Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

గ్రామాల్లో మౌళిక వసతులు కల్పించాలి. సిపిఐ

విశాలాంధ్ర, పెద్దకడబూరు : మండల పరిధిలోని వివిధ గ్రామాలలో మౌళిక వసతులు కల్పించాలంటూ మంగళవారం మండల కేంద్రమైన పెద్దకడబూరులోని స్థానిక మండల పరిషత్ కార్యాలయం ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్య వర్గ సభ్యులు భాస్కర్ యాదవ్, మండల కార్యదర్శి వీరేష్, సహాయ కార్యదర్శి చంద్ర, రైతు సంఘం తాలూకా కార్యదర్శి ఆంజనేయ మాట్లాడుతూ మండల పరిధిలోని వివిధ గ్రామాలలో డ్రైనేజీ, వీధి దీపాలు, తాగునీటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. గ్రామాల్లో వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని పారిశుధ్యం నెలకొల్పాలని డిమాండ్ చేశారు. కొన్ని గ్రామాల్లో పారిశుధ్యం లోపించినా పంచాయతీ కార్యదర్శులు పట్టించుకోవడం లేదన్నారు. పెద్దకడబూరులో డ్రైనేజీలలో పూడిక పేరుకోపోయిందని కానీ వాటిని తీయకపోవడంతో మురుగు నీరు రోడ్లపై ప్రవహిస్తున్నాయని పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులుకు విన్నవించినా పట్టించుకోవడం లేదని విమర్శించారు. వెంటనే పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇందుకు స్పందించిన ఎంపీడీఓ శ్రీనివాసరావు సమస్యలను పరిష్కరించి, పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకొంటానని హామీ ఇచ్చారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఎంపీడీఓకు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు గోపాల్, తిక్కన్న, రామాంజనేయులు, వీరేష్, సర్ధాజ్ పటేల్, నర్సింహులు, హనుమంతు, రెక్కల గిడ్డయ్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img