Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

దర్యాప్తు మీ చేతుల్లో పెట్టలేం

. మణిపూర్‌ ఘటన ‘అసాధారణ పరిణామం’
. ఇప్పటివరకు తీసుకున్న చర్యలేంటో చెప్పండి
. పోలీసులపై సుప్రీం ఆగ్రహం
. 24 గంటల్లోగా సమాధానం చెప్పాలని కేంద్రానికి ఆదేశం
. విచారణ నేటికి వాయిదా

న్యూదిల్లీ: న్యూదిల్లీ : మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన ‘భయంకరమైనది’ అని సుప్రీం కోర్టు సోమవారం పేర్కొంది. ఈ ఘర్షణల్లో మహిళలపై జరుగుతోన్న హింస, దారుణ ఘటనలు ‘అసాధారణ పరిణామం’గా వ్యాఖ్యానించింది. ఎఫ్‌ఐఆర్‌లలో ఇప్పటి వరకు తీసుకున్న చర్యల గురించిన సమాచారాన్ని కోరింది. అల్లర్లకు పాల్పడే మూకకు దాదాపుగా మహిళలను అప్పగించినందున రాష్ట్ర పోలీసులు ఈ విషయంపై విచారణ జరపాలని కోరుకోవడం లేదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. సీబీఐ, సిట్‌ను మాత్రమే నమ్ముకోలేమని, బాధితురాలికి ఇంటి గుమ్మం ముందే న్యాయం అందాల్సిన అవసరం ఉందని తేల్చి చెప్పింది. ఇప్పటికే మూడు నెలలు గడిచిపోయిందని సుప్రీం కోర్టు గుర్తు చేసింది. మంగళవారం కేంద్రం, మణిపూర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న న్యాయ అధికారుల వాదనలకు లోబడి కలహాలతో దెబ్బతిన్న రాష్ట్రంలో పరిస్థితిని పర్యవేక్షించడానికి సిట్‌ లేదా మాజీ న్యాయమూర్తులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయవచ్చని తెలిపింది. మణిపూర్‌లో మహిళలపై చోటుచేసుకున్న దారుణలపై దాఖలయిన అనేక పిటిషన్లను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పోలీసుల తీరును తప్పుబడుతూ… వారిపై ప్రశ్నల వర్షం కురిపించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం 24 గంటల్లోగా సమాధానం చెప్పాలని ఆదేశించింది. మంగళవారం విచారణ కోసం మణిపూర్‌ హింసపై అనేక అభ్యర్ధనలను జాబితా చేసిన ధర్మాసనం, ఇద్దరు మహిళలను వివస్త్రులను చేసి ఊరేగించిన సంఘటన మే 4న వెలుగులోకి వచ్చినప్పటికీ, మే 18న ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడం ద్వారా మణిపూర్‌ పోలీసులు 14 రోజుల సమయం ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించింది. ‘పోలీసులు ఏం చేస్తున్నారు? వీడియో కేసులో ఎఫ్‌ఐఆర్‌ను జూన్‌ 24న అంటే నెలా మూడు రోజుల తర్వాత మెజిస్టీరియల్‌ కోర్టుకు ఎందుకు బదిలీ చేశారు’ అని ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌, న్యాయమూర్తులు జేబీ పార్దివాలా, మనోజ్‌ మిశ్రాతో కూడిన ధర్మాసనం ప్రశ్నిం చింది. ‘ఇది భయంకరమైనది. పోలీసులు ఈ మహిళలను అల్లర్లకు పాల్పడే మూకకు అప్పగించినట్లు మీడియాలో కథనాలు ఉన్నాయి. పోలీసులు ఈ కేసును నిర్వహించడం మాకు ఇష్టం లేదు’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. అటార్నీ జనరల్‌ ఆర్‌.