విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల కేంద్రమైన పెద్దకడబూరులోని 1వ వార్డులో చెడిపోయిన చేతిపంపుకు మంగళవారం మెకానిక్ పౌలయ్య స్థానికుల సహాయంతో మరమ్మతులు చేశారు. చేతి పంపులోని పైపులు తీసి కొత్త పరికరాలను వేసి మరమ్మతులు చేశారు. దీంతో చేతిపంపులో నుంచి నీళ్లు రావడంతో చుట్టూ పక్కల కుటుంబాలు సంతోషం వ్యక్తం చేశారు. గ్రామ సర్పంచ్ రామాంజనేయులుకు కాలనీ వాసులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.