Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఏపీకి తెలంగాణ విద్యుత్ బకాయిలు.. కేంద్రం కీలక ప్రకటన

రాజ్యసభలో ప్రస్తావించిన ఎంపీలు
క్లారిటీ ఇచ్చిన కేంద్రమంత్రి ఆర్కే సింగ్

తెలంగాణ ఏపీ ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ.6 వేల కోట్లకు పైగా విద్యుత్ బకాయిలను వసూలు చేసేందుకు చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ తెలిపారు. కేంద్ర న్యాయ, ఆర్థిక శాఖలతో సంప్రదింపులు చేశాక ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎంపీలు జీవీఎల్ నరసింహారావు, విజయ సాయి రెడ్డి ఈ బకాయిల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకువచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు చెల్లించాల్సిన విద్యుత్‌ బకాయిలపై కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి ఆర్‌కే సింగ్‌ కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర విభజన తర్వాత కేంద్రం ఆదేశాలతో ఏపీ నుంచిసరఫరా చేసిన విద్యుత్‌కు తెలంగాణ ప్రభుత్వం రూ.6 వేల కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సిన సంగతి తెలిసిందే. ఈ బకాయిలు తప్పకుండా చెల్లించాలని తాము ఆదేశించామని.. అయినా తెలంగాణ ప్రభుత్వం చెల్లించడం లేదన్నారు. అందుకే ఆర్‌బీఐలోనే ఆ రాష్ట్ర ఖాతా నుంచి ఈ మొత్తాన్ని మినహాయించుకొని ఆంధ్రప్రదేశ్‌కు చెల్లించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు, వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నలకు కేంద్రమంత్రి సమాధానం ఇచ్చారు. తెలంగాణ ఖాతా నుంచి ఏపీకి బకాయిలు చెల్లించేలా ఆర్‌బీఐకి ఆదేశాలు జారీచేసే అంశంపై.. ఇప్పటికే న్యాయశాఖతో మాట్లాడినట్లు కేంద్రమంత్రి తెలిపారు. అలాగే ఆర్థికశాఖతో చర్చిస్తున్నామని.. కేంద్రానిదే బాధ్యత కాబట్టి తప్పకుండా పరిష్కరిస్తామన్నారు. తెలంగాణ ఎంత చెల్లించాలన్నది ఇప్పటికే నిర్ణయించామని.. కేంద్ర విద్యుత్‌శాఖ కార్యదర్శి, రెండు రాష్ట్రాల అధికారుల స్థాయిలో ఒక నిర్ణయానికి వచ్చినట్లు ఆర్‌కే సింగ్‌ పేర్కొన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఎక్కువ విద్యుదుత్పత్తి కేంద్రాలు ఏపీకి వెళ్లడంతో.. తెలంగాణలో విద్యుత్‌ కొరత ఉండేదని సింగ్ గుర్తు చేశారు. ఏపీ నుంచి తెలంగాణకు విద్యుత్‌ సరఫరా చేయాలని కేంద్రం ఆదేశించవచ్చని విభజన చట్టంలో పేర్కొన్న విషయాన్ని ప్రస్తావించారు. ఆ నిబంధనను అనుసరించి తెలంగాణకు విద్యుత్‌ సరఫరా చేయాలని కేంద్రం ఆదేశించిందన్నారు. అందుకే ఏపీ నుంచి తెలంగాణకు విద్యుత్‌ సరఫరా జరిగిందన్నారు. కొంతకాలం తెలంగాణ ఏపీకి చెల్లింపులు చేసిందని.. ఆ తర్వాత నిలిపివేసినట్లు చెప్పారు.ఒకవేళ చెల్లింపులు చేయకపోతే తగిన చర్యలు తీసుకోవాలని చట్టంలో ఉందని.. దాని ప్రకారం బకాయిలను చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించామన్నారు. అయితే తమ ఆదేశాలను సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కోర్టును ఆశ్రయించిందని.. స్టే తెచ్చుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ఆ తర్వాత స్టే ముగిసినా కూడా బకాయిలు చెల్లించడం లేదన్నారు. అందుకే తెలంగాణ ప్రభుత్వ ఖాతా నుంచి ఏపీకి చెల్లించేలా చూస్తున్నామన్నారు. ఈ అంశాన్ని కేంద్రం పరిష్కరిస్తుందన్నారు. ఈ విద్యుత్ బకాయిలపై చాలా కాలంగా ఏపీ, తెలంగాణ మధ్య వివాదం నడుస్తోంది.. ఈ పంచాయితీ కోర్టుకు కూడా చేరింది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సమయంలోనూ ఈ బకాయిలు చెల్లించేలా చూడాలని కేంద్రాన్ని కోరారు. ఇప్పుడు కేంద్రమంత్రి ఆర్కే సింగ్ రాజ్యసభలో క్లారిటీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img