Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

డ్రగ్స్ పట్టివేతపై సమగ్ర విచారణ జరిపి, కారకులను కఠినంగా శిక్షించాలి

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ

విశాఖపట్నం పోర్టులో డ్రగ్స్ పట్టుపడటంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మండిపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. డ్రగ్స్ పట్టివేతపై సమగ్ర విచారణ జరిపి, కారకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లక్షల కోట్ల విలువైన డ్రగ్స్ విశాఖ పోర్టులో పట్టుబడటం ఆందోళనకరమన్నారు. పోర్టులు ప్రైవేటుపరం చేయటమే మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు కారణమని ఆరోపించారు. గతంలో గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో విజయవాడ చిరునామాతో వేల కోట్ల విలువైన హెరాయిన్ దొరకటం గమనార్హమన్నారు. డ్రగ్స్ రాకెట్ వెనుక అధికార వైసీపీ నేతలు, పలువురు అధికారుల హస్తం ఉన్నట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయని తెలిపారు. ఏపీలో గంజాయి హవా తీవ్రంగా కనిపిస్తోందన్నారు. ఏపీలో గంజాయి, డ్రగ్స్ కలకలం యువత భవితకు ప్రశ్నార్ధకంగా మారిందన్నారు. డ్రగ్స్ సరఫరాపై సమగ్ర విచారణ జరిపి, దోషులెంతటివారైనా కఠినంగా శిక్షించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. కాగా.. విశాఖ కేంద్రంగా డ్రగ్స్‌ రవాణా తీవ్ర కలకలం రేపింది. లాసన్స్‌బే కాలనీలో గల సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్టర్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ అనే సంస్థ బ్రెజిల్‌ నుంచి డ్రై ఈస్ట్‌ పేరుతో ఒక కంటెయినర్‌ తెప్పించుకోగా అందులో కొకైన్‌ ఉందని నిర్ధారణ అయ్యింది. మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటలకు అందరి ముందు కంటెయినర్‌ని తెరిచారు. అందులో ఒక్కోటి 25 కేజీల బరువున్న వేయి సంచులను 20 పాలెట్లలో సర్దారు. ఒక్కో పాలెట్‌ నుంచి ఒక సంచిని సీబీఐ అధికారులు పరీక్షించారు. వాటిలో మత్తు పదార్థం కొకైన్‌ ఉన్నట్టు పరీక్షల్లో తేలింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img