Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

పెచ్చరిల్లిన అల్లర్లు

. హరియాణాలో కొనసాగుతున్న ఉద్రిక్తత
. గుర్‌గ్రామ్‌ మసీదుపై దాడిలో ఇమామ్‌ మృతి
. హింసాకాండలో ఐదుకి పెరిగిన మృతుల సంఖ్య

గురుగ్రామ్‌/చండీగఢ్‌: హరియాణాలో రెండు వర్గాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలు మరింత పెచ్చరిల్లాయి. నుప్‌ా జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. కర్ఫ్యూను కూడా లెక్క చేయకుండా రెండు వర్గాల వారు రోడ్ల మీదకు వచ్చి పరస్పరం దాడులకు పాల్పడుతున్నారు. ఇతరుల ఆస్తులకు నష్టం కలిగిస్తున్నారు. తాజాగా అల్లర్ల ప్రభావం పక్కనున్న గురుగ్రామ్‌ జిల్లా పైనా పడిరది. కొన్ని అల్లరి మూకలు వివాదాస్పద నినాదాలు చేస్తూ బాద్‌షాపుర్‌లోని ఒక రెస్టారెంట్‌తో పాటు దుకాణానికి నిప్పు అంటించారు. ఈ ఘటన సోమవారం రాత్రి నుప్‌ా జిల్లాలో అల్లర్లు చోటుచేసుకున్న ప్రాంతానికి కేవలం 40 కి.మీ. దూరంలో ఉంది. గురుగ్రామ్‌లోని ఒక మసీదుపై గుంపు దాడి చేసి దాని ఇమామ్‌ను హత్య చేసింది. దీంతో నుప్‌ా జిల్లాలో విశ్వహిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) ఊరేగింపును ఆపే ప్రయత్నంపై చెలరేగిన హింసలో సంఖ్య ఐదుకు చేరుకుందని పోలీసులు మంగళవారం తెలిపారు. సోమవారం రాత్రి జరిగిన ఘర్షణల కారణంగా ఇప్పటి వరకు నలుగురు మృతి చెందగా, దాదాపు 45 మందికి గాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు హోం గార్డులు కూడా ఉన్నారు. నుప్‌ా జిల్లా వ్యాప్తంగా కర్ఫ్యూ విధించినట్లు రాష్ట్రం హోం శాఖ మంత్రి అనిల్‌ విజ్‌ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు 20 కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. బాధ్యులను గుర్తించేందుకు సీసీటీవీ పుటేజీని పరిశీలిస్తున్నామన్నారు. బాద్‌షాపుర్‌లో ఘటన గురించి తెలిసిన వెంటనే పోలీసు బలగాలు అక్కడికి చేరుకొని పరిస్థితులను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. గురుగ్రామ్‌లోని సెక్టార్‌ 57 ప్రాంతంలో 26 ఏళ్ల ఇమామ్‌ హత్యకు గురయ్యాడు. పొరుగున ఉన్న నుప్‌ా నుంచి హింస వ్యాపించడంతో మసీదుకు నిప్పు పెట్టినట్లు పోలీసులు తెలిపారు. గుంపు కాల్పులు జరపడంతో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. బీహార్‌కు చెందిన సాద్‌గా గుర్తించిన ఇమామ్‌ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఉన్నతాధికారి తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అర్ధరాత్రి దాటిన తర్వాత గుంపు సెక్టార్‌ 57లోని అంజుమన్‌ మసీదు వద్దకు చేరుకుంది. అందులో కొందరు వ్యక్తులు మసీదులో ఉన్న వారిపై కాల్పులు జరిపి, దానికి నిప్పు పెట్టారు. నుప్‌ాలో సోమవారం జరిగిన హింసలో గాయపడిన మరో ఇద్దరు వ్యక్తులు వారి గాయాలతో మరణించారు. బాధితులు హోం గార్డులు నీరజ్‌, గుర్సేవక్‌, భాదాస్‌ గ్రామ నివాసి శక్తి. నాలుగో వ్యక్తి ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉంది. నుప్‌ాలో జరిగిన హింసాకాండలో పది మంది పోలీసులు సహా 23 మంది గాయపడ్డారు. అల్లర్లకు సంబంధించి జిల్లాలో 11 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసిన పోలీసులు 27 మందిని అదుపులోకి తీసుకున్నారు. కనీసం 120 వాహనాలు ధ్వంసమయ్యాయి. వీటిలో పోలీసులకు చెందిన వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిల్‌ విజ్‌ పీటీఐతో మాట్లాడుతూ ‘ఎవరో దీనికి (హింస) సూత్రధారిగా ఉన్నారు. కానీ నేను ఎటువంటి నిర్ధారణలకు చేరుకోవాలనుకోలేదు. మేము దీనిపై దర్యాప్తు చేస్తాము. బాధ్యులైన ప్రతి ఒక్కరినీ న్యాయస్థానం ముందు ఉంచుతాము’ అని తెలిపారు. ముస్లింలు అధికంగా ఉండే నుప్‌ాలో హింసాత్మక వార్త సోమవారం వ్యాపించడంతో సోహ్నాలోని గుంపులు ఆ వర్గానికి చెందిన వ్యక్తులకు చెందిన నాలుగు వాహనాలు, దుకాణాన్ని తగలబెట్టాయి. నుప్‌ా, సోహ్నాలో పరిస్థితి ఉద్రిక్తంగా కొనసాగుతోంది. అయితే, మంగళవారం ఎలాంటి తాజా హింసాత్మక ఘటనలు చోటుచేసుకోలేదు. నుప్‌ా, ఇతర ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు, పారామిలటరీ బలగాలు పెద్ద సంఖ్యలో మోహరించినట్లు పోలీసులు తెలిపారు. నుప్‌ాలో పరిస్థితి అదుపులోనే ఉందని అధికారులు తెలిపారు. ఇప్పటికే 13 కంపెనీల కేంద్ర బలగాలు జిల్లాకు చేరుకోగా, మరో ఆరు కంపెనీల బృందాలు త్వరలో చేరుకోనున్నాయి. నుప్‌ాలో పోలీసులు కవాతులు నిర్వహించింది. ఈ సందర్భంగా శాంతిభద్రతలను కాపాడాలని జిల్లా యంత్రాంగం ప్రజలకు విజ్ఞప్తి చేసినట్లు ఒక ప్రకటన పేర్కొంది. బుధవారం వరకు నుప్‌ా, ఫరీదాబాద్‌లలో మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు. ముందుజాగ్రత్త చర్యగా గురుగ్రామ్‌, ఫరీదాబాద్‌, పల్వాల్‌ జిల్లాల్లో మంగళవారం విద్యా సంస్థలను మూసివేయాలని ఆదేశించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ సోమవారం తెలిపారు. ‘నేటి ఘటన దురదృష్టకరం. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. దోషులను ఎట్టిపరిస్థితుల్లోనూ విడిచిపెట్టబోము, వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము’ అని ముఖ్యమంత్రి హిందీలో ట్వీట్‌ చేశారు.
నుప్‌ా, సోహ్నాలో శాంతి కమిటీల సమావేశాలు
రెండు పట్టణాల్లో మతపరమైన హింసాకాండ నేపథ్యంలో మంగళవారం నుప్‌ా, సోహ్నాలో శాంతి కమిటీ సమావేశాలు జరిగాయి. నుప్‌ా డిప్యూటీ కమిషనర్‌ ప్రశాంత్‌ పవార్‌, సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ నరేంద్ర సింగ్‌ బిజార్నియా అధ్యక్షత వహించిన శాంతి చర్చలలో ప్రజలు హింసను పెంచడానికి అనుమతించబోమని, శాంతిభద్రతల పరిరక్షణలో సహకరిస్తామని హామీ ఇచ్చారు. నిందితులను గుర్తించేందుకు సహకరించాలని బీజర్నియా శాంతి కమిటీ సభ్యులకు విజ్ఞప్తి చేశారు. నుప్‌ా హింస, గురుగ్రామ్‌ మసీదుపై దాడి తరువాత అన్ని మతపరమైన ప్రదేశాలలో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు పోలీసులు తెలిపారు. సోహ్నాలో గురుగ్రామ్‌ డీసీ నిశాంత్‌ కుమార్‌ యాదవ్‌… శాంతి కమిటీ సమావేశానికి హాజరైన వారు పట్టణంలో సామాజిక సామరస్యాన్ని పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. వదంతులను పట్టించుకోవద్దని, సామరస్యానికి భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీసీ తెలిపారు. డీసీపీ (హెడ్‌ క్వార్టర్స్‌) దీపక్‌ గెహ్లావత్‌, డీసీపీ (సౌత్‌) సిద్ధాంత్‌ జైన్‌, సోహ్నా ఎస్‌డీఎం ప్రదీప్‌ సింగ్‌, సోహ్నా ఎమ్మెల్యే సంజయ్‌ సింగ్‌, మాజీ ఎమ్మెల్యే తేజ్‌పాల్‌ తన్వర్‌ తదితరులు సమావేశానికి హాజరయ్యారు. సోహ్నాలో పరిస్థితి మెరుగుపడిరది. మార్కెట్లు త్వరలో తెరవవచ్చు. కానీ నుప్‌ా, సోహ్నా సంఘటనకు నిరసనగా మంగళవారం బాద్షాపూర్‌లో మార్కెట్లను మూసివేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img