Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

జిల్లాలో నకిలీ నోట్ల కలకలం…

– దొంగనోట్ల కేసులో కానిస్టేబుల్
– సస్పెండ్ చేసిన అధికారులు

విశాలాంధ్ర – ఆస్పరి : చెప్పేవి శ్రీరంగనీతులు, చేసేవన్ని పనికిమాలిన పనులు అన్నట్టు.. కొందరు పోలీసు అధికారులు తమ ఖాకీ దుస్తుల్ని అడ్డం పెట్టుకొని అవినీతి కార్యకలాపాలకు పాల్పడుతుంటారు. ఇప్పుడు ఓ కానిస్టేబుల్ కూడా దొంగనోట్ల చలామణి కేసులో అడ్డంగా బుక్కయ్యాడు. ఒక అసలు నోటుకి మూడు నకిలీ నోట్లు ఇస్తానంటూ.. రాజకీయ నేతల నుంచి రూ.4 లక్షలు తీసుకున్నాడు. అయితే.. ఆ కానిస్టేబుల్ నకిలీ నోట్లను ఇవ్వడంలో విఫలం అవ్వడంతో, స్టోరీ మరో మలుపు తీసుకుంది. అతడ్ని కిడ్నాప్ చేయాలని నేతలు భావించారు. ఇంతలో ఈ వ్యవహారం పైఅధికారులకి తెలియడంతో కథ పోలీస్ స్టేషన్‌కి చేరింది. ఆ వివరాల్లోకి వెళ్తే… మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ విజయ్ కుమార్ దోంగనోట్లను చెలామణీ చేస్తున్నారు. ఈ విషయం ఇద్దరు అధికార పార్టీ రాజకీయ నాయకులకు తెలిసింది. దీంతో ఆ కానిస్టేబుల్‌తో వాళ్లిద్దరు ఓ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒక అసలు నోటుకి మూడు నకిలీ నోట్లు చొప్పున ఇస్తానని ఆ కానిస్టేబుల్ చెప్పాడు. దీంతో వాళ్లు అతనికి రూ.4 లక్షలు ఇచ్చారు. అయితే ఒప్పందం ప్రకారం ఆ కానిస్టేబుల్ నకిలీ నోట్లు ఇవ్వలేదు. దాంతో కోపాద్రిక్తులైన ఆ నాయకులు కానిస్టేబుల్‌ని కిడ్నాప్ చేసి, తగిన బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు. ఓ హత్య కేసులో రెండు రోజుల క్రితమే బెయిల్‌పై బయటకు వచ్చిన కారుమంచి గ్రామానికి చెందిన వారితో కానిస్టేబుల్‌ ను కిడ్నాప్ చేయాలని పక్కా స్కెచ్ వేసుకున్నారు. ఇంతలోనే ఈ విషయం బయటకు పొక్కడంతో అటు, ఇటు చక్కర్లు కొడుతూ చివరికి పోలీసు అధికారులకు తెలిసింది. దీంతో అధికారులు వెంటనే ఆ కానిస్టేబుల్‌ని కర్నూలుకు పిలిపించి విచారించారు. అతడిచ్చిన సమాచారం మేరకు.. ఆ రాజకీయ నేతల్ని కూడా కర్నూలుకి పిలిపించి, విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే మరో కుండబద్దలయ్యే వాస్తవం వెలుగులోకి వచ్చింది. దొంగనోట్ల వ్యవహారంలో బళ్ళారి, హైదరాబాద్‌కు చెందిన గ్యాంగ్‌తోనూ సంబంధాలు ఉన్నాయని తేలింది. ఈ నేపథ్యంలోనే అధికారులు మరింత కూపీ లాగేందుకు.. లోతుగా విచారణ చేపట్టారు. అయితే.. డిపార్ట్‌మెంట్ పరువు పోతుందని రహస్యంగా విచారిస్తున్నారు. ఏకంగా రాజకీయ నేతలకు మస్కా కొట్టబోయిన కానిస్టేబుల్ ఇప్పుడు ఉద్యోగానికి ఎసరు తెచ్చుకున్నారు. కానిస్టేబుల్‌ విజయ్ కుమార్ ను జిల్లా పోలీస్ అధికారులు విఆర్ కు తీసుకుని సస్పెండ్ చేసినట్లు సమాచారం. ఈ నకిలీ కరెన్సీ నోట్ల వ్యవహారానికి సంబంధించి పోలీసు అధికారుల నుండి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img