Monday, April 22, 2024
Monday, April 22, 2024

విద్యుత్ చార్జీల పెరుగుదలకు భారీ మూల్యం తప్పదు – దోనేపూడి శంక ర్

రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్న ఘనత జగన్ కే దక్కింది

ప్రజా రక్తాన్ని రుచి మరిగిన రాష్ట్ర ప్రభుత్వం

విశాలాంద్ర – జగ్గయ్యపేట : వైఎస్ రాజశేఖర్ రెడ్డి విద్యుత్ సంస్కరణలను వ్యతిరేకిస్తే జగన్ వాటిని అమలు చేస్తూ ప్రజలపై పెను భారం మోపు తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎన్టీఆర్ జిల్లా డిప్యూటీ సెక్రటరీ దోనేపూడి శంకర్ విమర్శించారు …సిపిఐ కమ్యూనిస్టు పార్టీలురాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా శుక్రవారం నాడు జగ్గయ్యపేట డిపో సెంటర్ నందువిద్యుత్ కార్యాలయం మరియు సబ్స్టేషన్ఎదుట ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి విద్యుత్ బిల్లును తగలబెట్టారు జగ్గయ్యపేట పట్టణ కార్యదర్శి జూనెబోయిన శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో దోనెపూడి శంకర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం విద్యుత్ సంస్కరణల పేరుతో ఆరు రకాల సర్ చార్జీల విధిస్తూ ప్రజలను ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తుందని అన్నారు నిత్యవసర వస్తువుల ధరలను పెంచినందుకు ప్రజలు ఇబ్బందులు చవి చూస్తుంటే మూలివే నక్క తలమీద తాటికాయ పడ్డ చందం మాదిరిగా విద్యుత్ చార్జీలను మోత మూయిస్తున్నారు వీటితోపాటు స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రజలకు మరో ముప్పు రానున్నదని సామాన్యులను దోచుకుంటున్నారని జగన్ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలను గుర్తించారు ఒక్కసారి అవకాశం ఇవ్వమని బ్రతిమిలాడుకొని ప్రజల సహాయ సహకారాలతో పైకెక్కిన అతను అదే ప్రజలపై ఎక్కి తొక్కుతున్నాడని ఘాటుగా విమర్శించారు రానున్న రోజుల్లో ప్రజా ప్రభుత్వం తగిన బుద్ధి చెబుతుంది అనే విషయాన్ని విస్మరించి అధికారంలో ఉన్నాను నన్ను ఎవరు ఏమీ చేయలేరని భ్రమలో బతుకుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు విద్యుత్ అదనపు సుంకాలతో పేద మధ్యతరగతి కుటుంబీకులు తీవ్ర ఇబ్బందులను చవిచూస్తున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదని అమాయక ప్రజలను ఇబ్బందులు పెట్టిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఆయన పేర్కొన్నారు ఎన్నికలలో ఏరు దాటి తెప్ప తగలబెట్టిన వైఎస్ జగన్ నేడు గుర్తుపెట్టుకో ప్రజలను నమ్మించి మోసగించిన నీకు ఇదే ప్రజలు రానున్న రోజుల్లో బుద్ధి చెబుతారని తీవ్ర విమర్శలను చేశారు… గత ప్రభుత్వంలో పెట్టినటువంటి మీటర్లకు ప్రస్తుత ప్రభుత్వం సుంకా న్ని వసులు చేయడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు… కార్పొరేట్ లో పాలకులు కుమ్మక్కై రెండు రూపాయలకు కొనాల్సిన విద్యుత్తును బహిరంగ మార్కెట్లో 10 నుండి 20 రూపాయలకు కొనుగోలు చేస్తూ జేబులు నిండుగా దండుకుంటున్నారని మరియు భారీ ఎత్తున అవినీతికి పడగలుత్తారని ధ్వజమెత్తారు ముఖ్యమంత్రి జగన్ మోడీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారని దేవుడి శాసించాడు అరుణాచలం పాటిస్తాడు అనే సామెత మాదిరిగా మోడీ శాసిస్తాడు జగన్ పాలిస్తాడు అని ప్రజలందరిలో నిరూపించుకున్నాడని అదేవిధంగా రాష్ట్ర ప్రజలను నమ్మించి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో పడేయడం జరిగిందనితెలుగు దేశ ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని మూడు ముక్కలు చేసి సంస్కరణలు పేరుతో చార్జీలను పెంచితే తిరుగుబాటు మొదలైందని కమ్యూనిస్టులు ప్రాణ తాగాలని కూడా చేసి పోరాడారని గుర్తు చేశారు పట్టణ కార్యదర్శి జూనెబో యిన శ్రీనివాసరావు మాట్లాడుతూ కార్పొరేట్ల దోపిడీ ప్రభుత్వాల అవినీతిని అరికడితే కరెంటు చార్జింగ్ తగ్గించవచ్చని తెలిపారు సహాయ కార్యదర్శి అంబోజి శివాజీ మాట్లాడుతూ ప్రజలపై అదనపు కారాన్ని మోపుతూ ఉప్పు పప్పు దగ్గర నుంచి విద్యుత్ చార్జీల వరకు మూతమోగించిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి దక్కిందని పేర్కొన్నారు ఛార్జిల పేరుతో ప్రజానీకానికి కసిని కోతని విధిస్తున్నారని సిపిఎం పార్టీ సెక్రెటరీ సోమోజు నాగమణి అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు పోతుపాక వెంకటేశ్వర్లు భోగ్యం నాగులు మా శెట్టి రమేష్ బాబు మహమ్మద్ అస్దుల్లా షేక్ జానీ శ్రీనివాసరావు విజయ రాణి కిషోర్ సిపిఎం నాయకులు కోటా కృష్ణ తదితర కాకరబోయిన లింగారావు వెంకటేశ్వర్లు అయితే సిపిఐ సిపిఎం కార్యకర్తలు నాయకులు సానుభూతిపరులు భారీగా పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img