Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

ఆరు జోన్లకు మొగ్గు

. పాత జోన్లకు స్వస్తి
. రాష్ట్ర కేడర్‌ ఉద్యోగాలకు 80:20 శాతం
. జిల్లా ఉద్యోగాల్లో 95:5 శాతం ప్రతిపాదన
. అధిక శాతం ఉద్యోగ సంఘాల సమ్మతి
. రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ ప్రతిపాదనపై ఉద్యోగ సంఘాల భేటీ

విశాలాంధ్ర బ్యూరో-అమరావతి : ఆంధ్ర ప్రదేశ్‌లో కొత్తగా ఏర్పడిన జిల్లాలతో రాష్ట్రంలో జోనల్‌ వ్యవస్థ మారనుంది. గతంలో నాలుగు జోన్లుగా ఉండగా, ఇప్పుడు ఆరు జోన్లకు పెరిగే అవకాశం ఉంది. రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ ప్రతిపాదనపై సోమవారం రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర సర్వీసుల శాఖ కార్యదర్శి పి.భాస్కర్‌ అధ్యక్షతన వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో కీలక ప్రతిపాదనలను రూపొందించారు. రాష్ట్రపతి ఉత్తర్వుల పైన, కొత్తగా ఏర్పడిన జిల్లాలను జోన్లుగా విభజించే విషయం పైన చర్చించారు. జోనల్‌ వ్యవస్థలో మార్పులపై ఉద్యోగ సంఘాల నుంచి అభిప్రాయాలను అధికారులు స్వీకరించారు. రాష్ట్ర విభజన, జిల్లాల విభజన తర్వాత ఇప్పటివరకు పాత విధానంలోనే కొనసాగుతున్న ఉద్యోగాల భర్తీ పైనా చర్చించారు. రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ ప్రతిపాదనను ఉద్యోగ సంఘాలకు తెలియజేసి వారి నుంచి వివిధ సూచనలు, సలహాలను ఆయన స్వీకరించారు. ఆంధ్ర ప్రదేశ్‌ పబ్లిక్‌ ఎంప్లాయిమెంట్‌ (ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ లోకల్‌ కేడర్స్‌, రెగ్యులేషన్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌) కు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులు 1975కు సవరణ ప్రతిపాదనపై నివేదికలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. దీంతో రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి పోస్టుల భర్తీపై ఉద్యోగ సంఘాల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.
నాలుగు నుంచి ఆరు జోన్లకు ప్రతిపాదన
రాష్ట్రంలో ఇప్పటివరకు 13 జిల్లాలతో కలిపి నాలుగు జోన్లు ఉండేవి. ఉమ్మడి జిల్లాల ఆధా రంగా… జోన్‌ 1 పరిధిలో ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాలున్నాయి. జోన్‌ 2లో ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలు, జోన్‌ 3 పరిధిలో గుంటూరు ప్రకాశం, నెల్లూరు, జోన్‌ 4 పరిధిలో కడప, కర్నూలు, అనంతపురం ఉండేవి. ఇప్పుడు వాటి స్వరూపం మారనుంది. జోన్ల కేడర్‌లో జరిగే రాష్ట్ర స్థాయి ఉద్యోగాల భర్తీకిగాను (70:30) స్థానికులకు 70 శాతం, స్థానికేతరులకు 30 శాతం ఉండేది. కొత్తగా ఏర్పడబోయే జోనల్‌ వ్యవస్థలో ఉద్యోగాల భర్తీకి స్థానికులకు (80:20) 80 శాతం, స్థానికేతరులకు 20 శాతం కేటాయించాలని సమావేశానికి హాజరయిన వారిలో అధిక శాతం ఉద్యోగ సంఘాలు ప్రతిపాదించాయి. జిల్లా స్థాయి ఉద్యోగాలకుగాను గతంలో ఉన్న స్థానికులకు (70:30) అనగా 70 శాతం, 30 శాతం స్థానికేతరులకు రిజర్వేషన్లు ఉండగా, కొత్త జోన్ల వ్యవస్థలో దానిని (95:5) అనగా 95 శాతం స్థానికులకు, 5 శాతం స్థానికేతరులతో ఉద్యోగాల భర్తీకి ప్రతిపాదించారు. వాటిపై ఇంకా సమగ్రంగా చర్చించి, అన్ని కోణాల్లో ప్రభుత్వం ఆలోచించి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. జీవో నంబరు 74లో ఉన్న తరహాగా ఆంధ్ర ప్రదేశ్‌ ఎడ్యుకేషనల్‌ సబార్డినేట్‌ సర్వీసెస్‌ నిబంధనలను ప్రతిపాదిత ముసాయిదాలో ఉండేలా చూడాలని ఉపాధ్యాయ సంఘాల నుంచి ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షులు సాయి శ్రీనివాస్‌ విజ్ఞప్తి చేశారు. వాటిపై సమగ్రంగా ప్రభుత్వం మరోసారి చర్చించి రాష్ట్రపతి ఆర్డర్‌ ఇచ్చేందుకుగాను ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో రాష్ట్ర సర్వీసుల శాఖ భేటీ కానుంది.
కొత్తగా ఏర్పడిన 26 జిల్లాల ఆధారంగా జోన్ల విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలిలా ఉన్నాయి.
జోన్‌ 1: శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్టణం, అనకాపల్లి జిల్లాలను ప్రతిపాదించారు. జోన్‌ 2: అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, కాకినాడ, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోన సీమ జిల్లాలు ఉంటాయి. జోన్‌ 3: పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాలు. జోన్‌ 4: గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలుగా ప్రతిపాదించారు. జోన్‌ 5: తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్‌ఆర్‌ కడప జిల్లాలు జోన్‌ 6: నంద్యాల, అనంతపురం, కర్నూలు, శ్రీ సత్యసాయి జిల్లాలను ఉంచాలని ప్రతిపాదించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) చంద్రశేఖర్‌ రెడ్డి, ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షులు బండి శ్రీనివాసరావు, ఏపీ రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌, జేఏసీ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కె.వెంకట్రామి రెడ్డి, ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షులు సాయి శ్రీనివాస్‌, పీఆర్టీయూ అధ్యక్షులు ఎం.కృష్ణయ్య, ఎం.గిరిప్రసాద్‌, యూటీఎఫ్‌ అధ్యక్షులు ఎన్‌.వెంకటేశ్వర్లు, ఏపీ ప్రభుత్వ డ్రైవర్ల సంఘం ఎస్‌.శ్రీనివాస రావు, ఏపీటీఎఫ్‌ అధ్యక్షులు జి.హృదయరాజు, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షురాలు బి.సుగుణ, ఆల్‌ ఆంధ్ర ప్రదేశ్‌ నాల్గవ తరగతి ఉద్యోగుల సెంట్రల్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు మల్లేశ్వరరావు, ఏపీ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు సిహెచ్‌.శ్రావణ కుమార్‌, ఏపీ ఎనామిక్స్‌ అండ్‌ స్టాటిస్టికల్‌ సబార్డినేట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు రజినీస్‌ బాబు, ఏపీ జూనియర్‌ వెటర్నరీ ఆఫీసర్ల అండ్‌ వెటర్నరీ లైవ్‌ స్టాక్‌ ఆఫీసర్ల సర్వీస్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు బి.సేవానాయక్‌తో పాటు ఆయా సంఘాల ప్రధాన కార్యదర్శులు, అధికారులు హాజరయ్యారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img