వెంకటరమణి ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి సమయం కోరినప్పుడు, ధర్మాసనం స్పందిస్తూ… ఇప్పటికే సమయం మించిపోతోందని… సర్వం కోల్పోయిన బాధితు లకు తక్షణమే న్యాయం అందాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడిరది. రాష్ట్రంలో నమోదయిన ‘జీరో ఎఫ్‌ఐఆర్‌’ల సంఖ్య, ఇప్పటి వరకు చేసిన అరెస్టుల వివరాలను తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ధర్మాసనం కోరింది. ఏ పోలీసు స్టేషన్‌లో అయినా దాని అధికార పరిధిలో నేరం జరిగినా దానితో సంబంధం లేకుండా జీరో ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేయవచ్చు. కాగా, ‘బాధిత ప్రజలకు పునరావాసం కోసం రాష్ట్రానికి అందించబడుతున్న ప్యాకేజీని కూడా మేము తెలుసుకోవాలనుకుంటున్నాము’ అని పేర్కొంది. ఇదే అంశంపై సోమవారం ఉదయం కూడా సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఆ సందర్భంగా బాధిత మహిళల తరపున సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ వాదనలు వినిపించారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదించారు. ఈ విషయంలో ప్రభుత్వం ఏమీ దాచిపెట్టడం లేదని… విచారణను సుప్రీం కోర్టు పర్యవేక్షించేందుకు కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి అభ్యంతరం లేదని తెలిపారు. ప్రభుత్వం స్పందించే తీరును అనుసరించే తమ జోక్యం ఆధారపడి ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. తదుపరి విచారణను ఆగస్టు 1వ తేదీ (మంగళవారం) కి వాయిదా వేసింది. మహిళలపై హింసను ఎదుర్కోవడానికి విస్తృత యంత్రాంగాన్ని రూపొందించాలని సుప్రీం కోర్టు కోరింది. మే నెల నుంచి రాష్ట్రంలో ఇటువంటి సంఘటనలపై ఎన్ని ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని ప్రశ్నించింది. జులై 20న సుప్రీం కోర్టు స్పందిస్తూ, మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించడం ‘తీవ్రమైన కలవరానికి గురిచేసింది’, హింసకు పాల్పడటానికి మహిళలను సాధనంగా ఉపయోగించడం ‘రాజ్యాంగ ప్రజాస్వామ్యంలో కేవలం ఆమోదయోగ్యం కాదు’ అని పేర్కొంది. వీడియోను పరిగణనలోకి తీసుకున్న ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం, తక్షణ నివారణ, పునరావాస, నివారణ చర్యలను ప్రారంభించి, తీసుకున్న చర్యలను తెలియజేయాలని కేంద్రం, మణిపూర్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. జులై 27న ఇద్దరు మహిళలకు సంబంధించిన కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేసినట్లు కేంద్రం సుప్రీం కోర్టుకు తెలిపింది. ‘మహిళలపై జరిగే నేరాల పట్ల ప్రభుత్వం ఏమాత్రం సహించబోదని’ నొక్కి చెప్పింది. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఏ) దాని కార్యదర్శి అజయ్‌ కుమార్‌ భల్లా ద్వారా దాఖలు చేసిన అఫిడవిట్‌లో, ఈ కేసు విచారణను గడువులోగా ముగించడానికి మణిపూర్‌ వెలుపలికి బదిలీ చేయాలని సుప్రీం కోర్టును కోరింది. ఈ కేసులో ఇప్పటి వరకు ఏడుగురిని అరెస్టు చేశారు.
ఇతర రాష్ట్రాల్లోని ఘటనలపై విచారణకు నిరాకరణ
మణిపూర్‌లో మహిళలపై జరుగుతున్న హింసను ‘భయంకర పరిమాణం’గా అభివర్ణించిన సుప్రీం కోర్టు సోమవారం పశ్చిమ బెంగాల్‌, రాజస్థాన్‌, చత్తీస్‌గఢ్‌, కేరళ వంటి ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలలో ఇలాంటి ఆరోపించిన సంఘటనలపై అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకోవడానికి నిరాకరించింది. మణిపూర్‌లో హింసకు సంబంధించిన అనేక పిటిషన్లను విచారిస్తున్న అత్యున్నత న్యాయస్థానానికి న్యాయవాది బన్సూరి స్వరాజ్‌… పశ్చిమ బెంగాల్‌లో మహిళలపై జరుగుతున్న హింసాత్మక సంఘటనలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని, ఇతర రాష్ట్రాల్లో కూడా పరిణామం కోసం కోరిన