Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

తెలుగు రాష్ట్రాల్లో వానలే..వానలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మూలంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో గత మూడు రోజులుగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. దీంతో వాగులు , వంకలు పొంగిపొర్లుతున్నాయి. అనేక చోట్ల చెరువులు అలుగులు పడడంతో పలు చోట్ల రోడ్లు తెగి రవాణా వ్యవస్థ కు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అయితే ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో ఉంది. 20 డిగ్రీల ఉత్తర అక్షాంశం ద్వారా సముద్ర మట్టానికి 3.1 కి.మీ. ఎత్తు నుండి 5.8 కి.మీ మధ్యలో కొనసాగుతుంది. ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతం మీదుగా వాయుగుండంగా బలపడిన అల్పపీడనం నేడు వాయువ్య దిశగా పయనించి పూరీ సమీపంలో ఒడిశా తీరం దాటే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో రెడ్ అలర్ట్ ఉండగా.. పది జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఉత్తర తెలంగాణలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో ఉదయం నుంచి మళ్లీ వర్షం మొదలైంది. మధ్యాహ్నం 3 గంటల వరకు వర్షం కురుస్తుంది. ఉదయం 10 గంటల తర్వాత వర్షం పెరుగుతుంది. హైదరాబాద్, ఉత్తర, పశ్చిమ తెలంగాణలో సాయంత్రం 5 గంటల తర్వాత భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణలో రాత్రి 9 గంటల తర్వాత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img