Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

మాస్కోలో ఉగ్రదాడి.. 60 మంది మృతి, 100 మందికిపైగా గాయాలు

రష్యా రాజధాని మాస్కోలో ఉగ్రమూకలు దాడికి తెగబడ్డాయి. క్రాకస్‌ సిటీ కన్సర్ట్‌ హాల్‌లో.. ప్రముఖ రష్యన్‌ రాక్‌ బ్యాండ్‌ ఫిక్‌నిక్‌ సంగీత కార్యక్రమం జరుగుతోంది. ఇంతలో లోపలికి చొరబడిన దుండగులు కాల్పులకు దిగారు. ఈ ఘటనలో 60 మంది వరకు చనిపోగా.. 100 మందికి పైగా గాయపడ్డారు. ముందుగా భవనంలోనికి ప్రవేశించిన దుండగులు అక్కడ ఉన్న వారిపై కాల్పులు జరిపి బీభత్సం సృష్టించారు. సంగీత కార్యక్రమం ముగియడంతో బయటకు వెళుతున్న సమయంలో ఒక్కసారిగా కాల్పులు జరిపారు.
ఈ కాల్పులతో అందరూ పరుగులు తీశారు.. అక్కడ ఏం జరుగుతుందో తెలియక భయంతో వణికిపోయారు. కొందరు సీట్ల మధ్య దాక్కున్నారు.. కాల్పుల సమాచారం అందుకున్న పోలీసులు భారీ ఎత్తున అక్కడికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. హాల్‌లో చిక్కుకున్న పలువురిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గాయపడిన వారి కోసం అంబులెన్స్‌లు కూడా వచ్చాయి.. వారిని ఆస్పత్రులకు తరలించి వైద్యం అందిస్తున్నారు. మరోవైపు ఉగ్రదాడికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. దుండుగులు కాల్పులు జరపడం, జనాలు భయంతో పరుగులు తీస్తున్నట్లు కనిపించింది. ఈ దాడితో భవనంపై ఒక్కసారిగా మంటలు చెలరేగి.. ఆ చుట్ట పక్కల నల్లటి పొగలు వ్యాపించాయి. ఐదుగురు దుండగులు ఈ కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. వారిలో ఒకరిని పోలీసులు పట్టుకోగా.. ఈ దాడి తామే చేసినట్లు ఇస్లామిక్‌ స్టేట్‌ ప్రకటించింది. హాల్‌లోకి ప్రవేశించిన సాయుధులు బాంబులు సైతం విసిరినట్లు స్థానిక మీడియాలో కథనాలు ప్రసారమయ్యాయి. ఈ ఘటనను రష్యాలో జరిగిన అతిపెద్ద ఉగ్రదాడిగా చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img