యంత్రాంగాన్ని వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు. ‘భారతదేశపు కుమార్తెలకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది’ అని స్వరాజ్‌ అన్నారు. ‘మే నెలలో భయంకరమైన సంఘటన (ఇద్దరు మహిళలు నగ్నంగా ఊరేగింపు) మణిపూర్‌లో వెలుగులోకి వచ్చిన తరువాత, బెంగాల్‌, చత్తీస్‌గఢ్‌లలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి. పశ్చిమ బెంగాల్‌లోని హౌరా జిల్లాలోని ఒక గ్రామంలో ఒక గుంపు పంచాయతీ ఎన్నికల అభ్యర్థిని వివస్త్రను చేసి ఆమెను నగ్నంగా ఊరేగించిన వీడియో వెలుగులోకి వచ్చింది. పంచాయతీ ఎన్నికల హింసాకాండ సందర్భంగా మరో అభ్యర్థిని కూడా నగ్నంగా ఊరేగించారు. ఎలాంటి ఎఫ్‌ఐఆర్‌ నమోదు కాలేదు’ అని న్యాయవాది తెలిపారు. ‘దేశమంతటా మహిళలపై నేరాలు జరుగుతున్నాయి. ఇది మన సామాజిక వాస్తవికతలో భాగం. ప్రస్తుతం, మేము అపూర్వమైన పరిమాణంతో వ్యవహరిస్తున్నాము. ప్రధానంగా మహిళలపై నేరాలు, హింసకు సంబంధించినవి’ అని అన్నారు. ‘మణిపూర్‌లో జాతిపరమైన కలహాల పరిస్థితి ఉంది. అందువల్ల పశ్చిమ బెంగాల్‌లో కూడా మహిళలపై నేరాలు జరుగుతున్నాయనే దానిపై అభిప్రాయం లేదు’ అని సీజేఐ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ప్రస్తుతం మణిపూర్‌కు సంబంధించిన పిటిషన్లను విచారిస్తున్నట్లు న్యాయమూర్తులు జేబీ పార్ధివాలా, మనోజ్‌ మిశ్రాతో కూడిన ధర్మాసనం పేర్కొంది. మణిపూర్‌లో మహిళలపై జరిగిన నేరాలను దేశంలోని ఇతర ప్రాంతాల్లోని ఇలాంటి సంఘటనలతో పోల్చలేమని పేర్కొంది. ‘దానిలో (మణిపూర్‌) మాకు సహాయం చేయడానికి మీ వద్ద నిజంగా ఏదైనా ఉంటే, దయచేసి మాకు సహాయం చేయండి’ అని సీజేఐ అన్నారు. ఈ కేసులో తాను జోక్యం చేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నానని, పశ్చిమ బెంగాల్‌, రాజస్థాన్‌, చత్తీస్‌గఢ్‌ కేరళలో మహిళలపై జరుగుతున్న నేరాలను ప్రస్తావించినట్లు స్వరాజ్‌ తెలిపారు. ‘దాని గురించి మేము తరువాత విం టాము. ప్రస్తుతం మణిపూర్‌ కేసును విచారణ చేస్తున్నాము’ అని తెలిపారు. కాగా, కోర్టు ఏ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తున్నా అది ఇతర రాష్ట్రాలకు కూడా వర్తింపజేయాలని, పరిష్కార చర్యలు మణిపూర్‌కు మాత్రమే పరిమితం కాకూడదని స్వరాజ్‌ అన్నారు. ‘పశ్చిమ బెంగాల్‌ విషయంలో ఇది సమానంగా తీవ్రమైనది. ఎందుకంటే మహిళలపై హింస చివరకు ఓటర్లను శిక్షించడానికి ఉపయోగించబడుతుంది. మణిపూర్‌లో 5,995 ఎఫ్‌ఐఆర్‌లు ఉన్నాయని, పశ్చిమ బెంగాల్‌లో 9,304 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని, కేవలం 3 శాతం (నిందితులు) మాత్రమే జైలులో ఉన్నారని, 97 శాతం నేరస్తులు స్వేచ్ఛగా తిరుగుతు న్నారని ఇందిరా జైసింగ్‌ చెప్పారని’ న్యాయవాది తెలిపారు. మణిపూర్‌ విషయంలో పౌర సమాజం అంతరాత్మ ఒక్కసారిగా మేల్కొందని ఆమె అన్నారు. ‘మణిపూర్‌లో జరిగిన దానిని క్షమించలేం. అయితే పశ్చిమ బెంగాల్‌, రాజస్థాన్‌, చత్తీస్‌గఢ్‌, కేరళలో మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన సంఘటన తర్వాత అనేక దారుణ వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. దయచేసి మణిపూర్‌కు మాత్రమే కాకుండా యంత్రాంగాన్ని ఏర్పాటు చేయండి’ అని స్వరాజ్‌ కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img