Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిందే

. నిరుద్యోగం, ధరల పెరుగుదల ప్రధాన సమస్యలు
. పౌరసత్వ చట్టాన్ని రద్దు చేస్తాం
. సీపీఐ ఎన్నికల ప్రణాళిక హామీ

న్యూదిల్లీ: దేశంలో నిరుద్యోగం, ధరల పెరుగుదలే ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలని భారత కమ్యూనిస్టుపార్టీ (సీపీఐ) ఎన్నికల ప్రణాళిక స్పష్టం చేసింది. 2024లో జరిగే 18వ లోక్‌సభ ఎన్నికలకు పార్టీ ప్రణాళికను సీపీఐ శనివారం దిల్లీలో విడుదల చేసింది. కేంద్రంలోని బీజేపీ నాయకత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం దేశానికి వినాశకరమైనదిగా రుజువైందని, అందువల్ల ఈ ప్రభుత్వాన్ని మార్చవలసిందేనని పిలుపు ఇచ్చింది. ఆర్థిక నిర్వహణలో వైఫల్యం కారణంగా నరేంద్రమోదీ పరిపాలనలో దేశ ప్రజల జీవితాలు దుర్భరంగా మారాయని విమర్శించింది. బీజేపీ పరిపాలన ఫలితంగా సంపన్నవర్గాల్లో అసాధారణ రీతిలో సంపద కేంద్రీకరణకు దారి తీసిందని, అదే సమయంలో పేదలు మరింత పేదరికంలోకి దిగజారారని తెలిపింది. హిందుత్వ సిద్ధాంతమే లక్ష్యంగా ఉన్న ఆర్‌ఎస్‌ఎస్‌ నియంత్రణలో ఉన్న బీజేపీ…మనదేశ రాజ్యాంగ స్వరూపమైన సెక్యులరిజం, సోషలిజం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి మౌలిక విలువలపై దాడి చేయడం లక్ష్యంగా పెట్టుకుందని ఆగ్రహం వెలిబుచ్చింది. బీజేపీ తిరిగి అధికారం చేపడితే దేశ ప్రజల కష్టాలు మరింతగా పెరిగిపోతాయని, మోదీ విజయం రాజ్యాంగ లక్ష్యాలకు మరణశాసనంగా మారుతుందని ఎన్నికల ప్రణాళిక హెచ్చరించింది. సీపీఐ ఎన్నికల ప్రణాళికను పార్టీ ప్రధాన కార్యదర్శి డి.రాజా, జాతీయ కార్యదర్శి అజీజ్‌ పాషా తదితరులు విడుదల చేశారు.
బ్యాలట్‌ ద్వారా బుద్ధి చెప్పాలి
ఈ లోక్‌సభ ఎన్నికలు మన దేశానికి, భవిష్యత్తుకు ఎంతో కీలకమైనవి. ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాలలో బీజేపీ విఫలమైంది. జనరంజకమైన, ప్రజల బాధలు, సమస్యలు పట్టించుకునే ప్రభుత్వం మాత్రమే ఈ సంక్షోభం నుండి ప్రజలను బయట పడేయగలదు. దేశంలో సామాజిక వ్యవస్థ, ప్రజల మధ్య సంబంధాలు చాలా ఒత్తిడికి గురవుతున్నాయి. కానీ మోదీ గ్యారంటీలు, వికసిత్‌ భారత్‌ పేరుతో దేశ ప్రజల దృష్టిని బీజేపీ దారి మళ్లించే ప్రయత్నం చేస్తోంది. అదేసమయంలో మనదేశ వ్యవసాయదారులు, గ్రామీణ ప్రజలు గతం కంటే దారుణ కష్టాలు అనుభవిస్తున్నారు. మోదీ ఇంతకుముందు ఇచ్చిన గ్యారంటీలు, అచ్చేదిన్‌ వాగ్దానాలు ఏమైపోయాయో అందరికీ తెలిసిందే. మన స్వాతంత్య్ర సమరయోధులు లౌకిక, ప్రజాస్వామ్య, సంక్షేమరాజ్యంగా భారతదేశాన్ని తీర్చిదిద్దాలని కోరుకున్నారు. కానీ బీజేపీ ప్రయత్నాలతో ఈ విలువలన్నీ ప్రజాజీవితం నుండి తుడిచిపెట్టుకుపోతున్నాయి. నిరుద్యోగం, నిత్యావసర వస్తువుల ధరలు దారుణంగా పెరిగిపోయాయి. ఎన్నికల బాండ్ల బాగోతం వెలుగులోకి వచ్చాక ఆధునిక భారతదేశ చరిత్రలో బీజేపీ అత్యంత అవినీతికర పార్టీగా అవతరించింది. నయానో భయానో ఈ ఎన్నికల్లో గెలిచి తీరాలని బీజేపీ భావిస్తున్నదని, ఇందుకోసం ప్రతిపక్షాలను భయపెట్టేందుకు ఈడీ, సీబీఐ, ఆదాయపన్నుశాఖ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నది. ఈ నేపథ్యంలో ఓటర్లు తమ ఓటు హక్కు ద్వారా తీర్పు చెప్పి మోదీ ప్రభుత్వాన్ని సాగనంపాలి. తగిన బుద్ధి చెప్పాలి. ఇందుకుగాను పార్లమెంటు లోపలా, వెలుపలా ప్రజల తరపున పోరాటం చేసేందుకు భారత కమ్యూనిస్టుపార్టీ జనాభిప్రాయాన్ని కూడగడుతున్నది’.
