Sunday, April 14, 2024
Sunday, April 14, 2024

విజయసాయి రెడ్డికి చేదు అనుభవం

ఎన్నికల ప్రచారంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి ఘోర అవమానం ఎదురైందంటూ టీడీపీ ఓ వీడియోను షేర్ చేసింది.  శుక్రవారం ఉదయం నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని సీతారామపురంలో ఎన్నికల ప్రచార వాహనంపై విజయసాయి రెడ్డి ప్రసంగిస్తుండగా జనం లేచి వెళ్లిపోయారు. కార్యకర్తలు కూడా ప్రసంగం సమయంలోనే వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు. విజయసాయి రెడ్డికి వెనుకనే నిలుచున్న నేత వెంటనే మైకులో అనౌన్స్‌ చేస్తూ ౌ. ు మహిళలంతా వెళ్లిపోతున్నారు ౌ పెద్దాయన మాట్లాడుతున్నారుౌ అందరికీ భోజనాలున్నాయమ్మా ౌ వెళ్ళద్దు ౌ ు ాచెప్పేది వినండి, వెనక్కి రండి.. ఇటు చూడండి. వెళ్లిపోయేవాళ్లంతా మాకు కనిపిస్తున్నారు. మీరు పోవద్దు్ణ అని మైక్‌లో పదేపదే అనౌన్స్‌ చేశారు. ఇందుకుసంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img