Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

తాడేపల్లిగూడెం సభలో తేలాల్సిందే.. ? హరిరామ జోగయ్య నుంచి మరో లేఖ

తాడేపల్లిగూడెంలో ఫిబ్రవరి 29న టీడీపీ, జనసేన సభ
సభలో ఈ అంశాలపై క్లారిటీ ఇవ్వాలంటూ లేఖ

పొత్తుల మీద, సీట్ల లెక్కల మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు వరుసగా లేఖలు సంధిస్తున్న కాపు సంక్షేమ నేత, మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య మరో బహిరంగ లేఖ రాశారు. ఇప్పటికే అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసిన టీడీపీ , జనసేన పార్టీలు.. ఉమ్మడి బహిరంగ సభ కోసం ఏర్పా చేస్తున్నాయి. తాడేపల్లిగూడెం వేదికగా ఫిబ్రవరి 28న జెండా పేరుతో ఉమ్మడి బహిరంగ సభ నిర్వహించునున్నాయి. ఈ సభ వేదికగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి ఎలా ఉమ్మడిగా ముందుకు వెళ్లాలనేదానిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్ పార్టీశ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు. ఈ నేపథ్యంలో జెండా సభలో తేల్చాల్సినవి చాలా ఉన్నాయని హరిరామ జోగయ్య లేఖ రాశారు. బడుగు బలహీనవర్గాల భవిష్యత్ ఏంటో తేల్చాల్సిందేనని స్పష్టం చేశారు.చేగొండి హరిరామ జోగయ్య రాసిన లేఖలో ఏముందంటే… ఁకాపులు భాగస్వాములుగా ఉన్న బడుగు బలహీనవర్గాలు యాచించే స్థితి నుంచి శాసించే స్థితికి చేరాలని, ఆనాడే వారి భవిష్యత్తుకు ఒక దారి ఏర్పాడుతుందని నమ్మి దీన్ని సాధించే దిశగా రాజ్యాధికారం దక్కించుకోవాలనే ప్రయత్నాన్ని వారందరూ మొదలుపెట్టిన మాట వాస్తవం. ఈ ప్రయత్నంలో భాగంగానే.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రి చేయాలని, వారు పెద్దన్న పాత్ర వహించటం ద్వారా బడుగు బలహీనవర్గాల బానిస సంకెళ్ళను బద్దలుకొట్టి ఈ సామాజికవర్గాలకు విమోచనం కల్గించాలనే ధ్యేయంతో ముందుకు నడుస్తున్న మాట వాస్తవం. ఈ ప్రయత్నంలోనే తెలుగుదేశం పార్టీని కలుపుకుని మొదటి దశలో భూస్వామ్య అగ్రవర్ణ ఆధిపత్యవర్గాలలో ఒకరైన వై.ఎస్.ఆర్ పార్టీ అధినేత జగన్ మోహనరెడ్డి అరాచిక పరిపాలనకు అంతం పలకాలనే ప్రయత్నం జరుగుతోంది అని హరిరామజోగయ్య లేఖలో పేర్కొన్నారు.అయితే ఈ మధ్య జరుగుతున్న పరిణామాలతో .. కూటమిలో పవన్ కళ్యాణ్ స్థానం ఏమిటి, ఎక్కడ అనే మీమాంస బడుగు బలహీనవర్గాలలో తలెత్తుతోందని హరిరామ జోగయ్య లేఖలో పేర్కొన్నారు. వారు కోరుకుంటున్న బడుగు బలహీనవర్గాలకు రాజ్యాధికారం అనే అంశం ప్రక్కదారి పడుతున్నట్లుగా కనబడుతోందని చెప్పారు ఈ నేపథ్యంలోనే ఈ ప్రశ్నలకు సమాధానం కోసం ఎన్నికలైనంత వరకు ఆగటానికి వీల్లేదనీ.. అలాగే వై.ఎస్.ఆర్ పార్టీని ఓడించటం అనే అంశానికి గండి పడటానికి వీల్లేదని లేఖలో రాసుకొచ్చారు.
అయితే బడుగు బలహీనవర్గాలు ఆశిస్తున్న ప్రకారం.. అధికారాన్ని పంచుకోవటంలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు పాత్ర ఏమిటో తేల్చాలని.. అది తేలకుండా ముందుకు వెళ్లడానికి వీల్లేదని హరిరామ జోగయ్య స్పష్టం చేశారు. అధికారంలో సగభాగం జనసేనకు దక్కాలనీ.. గౌరవమైన హోదాలో పవన్ కళ్యాణ్ పదవి దక్కించుకోవాలని సూచించారు. అలాగే సర్వాధికారాలు పవన్ కళ్యాణ్‌కు దక్కాలన్న హరిరామ జోగయ్య.. ఈ ప్రశ్నలకు తాడేపల్లి గూడెం సభ వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు సమాధానమివ్వాలని లేఖలో డిమాండ్ చేశారు. చంద్రబాబు నుంచి అలాంటి ప్రకటన రాకపోతే వ్యక్తిగతంగా తన నిర్ణయాన్ని ఫిబ్రవరి 29న ప్రకటిస్తానని హరిరామ జోగయ్య స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img