ఎన్నికల ప్రణాళికలో కీలకాంశాలు ఇవే
. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, న్యాయం, లౌకికతత్వం, సోషలిజం, సమాఖ్యవాదం పెంపొందించేందుకు సీపీఐ పోరాడుతుంది.
. అసమానతల నిర్మూలన, సంపద పన్ను, వారసత్వ పన్ను, కార్పొరేట్‌ పన్ను పెంపుదల వంటి చర్యల ద్వారా దేశ వనరుల వృద్ధి చర్యలను సీపీఐ ప్రవేశపెడుతుంది.
. విద్య, వైద్య రంగాలకు నిధుల పెంపు, విద్యా, ఆరోగ్య రంగాలలో మౌలిక సదుపాయాల పెంపుదల, ప్రజలకు వాటిని అందుబాటులోకి తీసుకురావడం.
. అవకాశాలతో ప్రభుత్వ రంగ వ్యవస్థకు ప్రోత్సాహం, ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషన్లకు ప్రోత్సాహం
. రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితి తొలగించేందుకు రాజకీయ, న్యాయపరమైన పోరాటాన్ని సీపీఐ కొనసాగిస్తుంది.
. పునర్వ్యవస్థీకరణ నిబంధనలు తొలగించి వెంటనే మహిళా రిజర్వేషన్‌ చట్టం అమలుకు పోరాటం
. జనగణన కోసం పోరాటం, కుల గణన చేపట్టడం, పౌరసత్వ సవరణ చట్టం రద్దుకు సీపీఐ పోరాడుతుంది.
. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కూలీలకు రోజువారీ వేతనం రూ.700కు పెంపు. ఏడాదికి 200 రోజులు పని లభించేలా చర్యలు
. ఉద్యోగ హామీ చట్టం, గిగ్‌ వర్కర్లకు సాంఘిక భద్రత కోసం పోరాటం.
. అగ్నిపథ్‌ పథకం రద్దుకు డిమాండ్‌
. పెన్షన్‌ విధానం పునరుద్ధరణకు కృషి
. దర్యాప్తు సంస్థలు పక్షపాతం లేకుండా పని చేసేందుకు, వాటిని దుర్వినియోగం కాకుండా పార్లమెంటు పరిధిలోకి తీసుకురావడం
. గవర్నర్ల వ్యవస్థ రద్దు కోసం పోరాటాన్ని కొనసాగించడం
. ప్రవేశపరీక్షల్లో పాఠ్యాంశాలు వంటి విధానపరమైన పెద్ద నిర్ణయాలు రాష్ట్రాల జాబితాలోకి వచ్చేలా కృషి
. ఈసీల నియామకంలో కార్యనిర్వహణా వ్యవస్థ జోక్యం నిర్మూలన, ఎన్నికల సంఘం సర్వ స్వతంత్రతకు కృషి
. నీతి ఆయోగ్‌ రద్దు, ప్రణాళికా సంఘం పునరుద్ధరణకు చర్యలు
. ఎన్నికల బాండ్ల వంటి వివరాలు ప్రజలకు చెప్పడం, ఇలాంటి నిధులను ఉద్యోగావకాశాలు పెంచేందుకు ఉపయోగించడం
. విద్యావిధానం రద్దు, ప్రజానుకూల ఆధునిక విద్యకు రూపకల్పన, బీజేపీ తీసుకున్న వినాశకర విధానాలు రూపుమాపడం వంటివన్నీ పార్టీ లక్ష్యాలుగా ఎన్నికల ప్రణాళికలో పేర్కొంది. ప్రజానుకూల ఎజెండాతో సీపీఐ ఈ ఎన్నికల్లో ప్రజల వద్దకు వెళుతోందని పార్టీ ప్రకటించింది. 18వ లోక్‌సభలో వామపక్షాల బలాన్ని పటిష్టం చేసేందుకు వీలుగా లౌకిక, ప్రజాస్వామ్య శక్తులకే ఓటు వేయాలని సీపీఐ ప్రజలకు పిలుపు ఇచ్చింది. దేశాన్ని, రాజ్యాంగాన్ని, ప్రజాసామ్యాన్ని, ప్రజల జీవనాన్ని రక్షించేందుకు ఈ ఎన్నికల్లో ఆర్‌ఎస్‌ఎస్‌ పాలనను ఓడిరచేందుకు మనందరం ఐక్యం కావాలని ఎన్నికల ప్రణాళికలో సీపీఐ పిలుపు ఇచ్చింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img