Friday, May 3, 2024
Friday, May 3, 2024

వత్సవాయి మండలంలో అక్రమంగా క్యాట్ ఫిష్ ల పెంపకం

దాణాగా కోళ్ల వ్యర్థాలు
భారీగా వత్సవాయి -అల్లూరుపాడు వ్యర్థాల తరలింపు
మండలంలో కాసుల వర్షం కురిపిస్తున్న క్యాట్ ఫిష్
(విశాలాంధ్ర) వత్సవాయి : క్యాట్ ఫిష్ ల పెంపకంపై నిషేధం ఉంది. కానీ వత్సవాయి మండలం లోని అల్లూరుపాడు -వత్సవాయి సరిహద్దు ప్రాంతాలలో చాటుమాటుగా క్యాట్ ఫిష్ ల పెంపకాలు జోరుగా జరుగుతునే ఉన్నాయి.ఆల్లూరుపాడు గ్రామంలో కొంతమంది అక్రమ వ్యాపారం చేస్తున్నారు….
సాధారణంగా చేపలు తింటే మంచిదని నిపుణులు చెబుతారు. చేపలు నీటిలో ఉండే నాచు ..చిన్న చిన్న చేపల్ని పెద్ద చేపలు తిని పెరుగుతాయి. కానీ క్యాట్ ఫిష్ లు మాత్రం అలా కాదు కుళ్లిపోయిన జీవరాశుల కళేబరాలు..కుళ్లిన వ్యర్థాలు తిని భారీగా పెరిగిపోతాయి. అంతేకాదు క్యాట్ ఫిష్ లు పెంచే చెరువుల్లో ప్రమాదవశాత్తు ఏమైనా జంతువులు గానీ దిగితే వాటిని కూడా క్యాట్ ఫిష్ లు స్వాహా చేసేస్తాయి. దొరికితే మనుషుల్ని కూడా చంపి తినేస్తాయి. అంటే క్యాట్ ఫిష్ లు ఓ రకమైన రాకాసి చేపలు అని చెప్పుకోవచ్చు. ఈ క్యాట్ ఫిష్ లు మంచినీటిలోనే కాదు మురుగునీరు..ఆఖరికి డ్రైనేజీ నీటిలో కూడా పెరుగుతాయి.క్యాట్ ఫిష్ ల పెంపకానికి పెద్దగా ఖర్చు ఉండదు. పైగా వీటికి ఆహారంగా చనిపోయిన కోళ్లు, కుళ్లిపోయిన వ్యర్థాలు వేసి పెంచుతారు. ఖర్చు తక్కువ..అతి త్వరగానే పెరిగిపోయే ఈ చేపల పెంపకానికి పెద్దగా కష్టపడనక్కరలేదు. పైగా భారీగా పెరుగుతాయి. వీటిని తింటే ఆరోగ్యానికి హాని కూడా. దీంతో ఈ క్యాట్ ఫిష్ ల పెంపకాలపై నిషేధం ఉంది. కానీ మండలం లోని పలు ప్రాంతాల్లో రహస్యంగా క్యాట్ ఫిష్ ల పెంపకాలు జరగుతున్నాయి. భారత్ లో క్యాట్ ఫిష్ ల పెంపకాలతో పాటు అమ్మటాన్ని కూడా నిషేధించారు.
నిషేధం ఉండీ అవి తింటే ఆరోగ్యానికి హానికరంగా ఉండే ఈ చేపల్ని ఎవరు తింటారు? ఎందుకు కొంటారు? అనే అనుమానం రావచ్చు. అక్కడే ఉంది ఈ క్యాట్ ఫిష్ లు అమ్మే వ్యాపారుల కిటుకు..ఈ క్యాట్ ఫిష్ ా ఎంతో డిమాండ్ ఉండే కొరమీను్ణ చేపలా కనిపిస్తుంది. కొరమీనుకు..క్యాట్ ఫిష్ కు తేడా తెలియని వారు దాన్నే కొరమీను అనుకుని కొనేస్తుంటారు. పైగా కొరమీను కిలో రూ.400లు ఉంటే క్యాట్ ఫిష్ మాత్రం మహా అయితే కిలో రూ.150 ఉంటుంది.కొరమీనులాగా క్యాట్ ఫిష్ నల్లగా జిగురుగా ఉంటుంది. కానీ క్యాట్ పిష్ కు మీసాలుంటాయి. కొర్రమీనుకు మీసాలు ఉండవ్. దీంతో చేపల వ్యాపారులు తెలివి ఉఫయోగించి..క్యాట్ ఫిష్ కు ఉండే మీసాలు కట్ చేసి అమ్మేస్తుంటారు. కొర్రమీనుకు..క్యాట్ ఫిష్ కు తేడాలు తెలియనివారు దాన్నే కొరమీను అనుకుని కొనేస్తుంటారు. ఇటువంటి మోసాలతో నిషేధం ఉన్న క్యాష్ ఫిష్ ల దందా కొనసాగుతోంది. అటు రహస్య పెంపకాలు ఇటు మోసాల అమ్మకాలతో క్యాట్ ఫిష్ ల దందా కొనసాగుతూనే ఉంది. అలా అక్రమ పెంపకాలను..మోసాల అమ్మకాలు కొనసాగుతునే ఉన్నాయి. పొలాల మధ్యలో ఉండే చిన్న చిన్న చెరువుల్లో క్యాట్ ఫిష్ ల పెంపకాలు యదేచ్ఛగా కొనసాగిస్తున్నారు కోళ్ల వ్యర్థాలను వివిధ మండలాల నుంచి భారీగా కొనుగోలు చేసి అర్ధరాత్రి సమయంలో పెనుగంచిప్రోలు నుండి వత్సవాయి మండలంలోని ఆల్లూరుపాడు గ్రామానికి భారీ స్థాయిలో వాహనాలు యదేచ్చగా తిరుగుతున్నాయి ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు ప్రజలకు క్యాన్సర్ వాదిని కలిగించే క్యాట్ ఫిష్ లను మరియు అక్రమ కోళ్ల వ్యర్ధాల తరలింపుపై దృష్టి సారించి సంబంధిత చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img