Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఉత్పాదక రంగం తోనే యువతకు ఉజ్వల భవిష్యత్తు

విశాలాంధ్ర – కర్నూలు సిటీ : యువత కేవలం సేవారంగంపై మొగ్గుచూపుక ఉత్పాదక రంగం వైపు అడుగులు వేస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని అనంతపురం జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ఉపకులపటి ఆచార్య జి.రంగజనార్ధన అన్నారు. సోమవారం స్థానిక జి. పుల్లయ్య ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ద్వితీయ స్నాతకోత్సవ వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ముందుగా ఇంజనీరింగ్ పట్టా పుచ్చుకుంటున్న విద్యార్థినీ విద్యార్థులను అభినందిస్తూ వారికి దిశ నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఉపకులపతి మాట్లాడుతూ దేశ భవిష్యత్తు ఆర్థిక రంగంపై ఉందన్నారు. చిన్న దేశాలైన తైవాన్, దక్షిణ కొరియా వంటివి ఆర్థికంగా నిలదొక్కుకున్నాయని,అది కేవలం ఆయా దేశాలు ఉత్పాదకరంగంలో సాధించిన అభివృద్ధే కారణం అని ఆయన పేర్కొన్నారు. అనంతరం కళాశాల వ్యవస్థాపకులు జి.పుల్లయ్య మాట్లాడుతూ కర్నూలు నగరంలోని తమ కళాశాల పెద్ద పెద్ద నగరంలోని డీమ్డ్ విశ్వవిద్యాలయాలకు ధీటుగా ప్లేస్మెంట్స్ సాధిస్తూ విద్యార్థులకు ,తల్లిదండ్రులకు గట్టి భరోసా ఇస్తున్నామన్నారు. అదేవిధంగా విద్యార్థినీ విద్యార్థులు చదువుకుంటూనే సంపాదన వైపు దృష్టి పెట్టినట్లయితే ఆ విద్యార్థి లేదా విద్యార్థిని జీవితంలో రాణిస్తారన్నారు. పాశ్చాత్య దేశాల్లో ఉన్న ఈ సంస్కృతి మనదేశంలో కూడా రావాలని అభిలాషించారు .రానున్న రోజుల్లో భారతదేశం మూడవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని దీనికి మూల కారణం యువభారతమే అని అన్నారు . పట్టభద్రులైన ప్రతి విద్యార్థి తమ తల్లిదండ్రులు గర్వపడేలా, జాతి నిర్మాణంలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు .దేశం గుర్తించేలా ప్రవర్తించాలని సూచించారు .ఈ సందర్భంగా బ్రాంచీల వారిగా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినీ విద్యార్థులకు ముఖ్య అతిథి బంగారు పథకాలను ప్రధానం చేశారు .అనంతరం కళాశాల చైర్మన్ జి.వి.యం. మోహన్ కుమార్ విద్యార్థినీ విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 489 మంది విద్యార్థినీ విద్యార్థులు గ్రాడ్యుయేషన్ పట్టాలు పుచ్చుకుంటున్నారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి. శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ వై. పాండురంగయ్య,అడ్మన్ డీన్ డాక్టర్ ఎం. గిరిధర్ కుమార్ ,డీన్లు మరియు వివిధ శాఖాధిపతులు, విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img