు ఏర్పడకుండా నివారించడం కోసం రాజ్యాంగానికి సవరణ బిల్లు-2023ను ప్రతిపా దించాం. ఈ మేరకు రాజ్యాంగంలో ఉన్న సుమారు 70కిపైగా అధికరణలను సవరించవలసి ఉంటుంది. వలసపాలకుల నుండి పారంపర్యంగా కొనసాగుతున్న గవర్నర్ల వ్యవస్థ సమకాలీన రాజకీయ వ్యవస్థకు తీవ్రమైన హాని కలిగిస్తోంది’ అని వినయ్‌ విశ్వం పేర్కొన్నారు.
స్త్రీ-పురుష సమానత్వం అవశ్యం
నిరంతర పరిణామక్రమంలో మారుతున్న సమాజా నికి అనుగుణంగా చట్టాలు ఉండాలని, ప్రజలకు విశ్వస నీయమైన సేవలు అందించాలంటే మారుతున్న సమాజా నికి వీలుగా ప్రజల నైతిక ప్రవర్తనను రూపుదిద్దడానికి చట్టాలు అవసరమని వినయ్‌ విశ్వం ఉద్ఘాటించారు. ‘సమాజంలో మహిళలు నిర్లక్ష్యానికి గుర య్యారు. వారిని అభిక్రమంలో భాగస్వాములను చేయకుండా పక్కకు నెట్టేశారు, గత కాలపు చట్టాలన్నీ ఈ అంశాలనే ప్రతిబింబి స్తున్నాయి, ప్రత్యేకించి వలసపాలకుల చట్టాలు వీటినే బలపరుస్తున్నాయి. ఉదాహరణకు చెప్పాలంటే కుటుంబ జీవితంలో స్త్రీ సమ్మతి లేకుండా భర్త బలవంతంగా తన కోరిక తీర్చుకునేందుకు అత్యాచారం చేసినట్లయితే చట్టం నుండి భర్తకు మినహాయింపు లభిస్తోంది. దానిని చట్టం నేరంగా పరిగణించలేకపోతోంది. కాలానుగుణంగా చట్టాలలో ఈ మార్పులు రావలసి ఉంది. వలసపాలకులు చేసిన చట్టాలలో స్త్రీ సమ్మతిని పరిగణనలోకి తీసుకోలేదు. స్త్రీకి సమానహక్కులు లేవు. సమాజంలో స్త్రీలను తక్కువ చేసి చూస్తున్నారు. అందువల్ల స్త్రీ పురుష సమానత్వ ప్రాతిపదికపై మన సమాజాన్ని తిరిగి పునర్నిర్మించవలసిన అవసరం ఉంది’ అని వినయ్‌ విశ్వం తన ప్రైవేటు బిల్లులో స్పష్టం చేశారు. ‘సమాజంలో స్త్రీ పురుష సమానత్వం సాధించడానికి వీలుగా 1860వ సంవత్సరంలో చేసిన ఇండియన్‌ పీనల్‌ కోడ్‌లోని చట్టానికి సవరణలు చేయవలసి ఉంది. ఈ బిల్లును ఆమోదించినట్లయితే రాజ్యాంగంలోని 14వ అధికరణ, 21వ అధికరణల స్ఫూర్తితో ఐపీసీ చట్టాన్ని ఏకరీతిగా ఉంచినట్లవుతుంది. దానిద్వారా మహిళలు సమాన భాగస్వాములుగా పురుషులతోపాటు గౌరవం పొందే అవకాశం లభిస్తుంది’ అని విశ్వం తెలిపారు.
నరబలి, మూఢనమ్మకాల నియంత్రణ బిల్లు
దేశంలో మూఢనమ్మకాలను నియంత్రించవలసిన అవసరం ఉందని వినయ్‌ విశ్వం స్పష్టంచేశారు. నరబలి నిర్మూలన, ఇతర మూఢనమ్మకాలను పాటించడాన్ని నియంత్రించే బిల్లును వినయ్‌ విశ్వం రాజ్యసభకు ప్రతిపా దించారు. ‘చాలా అశాస్త్రీయమైన ఆలోచనా విధానాలు సమాజంలో నెలకొన్నాయి. సమాజంలో కొన్ని వర్గాలలో ఈ మూఢనమ్మకాలు బలీయంగా వ్యాపించి ఉన్నాయి, వాటిని సమూలంగా నిర్మూలించవలసిన ఆవశ్యకత ఉంది. ఈ బిల్లు ద్వారా సామాజిక చైతన్యాన్ని, శాస్త్రీయ దృక్పథాన్ని సమాజంలో తీసుకురావడానికి వీలు కలుగుతుంది. సురక్షితమైన ఆరోగ్య వాతావరణం, శాస్త్రీయ దృక్పథం సమాజంలో పరిఢవిల్లుతుంది’ అని బిల్లులో విశ్వం పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img