Thursday, October 31, 2024
Thursday, October 31, 2024

ఏపీ 10వ తరగతి హాల్‌టికెట్లు విడుదల..

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి వార్షిక పరీక్షలు మార్చి 18 నుంచి 30వ తేదీ వరకు జరుగనున్నాయి. ఈ క్రమంలో పదో తరగతి హాల్ టికెట్లను.. సోమవారం (మార్చి 4) విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రకటించిన ప్రకారం అధికారిక వెబ్‌సైట్‌ https://www.bse.ap.gov.in/ లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంచారు. పాఠశాలల లాగిన్ తో పాటు విద్యార్థులు కూడా నేరుగా హాల్ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని విద్యాశాఖ తెలిపింది.2023ఉ24 విద్యా సంవ­త్సరాని గాను 6,23,092 మంది రెగ్యులర్‌ విద్యా­ర్థులు 10వ తరగతి పరీక్షలకు హాజరుకాను­న్నారు. వీరిలో 3,17,939 మంది బాలురు.. 3,05,153 మంది బాలికలున్నారు. గతేడాది పదో తరగతి తప్పి మళ్లీ పరీక్ష రాస్తున్నవారు 1,02,528 మంది కూడా రెగ్యులర్‌గా పరీక్షలు రాయనున్నారు. ఈ ఏడాది మొత్తంగా 7,25,620 మంది పరీక్షలకు హాజరుకానున్నారు. వీరికోసం రాష్ట్ర వ్యాప్తంగా 3,473 సెంటర్లను సిద్ధం చేశారు. ప్రధాన పరీక్షలు మార్చి 28వ తేదీతో ముగు­స్తుండగా.. మరో రెండు రోజులు ఓరియంటల్, ఒకేషనల్‌ పరీక్షలుంటాయి. విద్యాశాఖ 156 ఫ్లయింగ్‌ స్క్వాడ్స్, 682 సిట్టింగ్‌ స్వాడ్స్‌ను సిద్ధం చేసింది. 130కి పైగా కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించనుంది.
10వ తరగతి హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు విద్యార్థి పేరు, జిల్లా పేరు, పాఠశాల పేరు, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.

ఉచితంగా ఆర్‌టీసీ బస్సుల్లో ప్రయాణం!
ఆంధ్రప్రదేశ్‌లో 10వ తరగతి పరీక్షలు రాయనున్న విద్యార్థులకు ఏపీఎస్‌ఆర్‌టీసీ గుడ్‌న్యూస్‌ చెప్పింది. 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఉచితంగా ఆర్‌టీసీ బస్సుల్లో ప్రయాణించవచ్చని తెలిపింది. విద్యార్థులు తమ హాల్‌టికెట్లు చూపించి.. ఇంటి నుంచి పరీక్ష కేంద్రాలకు.. ఆ తర్వాత ఇళ్లకు ఉచితంగా ప్రయాణించవచ్చిన పేర్కొంది. పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఈ ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తోంది. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవాలని సూచించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img