Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఏపీలో మళ్లీ రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు

ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరికలు
ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత కొనసాగుతోంది. గత వారం రోజులుగా రోహిణీ కార్తె ప్రభావంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరిగి, ఎండల తీవ్రత పెరిగింది. వేడిగాలుల దెబ్బకు జనాలు బెంబెలెత్తిపోతున్నారు. శుక్రవారం గరిష్ఠ ఉష్ణోగ్రతలు 47 డిగ్రీల వరకు నమోదవుతాయని అంచనా వేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 145 మండలాల్లో వేడి గాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో వేడిగాలుల తీవ్రంగా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా గురువారం ప్రకాశం జిల్లా పామూరులో 44.8 డిగ్రీలు, ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం, పల్నాడు జిల్లా నరసరావుపేటలో 44.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే తిరుపతి జిల్లా రేణిగుంటలో 44.6 డిగ్రీలు, కృష్ణా జిల్లా కోడూరులో 44.5 డిగ్రీలు, నెల్లూరు జిల్లా మనుబోలులో 44.4 డిగ్రీలు, అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరంలో 44.3 డిగ్రీలు, గుంటూరు జిల్లా తుళ్లూరులో 44.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదనైట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కోస్త్రాంధ్రలోని జిల్లాల్లో వేడి గాలులు వీస్తున్నాయి. ఎండదెబ్బ తగలకుండా టోపీ, గొడుగు, టవల్, కాటన్ దుస్తులు ఉపయోగించాలని సూచించారు. వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు. చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలని.. అలాగే గుండె జబ్బులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగకూడదన్నారు.

మరోవైపు నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి.. అలాగే తమిళనాడులో కొంతమేర, బంగాళాఖాతంలో పలు ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయని చెబుతున్నారు. అలాగే రెండు, మూడు రోజుల్లో తమిళనాడులోని మరికొన్ని ప్రాంతాలకు.. అనంతరం కర్ణాటకలో పలు ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయని అంచనా వేస్తున్నారు. అంతేకాదు మరో మూడు నుంచి నాలుగు రోజుల్లో ఏపీలోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందంటున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img